[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-how-many-types-of-yogas-are-there-what-are-they":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":110},4290,1314,"spirituality-how-many-types-of-yogas-are-there-what-are-they","Spirituality: యోగములు ఎన్ని రకాలు? అవి ఏమిటి?","యోగం అంటే కేవలం ఆసనాలు వేయడం, శ్వాసాభ్యాసం చేయడం ఒక్కటే కాదు. మనిషి తన శరీరం, మనసు, బుద్ధి, ఆత్మను ఉన్నతమైన చైతన్యంతో అనుసంధానం చేసుకునే ఆధ్యాత్మిక మార్గం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe2b359d6-5b27-4f62-9f17-8c9030fab4fa.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe2b359d6-5b27-4f62-9f17-8c9030fab4fa.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23,24],"Spirituality","Indian Culture","Yoga","types","Bhagavad Gita","Lord Krishna","5 నిమిషాల పఠనం","2026-08-28T01:05:49+00:00","2026-08-28T01:06:37+00:00",55,"\u003Cp>యోగం అంటే కేవలం ఆసనాలు వేయడం, శ్వాసాభ్యాసం చేయడం ఒక్కటే కాదు. మనిషి తన శరీరం, మనసు, బుద్ధి, ఆత్మను ఉన్నతమైన చైతన్యంతో అనుసంధానం చేసుకునే ఆధ్యాత్మిక మార్గం.. అదేవిధంగా భగవద్గీతలో ప్రధానంగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అనే మూడు మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఆరో అధ్యాయంలో ధ్యానయోగం గురించి శ్రీకృష్ణుడు వివరంగా ఉపదేశిస్తాడు.\u003C\u002Fp>\u003Cp>మొదటిది కర్మయోగం గురించి తెలుసుకుంటే.. మనకు అప్పగించబడిన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేస్తూ, దాని ఫలితంపై అతిగా ఆసక్తి లేదా స్వార్థపూరితమైన ఆశ లేకుండా పనిచేయడం కర్మయోగం. పని చేయడం ఆపేయడం కాదు.. ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తూ కర్తవ్యాన్ని నిర్వహించడమే దీని సారం... అలాగే రెండవది జ్ఞానయోగం. నేను ఎవరు? ఈ శరీరమేనా నేను? లేక శరీరానికి అతీతమైన ఆత్మనా? అనే ప్రశ్నల ద్వారా నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే మార్గం ఇది. \u003C\u002Fp>\u003Cp>అజ్ఞానం తొలగి ఆత్మతత్వంపై వివేకం కలగడమే జ్ఞానయోగం లక్ష్యం. ఇక మూడవది భక్తియోగం.. భగవంతుడిపై ప్రేమ, విశ్వాసం, శరణాగతి కలిగి, ప్రతి పనినీ దైవస్మరణతో చేయడం భక్తియోగం.. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.. మనసును దైవంపై నిలపడం, అహంకారాన్ని తగ్గించడం, భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధిస్తారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక ధ్యానయోగం విషయానికి వస్తే.. ఇంద్రియ విషయాల గురించి తపించే మనస్సును ఏకాగ్రతతో ఆత్మ తత్వంపై నిలపడం దీని ప్రధాన లక్ష్యం. భగవద్గీత ఆరో అధ్యాయం ధ్యానయోగానికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తుంది. అయితే పతంజలి యోగసూత్రాలలో చెప్పే యోగం వీటికి కొంత భిన్నంగా ఉంటుంది. పతంజలి మహర్షి యోగశ్చిత్తవృత్తినిరోధః అని యోగాన్ని నిర్వచించారు. అంటే మనస్సులో నిరంతరం ఉద్భవించే చంచలమైన వృత్తులను నియంత్రించి, మనస్సును స్థిరపరచడమే యోగం అని అర్థం.. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు పతంజలి వివరించిన అష్టాంగయోగం ఎనిమిది అంగాలతో ఉంటుంది. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి ఒక్కొక్క మెట్టుగా మనిషిని బాహ్య నియమాల నుంచి అంతర్ముఖ సాధన వైపు తీసుకెళ్తాయి. ఇందులో యమ, నియమాలు జీవన విధానాన్ని శుద్ధి చేస్తాయి. ఆసనం శరీరాన్ని స్థిరపరుస్తుంది. ప్రాణాయామం శ్వాసను క్రమబద్ధం చేస్తుంది. \u003C\u002Fp>\u003Cp>అలాగే ప్రత్యాహారం ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తుంది. ధారణ మనసుకు ఏకాగ్రతను నేర్పుతుంది. ధ్యానం ఆ ఏకాగ్రతను నిరంతరం కొనసాగిస్తుంది. చివరగా సమాధిలో ధ్యానించే వ్యక్తి, ధ్యానం, ధ్యేయం మధ్య భేదభావం క్రమంగా క్షీణించే స్థితి ఏర్పడుతుంది.. కాబట్టి యోగం అంటే కేవలం శరీరాన్ని వంచడం కాదు.. మనసును మార్చడం, అహంకారాన్ని తగ్గించడం, ఆత్మను తెలుసుకునే దిశగా ప్రయాణించడం అని తెలుస్తుంది. \u003C\u002Fp>\u003Cp>భగవద్గీతలోని కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలైనా.. పతంజలి చెప్పిన అష్టాంగయోగ మార్గమైనా.. అంతిమంగా లక్ష్యం ఒక్కటే.. మనిషిని అంతర్ముఖంగా మార్చి, తన అసలైన స్వరూపాన్ని తెలుసుకునే స్థితికి తీసుకెళ్లడం. అదే యోగం యొక్క అసలైన ఆధ్యాత్మిక రహస్యం అని వేదాలు చెబుతున్నాయి.