[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-how-does-digitalization-help-guide-a-person-onto-the-spiritual-path":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":101},1380,"spirituality-how-does-digitalization-help-guide-a-person-onto-the-spiritual-path","Spirituality: మనిషిని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించడానికి డిజిటలైజేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది?","మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు... కానీ తనలోని అశాంతిని మాత్రం జయించలేకపోతున్నాడు. ఒక రాజు శక్తివంతంగా ఉన్నంతకాలం.. శత్రువులు అతని రాజ్యాన్ని చూసి భయపడతారు. కానీ ఆ రాజు బలహీనపడినప్పుడు.. ఎక్కడో దాక్కున్న శత్రువులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffa10d21c-f5f9-48e9-bfec-1079644e76fb.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffa10d21c-f5f9-48e9-bfec-1079644e76fb.png","Venu","spirituality",[17,18,19,20,21,22],"spiritual","India","digitalization","help guide","person","Mobile phone","6 నిమిషాల పఠనం","2026-07-28T02:45:41+00:00",106,"\u003Cp>నేటి మనిషి జీవితం... యంత్రం కంటే వేగంగా మారిపోయింది. ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి రాత్రి కళ్లు మూసుకునే వరకు... పని, బాధ్యతలు, పోటీ, సంపాదన, సోషల్ మీడియా... ఇలా ఎన్నో విషయాల మధ్య మనిషి తనను తాను మరిచిపోతున్నాడు. కనీసం ఒక్క క్షణం నేను ఎవరు? నా జీవితానికి అసలు అర్థం ఏమిటి? అని తనను తాను ప్రశ్నించుకునే సమయం కూడా లేకుండా పోయింది.\u003C\u002Fp>\u003Cp>మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు... కానీ తనలోని అశాంతిని మాత్రం జయించలేకపోతున్నాడు. ఒక రాజు శక్తివంతంగా ఉన్నంతకాలం.. శత్రువులు అతని రాజ్యాన్ని చూసి భయపడతారు. కానీ ఆ రాజు బలహీనపడినప్పుడు.. ఎక్కడో దాక్కున్న శత్రువులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తారు.\u003C\u002Fp>\u003Cp>మనిషి మనస్సు కూడా అంతే. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నంతకాలం.. బాధలు, భయాలు, కోరికలు అతన్ని పూర్తిగా ఆక్రమించలేవు. కానీ మనస్సు బలహీనపడినప్పుడు.. ఆందోళన, అసూయ, కోపం, భయం, అసంతృప్తి.. ఒక్కొక్కటిగా జీవితాన్ని ఆక్రమిస్తాయి..  అందుకే ఆధ్యాత్మికత అనేది కేవలం దేవాలయానికి వెళ్లడం కాదు. పూజలు చేయడం మాత్రమే కాదు. \u003C\u002Fp>\u003Cp>ఆధ్యాత్మికత అంటే.. మనిషి తన మనస్సును అర్థం చేసుకోవడం. తన ఆలోచనలను గమనించడం. తన కోరికలకు తానే బానిస కాకుండా.. తన జీవితానికి తానే అధిపతిగా మారడం. ఒకప్పుడు ఈ జ్ఞానాన్ని అందించడానికి ఆశ్రమాలు ఉండేవి. గురువులు ఉండేవారు. గురుబోధనలు ఉండేవి. ఆధ్యాత్మిక గ్రంథాలు ఉండేవి. కానీ కాలం మారింది. జీవన విధానం మారింది. మనిషికి చదవడానికి సమయం తగ్గిపోయింది. వినడానికి కూడా ఎక్కువ సమయం ఉండటం లేదు.\u003C\u002Fp>\u003Cp>ఇక్కడే... డిజిటలైజేషన్ ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ఎందుకంటే నేడు మనిషి చదవడానికి సమయం లేకపోయినా.. వినడానికి మాత్రం ఆసక్తి చూపుతున్నాడు. ప్రయాణంలో, పనిలో, విశ్రాంతి సమయంలో.. ఆధ్యాత్మిక ప్రసంగాలు, ధ్యాన మార్గదర్శకాలు, శాస్త్ర గ్రంథాల వివరణలు, గురువుల బోధనలు.. డిజిటల్ వేదికల ద్వారా అతని చెవులకు చేరుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం కాదు.. సరిగ్గా ఉపయోగిస్తే ఇది ఒక ఆధునిక గురుకులం కావచ్చు. ఒకప్పుడు జ్ఞానం కోసం మనిషి ఆశ్రమానికి వెళ్లేవాడు. నేడు... జ్ఞానం మనిషి చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ ద్వారా అతని ఇంటికే వస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.. డిజిటల్ ప్రపంచం మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించగలదు.. అదే సమయంలో అతన్ని మరింత మాయలో కూడా ముంచగలదు.. \u003C\u002Fp>\u003Cp>అందుకే సమస్య డిజిటలైజేషన్‌లో లేదు. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదానిలో ఉంది. మొబైల్ ఫోన్‌తో గంటల తరబడి వ్యర్థమైన విషయాలను చూడవచ్చు. అదే మొబైల్‌తో, ధ్యానం చేయడం నేర్చుకోవచ్చు... అశాంతిని పెంచుకోవచ్చు.. మనస్సుకు శాంతిని వెతుక్కోవచ్చు..  ఎంత పెద్ద నది అయినా... ఒక చిన్న పాయగా మొదలవుతుంది. క్రమంగా ప్రవాహాన్ని పెంచుకుంటూ... మహోధృత జలప్రవాహంగా మారుతుంది. అలాగే.. ఒక చిన్న ఆధ్యాత్మిక ఆలోచన కూడా మనిషి జీవితాన్ని మార్చగలదు.\u003C\u002Fp>\u003Cp>ఒక మంచి మాట... ఒక ఆధ్యాత్మిక సందేశం... ఒక ధ్యాన సాధన... ఒక సత్యమైన ఆలోచన.. ఇవి చిన్నవిగా కనిపించినా... మనిషి అంతరంగంలో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలకగలవు. కాబట్టి డిజిటల్ యుగాన్ని ఆధ్యాత్మికతకు శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. అది మన చేతుల్లో ఉన్న ఒక శక్తివంతమైన సాధనం. అందుకే సాంకేతికత చేతిలో ఉన్నప్పుడు... మనిషి దానికి బానిస కాకూడదు. దానిని జ్ఞానానికి వాహనంగా మార్చాలి. అంతరాత్మ వైపు నడిపించే ఆధునిక ఆధ్యాత్మిక మార్గదర్శిగా మార్చుకోవాలి.