[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sensational-cia-report-bin-laden-had-his-eye-on-india-even-before-911":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":38,"sponsored_content":95},5968,2132,"sensational-cia-report-bin-laden-had-his-eye-on-india-even-before-911","సీఐఏ సంచలన నివేదిక.. 9\u002F11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!","అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన భీకర ఉగ్రదాడులకు కంటే ముందే భారత్‌ను తన దాడి లక్ష్యాల (హిట్ లిస్ట్) జాబితాలో చేర్చినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) తాజాగా విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa93a4534-e45a-4df8-90a0-0ac3eae44547.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa93a4534-e45a-4df8-90a0-0ac3eae44547.jpg","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24,25,26],"OsamaBinLaden","CIADocuments","AlQaeda","911Attacks","IndiaHitList","HarkatulMujahideen","USIntelligence","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T06:18:21+00:00","2026-09-13T06:18:36+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన భీకర ఉగ్రదాడులకు కంటే ముందే భారత్‌ను తన దాడి లక్ష్యాల (హిట్ లిస్ట్) జాబితాలో చేర్చినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) తాజాగా విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 9\u002F11 దాడులకు సంబంధించిన 100 పేజీలకు పైగా నిఘా సమాచారంతో కూడిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్‌లను CIA ప్రజల ముందుకు ఉంచడంతో ఈ చారిత్రక నిజాలు బయటపడ్డాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ విశ్లేషణాత్మక నివేదికల్లోని ఆగస్టు 28, 1998 నాటి ఇంటెలిజెన్స్ మెమో ప్రకారం.. అల్ ఖైదా నెట్‌వర్క్ ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా భారత్, పాకిస్థాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా తదితర దేశాల్లో విధ్వంసకర దాడులకు కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. \"బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్\" అనే శీర్షికతో ఉన్న ఈ రహస్య నివేదికలో భారత్‌పై దాడి చేసే యోచన ఉన్నట్లు ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో నిర్దిష్టమైన తేదీలు లేదా నిర్దిష్ట ప్రదేశాల వివరాలను పొందుపరచలేదు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అంతేకాకుండా, కశ్మీర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేసే ఉగ్రవాద సంస్థ 'హర్కతుల్ ముజాహిదీన్' (HUM) తో కలిసి పనిచేసేందుకు లాడెన్ సమన్వయం చేసుకున్నట్లు 1998 ప్రెసిడెన్షియల్ బ్రీఫ్‌లో పేర్కొన్నారు. భారత్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ప్రయోజనాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు ఈ స్థానిక ఉగ్రవాద సంస్థలతో అల్ ఖైదా ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలతో లాడెన్ నెట్‌వర్క్ అప్పటికే బలంగా అనుసంధానమై ఉందని ఈ పత్రాలు నిరూపిస్తున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద విస్తరణకు అల్ ఖైదా ఎంతటి ముందస్తు వ్యూహాలు రచించిందో ఈ రహస్య పత్రాల విడుదల ద్వారా స్పష్టమవుతోంది. 1998లోనే భారత్ సహా పలు ఆసియా, ఆఫ్రికా దేశాలను లాడెన్ తన ఉగ్ర కోరల్లోకి తీసుకోవాలని ప్రయత్నించాడనే వార్త అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 9\u002F11 నాటి విపత్తుకు ముందే దక్షిణ ఆసియాలో ఉగ్రవాద మూలాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ఈ నివేదిక బహిర్గతం చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Screenshot 2026-09-13 114536.jpg",[],{"title":11,"description":37},"అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన భీకర ఉగ్రదాడులకు కంటే ముందే భారత్‌ను తన దాడి లక్ష్యాల (హిట్ లిస్ట్) జాబితాలో..",[39,47,54,62,68,73,80,85,90],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":30},"ship-sinks-in-java-sea-240-people-missing","International : జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e3e4b30-0e1a-4578-9f09-5e89a4b547df.png","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-13T06:29:10+00:00",{"slug":48,"title":49,"category":50,"image":51,"author":44,"read_time":52,"published_at":53,"public_read_count":30},"a-key-post-for-former-minister-konda-will-a-balance-be-struck","Congress : మాజీ మంత్రి ‘కొండా’కు కీలక పదవి? బ్యాలెన్స్ చేస్తారా?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb91f4d0a-ff0f-4de3-8776-d0757fcb9d70.webp","5 నిమిషాల పఠనం","2026-09-13T06:51:53+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":27,"published_at":60,"public_read_count":61},"siima-awards-2026-telugu-stars-dazzled-on-the-siima-stage","SIIMA Awards 2026: సైమా వేదికపై తెలుగు తారల మెరుపులు!!..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fde5ef250-fff9-4bae-bb72-547e11ae08df.jpg","Venu","2026-09-13T07:19:13+00:00",1,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":27,"published_at":67,"public_read_count":61},"viral-scuffle-over-a-seat-on-a-free-bus-women-grab-each-other-by-the-hair-and-fight","VIRAL: ఫ్రీ బస్సులో సీటు కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0dcd3dad-bdf1-43ce-9d62-fe5e14157d25.jpg","2026-09-13T07:29:27+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":27,"published_at":72,"public_read_count":30},"horrific-boat-accident-in-the-philippines-death-toll-rises-to-76","ఫిలిప్పీన్స్‌లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0aaea672-4b89-4686-9c1c-f481596a94dd.jpg","2026-09-13T05:50:06+00:00",{"slug":74,"title":75,"category":57,"image":76,"author":77,"read_time":27,"published_at":78,"public_read_count":79},"vishwak-sen-36-3","Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77cab79a-0e92-438c-950e-6545758b910a.jpg","Anshu","2026-09-13T05:48:15+00:00",55,{"slug":81,"title":82,"category":50,"image":83,"author":44,"read_time":27,"published_at":84,"public_read_count":30},"demolition-of-youths-house-seven-accused-arrested","TG :యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf5d0fe6-04d3-42d3-b331-c05a3f554e98.png","2026-09-13T05:32:29+00:00",{"slug":86,"title":87,"category":65,"image":88,"author":15,"read_time":27,"published_at":89,"public_read_count":30},"cm-vijay-and-ajith-surprise-everyone-on-the-racing-track-photos-go-viral","రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf4e0ad7-de6f-4766-a86c-50c4868d9fe1.png","2026-09-13T05:21:30+00:00",{"slug":91,"title":92,"category":42,"image":93,"author":44,"read_time":27,"published_at":94,"public_read_count":30},"riots-in-los-angeles-cars-set-on-fire-massive-destruction-of-property","US : లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdeea214d-7e00-4764-b461-1f106f9e6a35.jpg","2026-09-13T05:09:17+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]