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-08-27 at 9.06.51 PM.jpeg",[],{"title":35,"description":12},"యోగములు ఎన్ని రకాలు? అవి ఏమిటి?",[37,46,53,62,70,76,85,90,96,105],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"nepal-floods-warning-to-india","నేపాల్ వరద భారత్‌కు హెచ్చరిక.. హిమనీ సరస్సులు ఎంత ప్రమాదకరం?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff9becefc-fccc-4f80-b646-fa052d47c828.jpg","Kashi","8 నిమిషాల పఠనం","6 నిమిషాలు క్రితం",7,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":42,"read_time":50,"published_at":51,"public_read_count":52},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","10 నిమిషాల పఠనం","8 నిమిషాలు క్రితం",12,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":61},"nbk-111-balakrishna-new-look","NBK 111: ఆన్‌సెట్స్ నుంచి బాలయ్య లుక్ రివీల్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff031fcf4-645d-4fe0-8237-db7a716c5f35.webp","Anshu","3 నిమిషాల పఠనం","9 నిమిషాలు క్రితం",1,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":42,"read_time":67,"published_at":68,"public_read_count":69},"satilite-internet","ఆకాశంలో ఇంటర్నెట్ వార్..! స్టార్‌లింక్‌ వర్సెస్ అమెజాన్.. భారత్ మార్కెట్ ఎవ‌రిది..?","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1727264f-bc48-4e55-adca-375f1a67ff00.jpg","9 నిమిషాల పఠనం","10 నిమిషాలు క్రితం",3,{"slug":71,"title":72,"category":40,"image":73,"author":42,"read_time":50,"published_at":74,"public_read_count":75},"all-party-meet-on-delimitation","డీలిమిటేషన్‌పై ఢిల్లీలో కదలిక..! అఖిలపక్ష భేటీకి ఖర్గే డిమాండ్.. దక్షిణాది సీట్ల లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5dcd4f73-6009-4ad6-a715-d4ff8349baf2.jpg","12 నిమిషాలు క్రితం",2,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":84},"a-key-leaders-pa-unleashes-a-torrent-of-abuse","ముఖ్యనేత పీఏ బూతు పురాణం?","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0cb728ba-3984-4aa9-90c8-511c28c63939.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","35 నిమిషాలు క్రితం",259,{"slug":86,"title":87,"category":40,"image":88,"author":15,"read_time":25,"published_at":89,"public_read_count":28},"nepal-flood-natural-calamity-in-nepal-death-toll-rises-to-392","Nepal Flood: నేపాల్‌లోప్రకృతి విలయం.. 392కు పెరిగిన మృతుల సంఖ్య!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F71e857bb-747c-4b80-91b5-9984c234f4c7.webp","1 గంట క్రితం",{"slug":91,"title":92,"category":19,"image":93,"author":15,"read_time":43,"published_at":94,"public_read_count":95},"spirituality-what-happens-when-a-person-dies","Spirituality: మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44050784-b512-4f66-b956-ac002e32f0c7.jpg","2 గంటలు క్రితం",310,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":101,"read_time":102,"published_at":103,"public_read_count":104},"trs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","NK","13 నిమిషాల పఠనం","10 గంటలు క్రితం",4,{"slug":106,"title":107,"category":56,"image":108,"author":58,"read_time":109,"published_at":103,"public_read_count":28},"nivetha-thomas","Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62826431-e579-4597-b413-e13d5cdb756b.jpg","4 నిమిషాల పఠనం",[111,116,119,121,123,125],{"title":112,"sponsor":113,"image":114,"url":115},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":117,"sponsor":118,"image":114,"url":115},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":120,"sponsor":118,"image":114,"url":115},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":122,"sponsor":118,"image":114,"url":115},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":124,"sponsor":118,"image":114,"url":115},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":126,"sponsor":118,"image":114,"url":115},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]