[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-is-this-visible-world-real-or-an-illusion":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},4399,1367,"spirituality-is-this-visible-world-real-or-an-illusion","Spirituality: కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..","ఈ జగత్తు శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించి, మనలో ఉన్న ఆ శాశ్వత ఆత్మతత్త్వాన్ని దర్శించడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. కనిపించే ప్రతి రూపం వెనుక ఉన్న ఆ అగోచరమైన దివ్యత్వాన్ని అన్వేషించడమే ఈ మానవ జన్మకు సార్థకత..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F636652ae-6261-4af4-b11b-adfb1ce46324.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F636652ae-6261-4af4-b11b-adfb1ce46324.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23],"Spirituality","World Inner Illusion","real illusion","visible world","sun","6 నిమిషాల పఠనం","2026-08-29T02:52:49+00:00","2026-08-29T02:53:57+00:00",55,"\u003Cp>ఆథ్యాత్మికత హైందవ ధర్మానికి దొరికిన అనంతమైన నిధి అని అంటారు.. ఈ భూమి పుట్టిన మొదలు నుండి నేటి వరకు కాలచక్రం తిరుగుతుంది. పగలు రాత్రి మారుతుంది.. జనన మరణాలు అన్నీ జీవులలో జరుగుతుంది. మానవ జీవన విధానంలో సైతం ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. అయిన ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఇంకా అంతుచిక్కకుండా ఉన్నాయి. వాటిలో కొన్ని మనిషిని భ్రమలో జీవించేలా చేస్తున్నాయి.. \u003C\u002Fp>\u003Cp>అయితే మనిషి ఎంత ఎదిగినా కానీ మన కళ్లకు కనిపించే రూపాలు, చెవులకు వినబడే శబ్దాలు, మనం అనుభవించే సంతోషాలు, బాధలు... ఇవన్నీ నిజమే అని మన శరీర ఇంద్రియాలు నిరంతరం నమ్మిస్తూనే ఉంటాయి. కానీ, మన సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబు మనల్ని ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకెళ్తుంది.\u003C\u002Fp>\u003Cp>శాస్త్రాలు ఈ జగత్తును పూర్తి అసత్యమని చెప్పవు... అలా అని శాశ్వత సత్యమని కూడా అనవు. జగత్తును శాస్త్రాలు \"మిథ్య\" అని నిర్వచిస్తాయి.. మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు: \"బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః\". అంటే, రూపాంతరం చెందని, ఎప్పటికీ మారని ఆ పరబ్రహ్మ ఒక్కటే శాశ్వత సత్యం. ఈ జగత్తు 'మిథ్య'... మిథ్య అంటే అబద్ధం అని అర్థం కాదు.. కాలానుగుణంగా మారిపోయేదని అర్థం.\u003C\u002Fp>\u003Cp>మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక కల కంటాం. ఆ కలలో మనకు భయం, ఆనందం, వ్యక్తులు, సంఘటనలు అన్నీ నూటికి నూరుపాళ్లు నిజంగానే అనిపిస్తాయి. కానీ మెలకువ రాగానే... ఆ కల కరిగిపోతుంది, అదంతా ఒక భ్రమ అని తేలిపోతుంది. అలాగే మనం మెలకువతో ఉన్నప్పుడు చూసే ఈ జగత్తు కూడా ఒక పెద్ద జాగృతిక స్వప్నం అని శాస్త్రాలు చెబుతాయి.. ఇక ఉపనిషత్తులు చెప్పే పరమసత్యం బ్రహ్మం.. \u003C\u002Fp>\u003Cp>ఇది మార్పులేనిది.. నిత్యమైనది.. అద్వితీయమైనది.. కానీ మనకు కనిపించే ప్రపంచం మాత్రం నిరంతరం మారుతూనే ఉంటుంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు.. అలాగే బాల్యం పోతుంది.. యవ్వనం పోతుంది.. శరీరం మారుతుంది.. చివరికి మనం నాది అని భావించినవన్నీ మనకు దూరమవుతాయి. అందుకే అద్వైత వేదాంతం ఈ జగత్తును మిథ్యా అంటుంది.\u003C\u002Fp>\u003Cp>దీనికి శాస్త్రాలు ఇచ్చే ఉదాహరణ.. చీకటిలో తాడును చూసి పామని భ్రమించడం.. ఇక్కడ పాము కనిపించింది... భయం కూడా నిజంగానే కలిగింది. కానీ వెలుగు పడినప్పుడు...