[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shakthi-sharma-women-power":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":33,"published_at":34,"updated_at":35,"public_read_count":36,"body":37,"images":38,"video_url":5,"video_urls":41,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":42,"read_next":45,"sponsored_content":105},4802,1566,"shakthi-sharma-women-power","ఆకాశమే హద్దు.. రక్షణ రంగంలో మహిళల దూకుడు!","భారత వాయుసేనలో వైద్య విభాగానికి చెందని మహిళా అధికారుల్లో తొలిసారిగా ఎయిర్ వైస్ మార్షల్ హోదాను అందుకుని శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక ప్రమోషన్ కాదు.. భారత రక్షణ రంగంలో మహిళల ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చెప్పే కీలక మైలురాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5756b421-e470-4d02-a81e-a34ca9478fd9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5756b421-e470-4d02-a81e-a34ca9478fd9.jpg","Kashi","national","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32],"Shakti Sharma","Air Vice Marshal Shakti Sharma","Indian Air Force","IAF Women Officers","Women in Defence","Women in Armed Forces","Indian Defence","Women Empowerment","Defence News","Indian Air Force Women","Women Officers","Defence Forces India","Military Women","Women in Uniform","5 నిమిషాల పఠనం","2026-09-02T04:09:54+00:00","2026-09-02T04:10:22+00:00",157,"\u003Cp>ర‌క్ష‌ణ రంగంలో స‌త్తా చాటుతున్న మ‌హిళ‌లు\u003C\u002Fp>\u003Cp>ఎయిర్ వైస్ మార్ష‌ల్‌గా శ‌క్తి శ‌ర్మ‌\u003C\u002Fp>\u003Cp>3 ద‌శాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ‌లు\u003C\u002Fp>\u003Cp>ఒకప్పుడు రక్షణ రంగం అంటే పురుషులే గుర్తొచ్చేవారు. యుద్ధ విమానాలు, సైనిక కమాండ్, కీలక వ్యూహాత్మక బాధ్యతలు.. ఇవన్నీ పురుషులకే పరిమితమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. దేశ రక్షణలో మహిళలు కూడా పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. నాయకత్వం నుంచి కమాండ్ వరకు.. కీలక బాధ్యతల్లోకి దూసుకెళ్తున్నారు. మారుతున్న భారత రక్షణ రంగానికి తాజా ఉదాహరణ ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ.\u003C\u002Fp>\u003Cp>భారత వాయుసేనలో వైద్య విభాగానికి చెందని మహిళా అధికారుల్లో తొలిసారిగా ఎయిర్ వైస్ మార్షల్ హోదాను అందుకుని శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక ప్రమోషన్ కాదు.. భారత రక్షణ రంగంలో మహిళల ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చెప్పే కీలక మైలురాయి.\u003C\u002Fp>\u003Cp>1994లో ఎయిర్‌ఫోర్స్ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో కమిషన్ పొందిన శక్తి శర్మ.. అప్పటి నుంచి మూడు దశాబ్దాలకు పైగా వివిధ కీలక బాధ్యతల్లో పనిచేశారు. ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ల నుంచి ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్, ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ వరకు ఆమె సేవలు కొనసాగాయి.\u003C\u002Fp>\u003Cp>తొలి మహిళా గ్రూప్ కెప్టెన్‌గా...\u003C\u002Fp>\u003Cp>వైద్య విభాగం వెలుపల భారత వాయుసేనలో తొలి మహిళా గ్రూప్ కెప్టెన్‌గా కూడా శక్తి శర్మ ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాదు.. త్రివిధ దళాల్లో తొలి మహిళా అధికారిగా సైనిక్ స్కూల్‌కు కమాండ్ చేసిన ఘనత కూడా ఆమెదే. కపుర్తలా సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆమె.. విద్య, నాయకత్వం, సైనిక శిక్షణ రంగాల్లో తన ముద్ర వేశారు.\u003C\u002Fp>\u003Cp>ఐఐటీ కాన్పూర్, పుణే యూనివర్సిటీలో IAF చైర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. అంటే.. ఆమె ప్రస్థానం కేవలం యూనిఫాం, కమాండ్‌తోనే పరిమితం కాలేదు. విద్య, శిక్షణ, పరిశోధన, సంస్థాగత అభివృద్ధి వరకు విస్తరించింది.\u003C\u002Fp>\u003Cp>ఇప్పటికే భారత సాయుధ దళాల్లో మహిళలు పైలట్లుగా, ఇంజినీర్లుగా, న్యాయ నిపుణులుగా, వైద్య అధికారులుగా, సాంకేతిక నిపుణులుగా, కమాండర్లుగా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. గతంలో కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైన అవకాశాలు.. ఇప్పుడు మరింత విస్తరిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఒకప్పుడు మహిళలు యుద్ధరంగంలో ఎంతవరకు రాణించగలరు? అనే ప్రశ్న వినిపించేది. ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం.. వారి పనితీరే. ఎక్కడ సవాల్ ఉంటే అక్కడ మహిళలు ముందుకు వస్తున్నారు. ఎక్కడ నాయకత్వం అవసరమైతే అక్కడ బాధ్యత తీసుకుంటున్నారు. దేశ భద్రత విషయంలో తమ సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని నిరూపిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>శక్తి శర్మ ఎయిర్ వైస్ మార్షల్‌గా ఎదగడం.. ఆ ప్రయాణంలో మరో పెద్ద అడుగు. ఇది ర్యాంకు పెరగడం మాత్రమే కాదు. రక్షణ రంగంలో మహిళలకు ఉన్న అవకాశాల పరిధి ఎంతగా విస్తరిస్తోందో చెప్పే సంకేతం. భారత వాయుసేన నినాదం.. టచ్ ది స్కై విత్ గ్లోరీ. ఆకాశాన్ని అందుకోవాలంటే హద్దులు ఉండకూడదు. శక్తి శర్మ ప్రయాణం కూడా అదే చెబుతోంది. దేశాన్ని కాపాడే బాధ్యతకు లింగభేదం ఉండదు. సామర్థ్యం, ధైర్యం, నాయకత్వం ఉంటే.. ఆకాశమే హద్దు. ఈ ప‌రిణామాల‌తో భారత రక్షణ రంగంలో మహిళల అడుగులు మ‌రిన్ని ఉన్నత శిఖ‌రాల‌కు చేరే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. \u003C\u002Fp>",[39],{"url":13,"name":40},"shakti_sharma_women_power_1mb.jpg",[],{"title":43,"description":44},"Shakti Sharma: New Milestone for Women in Indian Air Force","Air Vice Marshal Shakti Sharma becomes the first non-medical woman officer to reach the rank, marking a historic milestone for women in India's defence forces.",[46,54,61,68,74,80,86,92,99],{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":36},"three-months-ration-another-piece-of-good-news-for-beneficiaries","TG : మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7642422c-5c8c-4597-902f-b866f0b8dcb9.webp","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-02T04:30:30+00:00",{"slug":55,"title":56,"category":49,"image":57,"author":58,"read_time":33,"published_at":59,"public_read_count":60},"telangana-a-four-pronged-strategy-regarding-congress-1000-day-rule-is-this-ktr-master-plan","Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2e0e593e-060d-484c-aa22-5e2b9fb6290a.jpg","Venu","2026-09-02T04:59:44+00:00",208,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":51,"read_time":33,"published_at":66,"public_read_count":67},"rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral","Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","2026-09-02T05:29:49+00:00",2,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":51,"read_time":52,"published_at":73,"public_read_count":67},"murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha","TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","2026-09-02T05:55:26+00:00",{"slug":75,"title":76,"category":49,"image":77,"author":51,"read_time":52,"published_at":78,"public_read_count":79},"revanths-plunder-uproar-over-posters-against-the-1000-day-rule","TG : రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dba70e2-68aa-4cfa-bd0a-bb20637b94be.jpg","2026-09-02T04:08:37+00:00",106,{"slug":81,"title":82,"category":49,"image":83,"author":58,"read_time":84,"published_at":85,"public_read_count":36},"hyderabad-corruption-unearthed-in-ghmc-special-audit-exposes-the-scam","Hyderabad: జీహెచ్‌ఎంసీలో బయటపడ్డ అవినీతి.. ప్రత్యేక ఆడిట్‌తో గుట్టు రట్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F813a659a-106f-4e78-a2d6-1ca6e8ce7b7e.jpg","7 నిమిషాల పఠనం","2026-09-02T04:01:48+00:00",{"slug":87,"title":88,"category":64,"image":89,"author":51,"read_time":90,"published_at":91,"public_read_count":79},"couple-places-a-lamp-in-the-middle-of-the-road-abroad-accused-of-performing-black-magic","viral : ఫారిన్‌లో నడిరోడ్డుపై దీపం పెట్టిన జంట.. బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F670a6ac5-4c7b-48d3-80ff-9aeccd021220.jpg","3 నిమిషాల పఠనం","2026-09-02T03:47:15+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":58,"read_time":33,"published_at":97,"public_read_count":98},"health-what-causes-warts-to-appear-on-the-body","Health: శరీరంపై పులిపిరులు రావడానికి కారణం ఏంటి?","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84427b64-db2f-4d6c-9564-e65ff2289dc7.jpg","2026-09-02T03:03:23+00:00",55,{"slug":100,"title":101,"category":102,"image":103,"author":58,"read_time":33,"published_at":104,"public_read_count":98},"spirituality-what-is-the-underlying-significance-of-celebrating-sri-krishna-janmashtami","Spirituality: శ్రీకృష్ణ జన్మాష్టమి జరపడంలో ఉన్న అంతరార్థం ఏమిటి?..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8980de08-b13c-409e-a17d-1f0cc071ba63.jpg","2026-09-02T02:49:48+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]