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి.. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Gemini_Generated_Image_2rbz3o2rbz3o2rbz.png",[],{"title":32,"description":33},"మనిషిని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించడానికి డిజిటలైజేషన్ ఏ","మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు... కానీ తనలోని అశాంతిని మాత్రం జయించలేకపోతున్నాడు. ఒక రాజు శక్తివంతంగా ఉన్నంతకాలం.. శత్రువులు అతని రాజ్యాన్",[35,42,48,54,61,69,77,83,89,95],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":14,"read_time":40,"published_at":41,"public_read_count":25},"health-start-your-day-with-healthy-drinks","Health: నిద్ర లేవగానే టీ తాగుతున్నారా? బదులుగా ఇవి తీసుకుంటే శరీరానికి మేలు!","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F10523c4f-2ec8-422d-89d9-0717a843670d.png","4 నిమిషాల పఠనం","2026-07-28T02:55:07+00:00",{"slug":43,"title":44,"category":15,"image":45,"author":14,"read_time":46,"published_at":47,"public_read_count":25},"spirituality-do-you-know-how-to-receive-teertha-and-prasada-in-a-temple","Spirituality: గుడిలో తీర్థప్రసాదాలు ఎలా స్వీకరించాలో తెలుసా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2a753a7f-3769-4d8e-a269-80231f3e5965.png","5 నిమిషాల పఠనం","2026-07-28T03:03:30+00:00",{"slug":49,"title":50,"category":38,"image":51,"author":14,"read_time":40,"published_at":52,"public_read_count":53},"health-is-it-good-to-sleep-after-a-meals-here-is-the-scientific-reason","Health: భోజనం తర్వాత నిద్రపోవడం మంచిదా?.. సైంటిఫిక్ రీజన్ ఇదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Feb531f07-c1fa-4955-80a3-3f9fbcf70b80.png","2026-07-28T03:16:13+00:00",55,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":40,"published_at":60,"public_read_count":25},"pawala-shyamala-renowned-actress-pawala-shyamala-passes-away","Pawala shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F490d212b-767b-48df-a24d-7dde445727a6.png","Mamatha puppala","2026-07-28T03:22:11+00:00",{"slug":62,"title":63,"category":57,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":68},"jr-ntr-8","Jr NTR: మరో టాలీవుడ్ స్టార్ కి గాయాలు..కోలుకోవడానికి 8 వారాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fcc0f469e-4939-44a3-abf7-ea9a0f87a25c.jpg","Anshu","3 నిమిషాల పఠనం","2026-07-28T03:45:37+00:00",208,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":23,"published_at":75,"public_read_count":76},"hydraa-commissioner-av-ranganath-reaction-on-high-court-orders","HYDRAA: అదే నేను చేసిన తప్పు, రూ.10వేల కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్లాన్- హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fac317070-a417-47f0-b780-ada7b9d05ba9.jpg","NK","2026-07-27T17:34:26+00:00",310,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":74,"read_time":40,"published_at":82,"public_read_count":53},"pib-fact-check-says-ban-on-instagram-in-india-is-fake","Instagram: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం? అసలు నిజం ఇదే..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F29fd4c2e-2dec-476a-8c3b-176ad3e8c697.jpg","2026-07-27T15:51:10+00:00",{"slug":84,"title":85,"category":57,"image":86,"author":65,"read_time":40,"published_at":87,"public_read_count":88},"varun-tej-dil-raju","Varun Tej: దిల్ రాజు చేతికి కొరియన్ కనకరాజు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fca9acc07-3519-4038-91e8-63e1fac65aa9.jpg","2026-07-27T15:49:06+00:00",259,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":14,"read_time":40,"published_at":94,"public_read_count":25},"corona-covid-19-scare-in-ap-first-case-reported-in-tirupati","Corona: ఏపీలో కరోనా కలకలం.. తిరుపతిలో తొలి కేసు నమోదు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F981a45c0-9394-4cf7-adf5-25297dda6f29.jpg","2026-07-27T14:49:29+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":74,"read_time":46,"published_at":100,"public_read_count":25},"passenger-lights-diya-for-puja-inside-moving-trains-ac-coach-video-goes-viral","Diya Inside Train: బాబోయ్.. ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు.. వీడియో వైరల్","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F93332fbf-6064-4202-9ca0-fdd0dda1bc70.jpg","2026-07-27T14:47:55+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]