అక్కడ పాము లేదని, తాడు మాత్రమే ఉందని తెలుస్తుంది. \u003C\u002Fp>\u003Cp>అలాగే.. అజ్ఞానం ఉన్నంతకాలం జగత్తు నిజంగా ఉన్నట్టు కనిపిస్తుంది.. జ్ఞానం కలిగినప్పుడు... దాని వెనుక ఉన్న బ్రహ్మతత్త్వం దర్శనమిస్తుంది. అయితే దీని అర్థం ఈ ప్రపంచాన్ని వదిలేయమని కాదు.. బంధాలను ద్వేషించమని కాదు.. కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయమని కాదు.. ఈ జగత్తులో జీవిస్తూ.. జగత్తే సత్యం కాదని తెలుసుకోవడమే జ్ఞానం.. \u003C\u002Fp>\u003Cp>సూర్యుడు ఒకడే కానీ నీటి పాత్రల్లో వేర్వేరుగా ప్రతిబింబించినట్లు... ఆ ఒక్క పరమాత్మ తత్త్వమే ఈ జగత్తులోని అనేక రూపాలుగా మనకు కనిపిస్తోంది. ఇక బృహదారణ్యక ఉపనిషత్తు \"పూర్ణమిదం\" అంటూ... ఈ విశ్వాన్ని కూడా పూర్ణత్వంతోనే దర్శిస్తుంది.. మరోవైపు కంటికి కనిపించేది మారుతుంది.. అనుభవించేది మారుతుంది.. కానీ ఆ మార్పులన్నింటినీ సాక్షిగా చూస్తున్న చైతన్యం మాత్రం మారదు. అందుకే ఆ చైతన్యమే ఆత్మ.. ఆ ఆత్మ స్వరూపమే బ్రహ్మం అంటారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక ఈ జగత్తు శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించి, మనలో ఉన్న ఆ శాశ్వత ఆత్మతత్త్వాన్ని దర్శించడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. కనిపించే ప్రతి రూపం వెనుక ఉన్న ఆ అగోచరమైన దివ్యత్వాన్ని అన్వేషించడమే ఈ మానవ జన్మకు సార్థకత అని పురాణాలు చెబుతున్నాయి.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-08-28 at 10.28.55 PM.jpeg",[],{"title":34,"description":35},"కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా లేక భ్రమనా?","ఈ జగత్తు శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించి, మనలో ఉన్న ఆ శాశ్వత ఆత్మతత్త్వాన్ని దర్శించడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. కనిపించే ప్రతి రూపం వెనుక ఉన్న ఆ అగోచరమైన ది",[37,45,53,60,65,72,77,85,93,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"sensational-developments-in-the-sumanth-case-several-doubts-raised-about-the-polices-conduct","సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2d99b42d-a3c0-49fe-849d-a9862e95c198.jpg","Swechaanews Chairman","2 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":44},"nayanthara-toxic-hai","Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faf2ea8cc-7173-4c75-b634-05e8521bd53d.webp","Anshu","4 నిమిషాల పఠనం","18 నిమిషాలు క్రితం",{"slug":54,"title":55,"category":40,"image":56,"author":42,"read_time":57,"published_at":58,"public_read_count":59},"rayadurgam-auctions-is-the-real-estate-surge-an-illusion","RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fdc47161b-5c32-4786-ba5c-f0830d26afce.jpg","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":15,"read_time":51,"published_at":58,"public_read_count":27},"suicide-sensation-in-visakhapatnam-four-members-of-the-same-family-die-by-suicide","Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F027e6c68-e564-4d7b-9a67-8cd7d450439b.jpg",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":51,"published_at":58,"public_read_count":71},"nepal-changes-its-stance-within-24-hours-declining-the-aid","NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd127c82a-5cdc-4764-8bb2-d95df3ea6cb7.jpg","Mamatha puppala",106,{"slug":73,"title":74,"category":19,"image":75,"author":15,"read_time":24,"published_at":76,"public_read_count":59},"spirituality-what-does-the-philosophy-of-lord-parameshwara-teach-humanity","Spirituality: పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F871de172-32cd-4ce1-8c89-eddff657ed36.jpg","2 గంటలు క్రితం",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":57,"published_at":83,"public_read_count":84},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","10 గంటలు క్రితం",310,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":82,"read_time":90,"published_at":91,"public_read_count":92},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం","11 గంటలు క్రితం",361,{"slug":94,"title":95,"category":48,"image":96,"author":50,"read_time":51,"published_at":91,"public_read_count":71},"shiva-nirvana-3-heros","Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg",{"slug":98,"title":99,"category":48,"image":100,"author":50,"read_time":51,"published_at":91,"public_read_count":27},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]