[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-they-say-that-dying-in-kashi-leads-to-liberation-why":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":104},4689,1508,"spirituality-they-say-that-dying-in-kashi-leads-to-liberation-why","Spirituality: కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుకు?","ముక్తి అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి..  అహంకారం, కర్మబంధం, అవిద్య నుంచి ఆత్మ విముక్తి పొందడం.. ఇదే కాశీ మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F15014c17-b4ad-46ca-9dab-0cfdbaad3b69.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F15014c17-b4ad-46ca-9dab-0cfdbaad3b69.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23,24],"Spirituality","Devotional","Kashi","Hindu","Death","Lord Parameshwara","4 నిమిషాల పఠనం","2026-09-01T02:26:15+00:00","2026-09-01T02:27:52+00:00",55,"\u003Cp>కాశీ నగరం కేవలం దర్శించడానికే కాదు, తమ శేష జీవితాన్ని ధారపోసి, ఆఖరి శ్వాసను విడవడానికి వేలాది మంది ఎంచుకునే ఆధ్యాత్మిక గమ్యస్థానం. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలని ఆశిస్తే.. కొందరు తమ జీవితపు అంతిమ గడియలు అక్కడే ముగించాలని తపిస్తారు.. ఈ కోరిక వెనుక సనాతన ధర్మం అందించిన అత్యున్నతమైన ఆత్మజ్ఞానం, సుదీర్ఘమైన ఆధ్యాత్మిక విశ్వాసం ఉందని పండితులు చెబుతారు.. \u003C\u002Fp>\u003Cp>కాలం కూడా మోకరిల్లే పవిత్ర క్షేత్రం కాశీ.. \u003Cstrong>కాశ్యాం తు మరణాన్ముక్తిః\u003C\u002Fstrong> అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మన సనాతన ధర్మం, వేద శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.. శాస్త్రాల ప్రకారం, కాశీ కేవలం భూమి మీద ఉన్న నగరం కాదు. ఇది పరమశివుని త్రిశూలం యొక్క కొనపై నిలిచి ఉన్న దివ్య క్షేత్రం. మన శరీరంలో వెన్నెముక ద్వారా ప్రవహించే ఇడా, పింగళ, సుషుమ్నా నాడులు భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) కలుస్తాయి. \u003C\u002Fp>\u003Cp>మన సూక్ష్మ శరీరంలోని ఈ త్రివేణి సంగమ స్థానమే కాశీ. ఆధ్యాత్మిక భాషలో దీనినే 'ఆజ్ఞా చక్రం' అంటారు. ఇక మన పురాణాలు చెప్పే రహస్యం ఏమిటంటే.. కాశీ మహాక్షేత్రంలో ఒక జీవి తన చివరి శ్వాస విడిచే సమయంలో, స్వయంగా ఆ కాశీ విశ్వనాథుడే అక్కడ ప్రత్యక్షమవుతాడు. మరణించే జీవి కుడిచెవిలో సాక్షాత్తు పరమశివుడే \"తారక మంత్రాన్ని\" ఉపదేశిస్తాడు.. \u003C\u002Fp>\u003Cp>ఆ క్షణంలో, జన్మజన్మల నుండి ఆ జీవి వెంట వస్తున్న పాపపుణ్యాల సంకెళ్లు, కర్మబంధాలన్నీ ఒక్కసారిగా భస్మమైపోయి.. జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి, ఆ ఆత్మ సాక్షాత్తు పరమశివుని సాన్నిధ్యాన్ని లేదా సాయుజ్య ముక్తిని పొందుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.. అయితే, కేవలం భౌతికంగా కాశీకి వెళ్లడమే కాదు.. మన మనస్సును, హృదయాన్ని కాశీగా మార్చుకుని, చివరి ఘడియలో కామ, క్రోధ, లోభ, మోహాలను వదిలి, ఆ పరమేశ్వరుడిపై ధ్యానం నిలిపినా ముక్తి లభిస్తుందని జ్ఞానులు చెబుతారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక ముక్తి అంటే కేవలం మరణం కాదు. ముక్తి అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి..  అహంకారం, కర్మబంధం, అవిద్య నుంచి ఆత్మ విముక్తి పొందడం.. ఇదే కాశీ మనకు నేర్పించే ఆధ్యాత్మిక పాఠం. ఇక్కడ జీవితం నుంచి మరణాన్ని దూరంగా పెట్టరు.. మరణాన్ని చూసి భయపడటం కంటే, మరణం అనివార్యమని అంగీకరించి జీవిత సత్యాన్ని తెలుసుకునేలా చేస్తారు. అందుకే కాశీలో మరణించాలని కోరుకోవడం కంటే.. కాశీ మనకు చూపించే సత్యాన్ని గ్రహించడం గొప్ప సాధనగా చెబుతారు.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-08-31 at 10.12.09 PM.jpeg",[],{"title":35,"description":12},"Spirituality: కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుక",[37,44,52,59,65,72,77,84,92,98],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":28},"vikarabad-vikarabad-department-of-agriculture-groundnut-seed-distribution","Vikarabad: సబ్సిడీ నిధులు గోల్‌మాల్.. కలెక్టర్ నివేదికతో కదిలిన ఫైల్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd82d3842-db55-4b3e-b1c4-439dd54dd92e.webp","5 నిమిషాల పఠనం","2026-09-01T02:52:58+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":25,"published_at":50,"public_read_count":51},"pm-modi-not-war-but-peace-is-the-way-modi-delivers-a-message-of-peace-in-putins-presence","PM Modi: 'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8d943977-e014-4556-a12c-3112603b4b00.jpg","Mamatha puppala","2026-09-01T03:19:05+00:00",310,{"slug":53,"title":54,"category":47,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"cyber-crime-cybercriminals-new-plan-online-fraud-under-the-guise-of-donations","Cyber crime: సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81d0c4a-5bc8-4cae-8a34-5b1f571368c8.webp","6 నిమిషాల పఠనం","2026-09-01T03:31:44+00:00",106,{"slug":60,"title":61,"category":47,"image":62,"author":49,"read_time":25,"published_at":63,"public_read_count":64},"el-nino-effect-threat-to-irrigation-and-drinking-water-supplies-in-september-inevitable","'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff4a9ad86-2b1a-4675-8949-086a5d10576e.jpg","2026-09-01T03:41:43+00:00",208,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":49,"read_time":25,"published_at":70,"public_read_count":71},"anna-hazare-critically-ill-shifted-to-hospital-in-mumbai","అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc75e36-d661-4269-bd06-f9b14af58237.jpg","2026-09-01T04:03:01+00:00",2,{"slug":73,"title":74,"category":16,"image":75,"author":15,"read_time":42,"published_at":76,"public_read_count":28},"spirituality-who-are-the-tathastu-deities-and-what-is-the-reason-behind-them-getting-that-name","Spirituality: తథాస్తు దేవతలు అంటే ఎవరూ?.. వారికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba20c7f3-7b7e-4ea5-b11d-0462a69b1adb.jpg","2026-09-01T02:19:56+00:00",{"slug":78,"title":79,"category":47,"image":80,"author":21,"read_time":81,"published_at":82,"public_read_count":83},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",157,{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":90,"published_at":91,"public_read_count":28},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00",{"slug":93,"title":94,"category":87,"image":95,"author":21,"read_time":96,"published_at":97,"public_read_count":58},"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","11 నిమిషాల పఠనం","2026-08-31T18:09:49+00:00",{"slug":99,"title":100,"category":40,"image":101,"author":89,"read_time":96,"published_at":102,"public_read_count":103},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","2026-08-31T17:57:19+00:00",4,[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]