[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-this-is-the-spiritual-secret-hidden-behind-vinayaka-chavithi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":78},5733,2020,"spirituality-this-is-the-spiritual-secret-hidden-behind-vinayaka-chavithi","Spirituality: వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","చంచలమైన మనస్సుకు, అదుపులేని కోరికలకు ప్రతీకగా భావించే మూషికంపై గణపతి అధిష్ఠించడం.. మన కోరికలపై మనస్సుకు ఆధిపత్యం ఉండాలి అనే భావాన్ని తెలియజేస్తుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66acdf6a-561a-4910-8927-ccca4a747881.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66acdf6a-561a-4910-8927-ccca4a747881.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23],"spiritual","Ganesha Festival","secret","Vinayaka Chavithi","pooja","4 నిమిషాల పఠనం","2026-09-11T00:25:45+00:00","2026-09-11T00:26:55+00:00",55,"\u003Cp>వినాయక చవితి అంటే కేవలం గణపయ్యను ఇంటికి తీసుకొచ్చి పూజించే పండుగ మాత్రమే కాదు.. మనిషి జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే పవిత్రమైన రోజని మన వేదాలు చెబుతాయి.. పురాణాల్లో గణపతిని విఘ్నేశ్వరుడిగా, జ్ఞానానికి అధిపతిగా, బుద్ధికి ప్రతీకగా వర్ణించారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించే సంప్రదాయం వెనుక కూడా ఇదే అంతరార్థం ఉంది. ఇక గణపతి రూపంలోనే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయని పేర్కొంటారు..\u003C\u002Fp>\u003Cp>ఆయన పెద్ద చెవులు.. మంచి మాటలను శ్రద్ధగా వినాలని చెబుతాయి. చిన్న కళ్ళు.. లక్ష్యంపై ఏకాగ్రతతో దృష్టి పెట్టాలని సూచిస్తాయి. ఏనుగు తొండం.. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, అవసరమైనప్పుడు బలాన్ని.. సున్నితత్వాన్ని ప్రదర్శించే వివేకాన్ని గుర్తుచేస్తుంది. అలాగే ఏకదంతుడైన గణపతి.. జీవితంలోని ద్వంద్వాలను దాటి సత్యాన్ని గ్రహించమనే సందేశాన్ని ఇస్తాడు. ఆయన పెద్ద ఉదరం.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను సహనంతో జీర్ణించుకోవాలని సూచిస్తుంది.\u003C\u002Fp>\u003Cp>ఇక గణపతి వాహనమైన మూషికం కూడా ఒక గొప్ప తాత్త్విక సందేశమే. చంచలమైన మనస్సుకు, అదుపులేని కోరికలకు ప్రతీకగా భావించే మూషికంపై గణపతి అధిష్ఠించడం.. మన కోరికలపై మనస్సుకు ఆధిపత్యం ఉండాలి అనే భావాన్ని తెలియజేస్తుంది. వీటితో పాటు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి.. పూజించి.. చివరికి నిమజ్జనం చేయడం వెనుక మరింత లోతైన సందేశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>మట్టితో ఏర్పడిన రూపం.. పూజతో పవిత్రమై.. చివరికి అదే ప్రకృతిలో కలిసిపోతుంది. ఇది మనిషి శరీరం కూడా ప్రకృతి నుంచే వచ్చి.. చివరకు ప్రకృతిలోనే లీనమవుతుందనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.. ఇక బయట గణపతిని ప్రతిష్ఠించడం మాత్రమే కాదు.. మన హృదయంలో జ్ఞానాన్ని ప్రతిష్ఠించాలి. అహంకారాన్ని తొలగించాలి. మనస్సును అదుపులో పెట్టాలి. ధర్మమార్గంలో నడవాలి. అప్పుడు మన జీవితంలోని విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహం.. మనలోనే ఒక శక్తిగా మేల్కొంటుందని పురాణాలు చెబుతాయి.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ChatGPT Image Sep 11, 2026, 05_36_13 AM (1).png",[],{"title":34,"description":12},"వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!",[36,44,51,56,64,72],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":41,"published_at":42,"public_read_count":43},"health-what-causes-a-heart-attack-and-what-are-the-early-symptoms","Health: హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb8a632d1-927a-4f49-ad6e-f6a74c973630.jpg","7 నిమిషాల పఠనం","2026-09-11T00:53:34+00:00",769,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":27},"kurnool-major-accident-at-pothireddypadu-9th-gate-rope-snaps","Kurnool: పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రమాదం.. తెగిపోయిన  9వ గేటు రోప్!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7695d745-6959-46ce-9fcf-4404a8af3d97.jpg","3 నిమిషాల పఠనం","2026-09-11T00:18:37+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":24,"published_at":55,"public_read_count":27},"spirituality-a-little-known-spiritual-wonder-at-tirumala-the-secret-behind-the-aromatic-fragrance","Spirituality: తిరుమలలో తెలియని ఆధ్యాత్మిక విశేషం.. పరిమళపు అర రహస్యం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0fa296d9-f2d5-4cfe-997a-9288495c27ae.jpg","2026-09-11T00:10:21+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":24,"published_at":62,"public_read_count":63},"rajagopal-reddy-says-congress-high-command-promised-minister-post","TG : మంత్రి పదవిపై హైకమాండ్‌ మాటిచ్చింది : రాజగోపాల్‌ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e00b90d-d261-4451-845f-60d517d0c1f1.jpg","Mahesh","2026-09-10T16:35:23+00:00",106,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":49,"published_at":70,"public_read_count":71},"realtor-ram-reddy-ends-life-at-farmhouse-in-ranga-reddy","Ram Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aafce6d-ff00-444e-b327-e70a90f5069b.jpg","NK","2026-09-10T16:28:56+00:00",4,{"slug":73,"title":74,"category":59,"image":75,"author":61,"read_time":41,"published_at":76,"public_read_count":77},"brs-congress-fight-for-sympathy-while-public-issues-take-backseat-in-telangana-assembly","TG :  సింపతీ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F713dcb84-260e-4cfa-9808-3f6134cd7ff1.jpg","2026-09-10T16:22:09+00:00",157,[79,84,87,89,91,93],{"title":80,"sponsor":81,"image":82,"url":83},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":85,"sponsor":86,"image":82,"url":83},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":88,"sponsor":86,"image":82,"url":83},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":90,"sponsor":86,"image":82,"url":83},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":92,"sponsor":86,"image":82,"url":83},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":94,"sponsor":86,"image":82,"url":83},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]