[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-why-is-a-garland-of-betel-leaves-offered-to-lord-hanuman":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":107},4985,1653,"spirituality-why-is-a-garland-of-betel-leaves-offered-to-lord-hanuman","Spirituality: హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?","రావణ సంహారం ముగిసింది. జగన్మాత సీతాదేవిని అశోకవనంలో బంధించి ఉంచిన సంకెళ్లు తెగిపోయాయి. లోకాలన్నీ జయహో శ్రీరామ్ అని జయ జయధ్వానాలు చేస్తున్నాయి. ఆ మహోన్నత విజయాన్ని, రాముడి దివ్య సందేశాన్ని సీతమ్మవారికి ముందుగా అందించే భాగ్యం ఆ రామదూతకే దక్కింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F525265b2-61b0-437b-bb78-db2895a12237.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F525265b2-61b0-437b-bb78-db2895a12237.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23,24,25],"Spirituality","Devotional","betel leaf","temple","pooja","Lord Hanuman","sri ram","5 నిమిషాల పఠనం","2026-09-04T01:50:02+00:00","2026-09-04T01:50:44+00:00",106,"\u003Cp>హనుమంతుడు అంటే అపారమైన బలవంతుడు మాత్రమే కాదు.. అచంచలమైన భక్తి, వినయం, ధైర్యం, శ్రీరామునిపై సంపూర్ణ శరణాగతి ఉన్న భక్తుడు.. అందుకే ఆంజనేయస్వామికి వివిధ పుష్పాలు, ఆకులతో చేసే అలంకరణలకు భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని శాస్త్రాలు చెబుతాయి.. ఇక ఏ భక్తజన హృదయంలో రామనామం పలికినా, అక్కడ ముందుగా ప్రత్యక్షమయ్యే దివ్యరూపం... మన హనుమంతులవారు. \u003C\u002Fp>\u003Cp>ఆపదల్లో అండగా నిలిచే అభయాంజనేయుడికి మనం అనేక పూజలు చేస్తాం. కానీ, స్వామివారికి తమలపాకుల మాల వేసి నమస్కరిస్తే... ఆ స్వామి హృదయం దయాసముద్రమై పొంగిపోతుంది! అసలు ఆంజనేయునికి తమలపాకుల మాల సమర్పించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో, ఆ దివ్య లీల ఏమిటో తెలుసుకుందాం...\u003C\u002Fp>\u003Cp>రావణ సంహారం ముగిసింది. జగన్మాత సీతాదేవిని అశోకవనంలో బంధించి ఉంచిన సంకెళ్లు తెగిపోయాయి. లోకాలన్నీ జయహో శ్రీరామ్ అని జయ జయధ్వానాలు చేస్తున్నాయి. ఆ మహోన్నత విజయాన్ని, రాముడి దివ్య సందేశాన్ని సీతమ్మవారికి ముందుగా అందించే భాగ్యం ఆ రామదూతకే దక్కింది. వాయువేగంతో అశోకవనానికి చేరుకున్న హనుమ, అమ్మా! శ్రీరామచంద్రులవారు విజయం సాధించారు. లోకానికి మంగళం చేకూరింది అని శుభవార్తను అందించాడు.\u003C\u002Fp>\u003Cp>ఆ శుభవార్త విన్న సీతాదేవి ఆనందానికి అవధులు లేవు! దుఃఖసాగరంలో ఉన్న తనకు కన్నతండ్రిలాంటి ఆనందాన్ని ఇచ్చిన హనుమంతుడిని ఎలా ఆశీర్వదించాలో, ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో అమ్మకు తోచలేదు. తన చుట్టూ వెతికింది... అక్కడ ఆకుపచ్చగా నిగనిగలాడుతూ, లక్ష్మీకళతో మెరిసిపోతున్న నాగవల్లి మొక్క కనిపించింది. వెంటనే సీతాదేవి ఆ తమలపాకులను తుంచి, ఒక సుందరమైన మాలగా అల్లింది. \u003C\u002Fp>\u003Cp>నాయనా హనుమా!.. ఈ జగత్తు ఉన్నంతవరకు నీవు అమరజీవివిగా ఉంటావు. నీ నామం స్మరించిన ప్రతిచోటా విజయం, మంగళం చేకూరుతాయని ఆశీర్వదిస్తూ... ఆ తమలపాకుల మాలను హనుమంతుని మెడలో వైభవంగా అలంకరించింది.. ఆ క్షణంలో జగజ్జనని చేతుల మీదుగా పొందిన ఆ తమలపాకుల మాల, హనుమంతునికి విశ్వంలోనే అత్యంత ప్రియమైన అలంకారంగా మారిందని మన పురాణాలు పేర్కొంటాయి.. \u003C\u002Fp>\u003Cp>ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే..  తమలపాకు లక్ష్మీస్వరూపం. అది పవిత్రతకు, నిష్కల్మషమైన ఆనందానికి ప్రతీక. మనం హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పించినప్పుడు.. అమ్మా సీతాదేవీ! నా హనుమంతుడిని ఎలాగైతే నీవు వాత్సల్యంతో ఆశీర్వదించావో, నన్ను కూడా అలాగే కాపాడని అమ్మవారి ఆశీస్సులను స్వామికి గుర్తుచేయడమని చెబుతారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే పచ్చని తమలపాకు మన హృదయానికి సంకేతం. ఎలాంటి కపటం లేకుండా, పచ్చని ప్రకృతిలా పవిత్రమైన భక్తితో ఆ తమలపాకుల మాలను స్వామి పాదాల చెంత ఉంచితే... మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే సకల భయాలు, శనిదోషాలు, మానసిక ఆందోళనలు పటాపంచలైపోతాయనేది భక్తుల నమ్మకం.. అదీగాక తమలపాకును భారతీయ పూజా సంప్రదాయంలో శుభప్రదమైనదిగా భావిస్తారు. పూజా కార్యక్రమాల్లో దీనిని వినియోగించడం అనాదిగా వస్తున్న ఆచారం.. