[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":101},5403,1855,"soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780","స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!","దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ పూట బంధుమిత్రులకు స్వీట్లు పంచి నోరు తీపి చేసుకుందామనుకునే వారికి మిఠాయిల ధరలు విపరీతంగా పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","Mamatha puppala","business","routine",[19,20,21,22,23,24],"FestivalSweetPrices","InflationImpact","SugarPriceHike","BusinessNews","FestivalSeason2026","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T03:27:42+00:00","2026-09-08T03:28:02+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ పూట బంధుమిత్రులకు స్వీట్లు పంచి నోరు తీపి చేసుకుందామనుకునే వారికి మిఠాయిల ధరలు విపరీతంగా పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. స్వీట్ల తయారీలో అత్యంత కీలకమైన ప్రధాన ముడిసరుకుల ధరలు మార్కెట్‌లో ఆకాశాన్నంటడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు వ్యాపారులు స్వీట్ల ధరలను ఏకంగా 30శాతం వరకు పెంచాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మార్కెట్‌లో పంచదార, బెల్లం, పాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40 నుంచి రూ.45వరకు లభించిన పంచదార ధర ప్రస్తుతం ఏకంగా రూ.65 నుంచి రూ.70కి చేరుకుంది. అదేవిధంగా నాణ్యమైన బెల్లం ధర కిలో రూ.70-80 నుంచి రూ. 90-100కు చేరింది. దీనికి తోడు గత నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాసెస్ చేసిన పాల ధరలు కూడా 16శాతం వరకు పెరగడం స్వీట్ షాపు నిర్వాహకులకు పెద్ద భారంగా మారింది. ఉదాహరణకు, రెండు నెలల క్రితం కిలో రూ.550-560 ఉన్న ధూద్ పేడా ధర ఇప్పుడు ఏకంగా రూ.750-780కి పెరగడం ఈ తీవ్రతకు అద్దం పడుతోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;బిస్కెట్లు, శీతల పానీయాలపై ప్రభావం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>అయితే, ధరల మంట ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడం, ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల చక్కెర, పాడి ఉత్పత్తి తగ్గవచ్చనే అంచనాలు ఉండటంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. &nbsp;త్వరలోనే బిస్కెట్లు, శీతల పానీయాలు (Cool Drinks), బేకరీ ఉత్పత్తులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;పరిస్థితి ఇలాగే కొనసాగితే బిస్కెట్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 4 శాతం వరకు పెంచడమో లేక ప్రస్తుతం ఇస్తున్న ప్యాకెట్ల పరిమాణాన్ని(Quantity) తగ్గించడమో చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడిసరుకుల ధరల సవరణ లేకపోతే ఈ పండుగల సీజన్‌లో తీపి పదార్థాల విక్రయాలు మందగించి వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని మిఠాయి షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-08 at 8.56.55 AM.jpeg",[],{"title":11,"description":35},"దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ పూట బంధుమిత్రులకు స్వీట్లు పంచి నోరు తీపి",[37,45,52,59,64,73,78,84,89,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"ap-good-news-for-tirumala-devotees-the-auspicious-time-for-the-inauguration-of-the-sv-museum-has-been-finalized","AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd85160e9-407d-4186-9a4e-4c767023e85d.jpg","Venu","2026-09-08T03:27:45+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":44},"priyanka-mohan-og","Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F20e11b88-321d-41fd-88dd-0d780ebf741b.webp","Anshu","2026-09-08T03:41:56+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":25,"published_at":58,"public_read_count":28},"high-tension-in-erravalli-case-registered-against-14-people-including-ktr-and-harish","BRS  : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b6b9676-ade0-4349-ae4c-05d6f4858bc5.jpg","Kumar","2026-09-08T04:04:16+00:00",{"slug":60,"title":61,"category":48,"image":62,"author":50,"read_time":25,"published_at":63,"public_read_count":28},"ssrajamouli-varanasi-highlights","SS.Rajamouli: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbf760928-85b8-449f-84c8-8aba42949441.webp","2026-09-08T04:13:17+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":72},"is-the-revenue-target-2-lakh-crore","రెవెన్యూ డెన్ లక్ష్యం రూ.2లక్షల కోట్లు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdea4fb52-a012-403c-ab86-33e7b12aa079.jpg","Swechaanews Chairman","5 నిమిషాల పఠనం","2026-09-08T04:24:34+00:00",157,{"slug":74,"title":75,"category":48,"image":76,"author":50,"read_time":25,"published_at":77,"public_read_count":44},"manchu-manoj-dada","Manchu Manoj: బాలయ్య \"దాదా\" మూవీలో మంచు మనోజ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f4887ba-6d29-4dd1-b64d-e26b532b1269.webp","2026-09-08T03:09:39+00:00",{"slug":79,"title":80,"category":55,"image":81,"author":42,"read_time":25,"published_at":82,"public_read_count":83},"telangana-news-ktr-lashes-out-over-the-arrest-of-brs-leaders-issues-a-major-challenge-to-the-congress","KTR: బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8be61dc-2ba9-4279-b48c-dbf82a48ae96.jpg","2026-09-08T03:08:23+00:00",259,{"slug":85,"title":86,"category":55,"image":87,"author":42,"read_time":70,"published_at":88,"public_read_count":44},"telangana-high-tension-in-telangana-brs-mlc-arrested","Telangana: తెలంగాణలో హైటెన్షన్..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aca0f32-1b64-4439-a8d1-1c6e351b7743.jpg","2026-09-08T02:49:25+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":42,"read_time":94,"published_at":95,"public_read_count":44},"helath-are-you-dismissing-mouth-ulcers-be-careful-if-you-notice-these-symptoms","Helath: నోటి పూత అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F406ef4aa-0107-418a-ac45-7a4fbff29261.jpg","6 నిమిషాల పఠనం","2026-09-08T02:32:10+00:00",{"slug":97,"title":98,"category":48,"image":99,"author":50,"read_time":25,"published_at":100,"public_read_count":28},"allu-arjun-300","Allu Arjun: ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ 300 కోట్లు..ఇది ప్రభాస్ కంటే ఎక్కువే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec96c409-547a-441a-a1fa-449829e15439.jpg","2026-09-08T01:58:29+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]