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఓం శ్రీ ఆంజనేయాయ నమః\u003C\u002Fstrong> \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>శ్రీరామదూతాయ నమః\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Gemini_Generated_Image_dwkscpdwkscpdwks (1).png",[],{"title":36,"description":37},"హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?","రావణ సంహారం ముగిసింది. జగన్మాత సీతాదేవిని అశోకవనంలో బంధించి ఉంచిన సంకెళ్లు తెగిపోయాయి. లోకాలన్నీ జయహో శ్రీరామ్ అని జయ జయధ్వానాలు చేస్తున్నాయి. ఆ మహోన్నత విజయాన్",[39,47,54,62,68,76,83,89,96,102],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":44,"published_at":45,"public_read_count":46},"telangana-is-this-the-anarchy-that-prevailed-during-the-ten-year-rule-of-the-doras","Telangana: ఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!?..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff36bc171-476f-4e68-8afc-0e74223b87cb.jpg","9 నిమిషాల పఠనం","2026-09-04T02:26:59+00:00",157,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":26,"published_at":53,"public_read_count":29},"ravi-teja-prabhas","Ravi Teja: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F52fa516b-6819-4899-9b88-d4921fca59c4.webp","Anshu","2026-09-04T02:31:00+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":59,"published_at":60,"public_read_count":61},"weather-warning-the-globe-is-heating-up-in-unimaginable-ways","Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbdf7fd85-0dee-4615-8259-5bde2fdf49eb.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T02:49:39+00:00",259,{"slug":63,"title":64,"category":50,"image":65,"author":52,"read_time":66,"published_at":67,"public_read_count":29},"vishwambhara-2027-samkranthi","Vishwambhara: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6db842c9-6ed0-4239-898e-871c00f0b1d1.webp","4 నిమిషాల పఠనం","2026-09-04T03:06:00+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":73,"published_at":74,"public_read_count":75},"isro-india-gains-a-super-eye-gslv-f17-launch-successful","ISRO: భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdfb024f-593c-4832-9244-939505dbcdd8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-04T03:10:00+00:00",55,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":80,"published_at":81,"public_read_count":82},"spirituality-an-eternal-guide-for-humanity-this-is-the-spiritual-secret-hidden-in-the-life-of-sri-krishna","Spirituality: మానవాళికి నిత్య మార్గదర్శి... శ్రీకృష్ణుడి జీవితంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F38a60250-7bd2-4084-9362-0ee9c9db28d3.jpg","7 నిమిషాల పఠనం","2026-09-04T01:34:50+00:00",208,{"slug":84,"title":85,"category":42,"image":86,"author":87,"read_time":59,"published_at":88,"public_read_count":82},"susmitha-challene-to-revanth","కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3394170c-953e-4a2f-8b9f-8a56d0f8c5f8.jpg","Kashi","2026-09-03T18:28:24+00:00",{"slug":90,"title":91,"category":42,"image":92,"author":93,"read_time":73,"published_at":94,"public_read_count":95},"cm-revanth-reddy-kodangal-tour-schedule","Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర్యటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9065f03a-b38d-4f05-b030-1447ecd3a33b.jpg","NK","2026-09-03T18:26:41+00:00",4,{"slug":97,"title":98,"category":42,"image":99,"author":93,"read_time":100,"published_at":101,"public_read_count":95},"minister-ponguleti-srinivas-reddy-warns-revenue-department-officials","Ponguleti Srinivas Reddy: మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయి- రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb9e92c08-6b12-4b50-8464-6848b9c51ccd.jpg","14 నిమిషాల పఠనం","2026-09-03T18:07:46+00:00",{"slug":103,"title":104,"category":42,"image":105,"author":93,"read_time":26,"published_at":106,"public_read_count":29},"no-one-can-scare-me-cm-revanth-reddy-interesting-comments-in-saidabad","Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు-సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19d772cd-77d9-4d71-8413-684fe9cce80c.jpg","2026-09-03T17:17:19+00:00",[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]