[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-school-at-risk-of-closure-teachers-letter-written-in-blood":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":105},5555,1931,"school-at-risk-of-closure-teachers-letter-written-in-blood","మూతపడే ప్రమాదంలో పాఠశాల.. రక్తంతో ఉపాధ్యాయుడి లేఖ!","కర్ణాటకలో కన్నడ మాధ్యమ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు అత్యంత వేదనతో వినూత్న నిరసన చేపట్టారు. 1995 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కన్నడ మీడియం పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం (గ్రాంట్-ఇన్-ఎయిడ్) అందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా తన రక్తంతోనే ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04e60917-77fa-43c5-9649-b7c8ee749ed0.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04e60917-77fa-43c5-9649-b7c8ee749ed0.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"KarnatakaNews","BloodLetter","KannadaMedium","SchoolGrants","Shivamogga","MadhuBangarappa","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T09:57:29+00:00","2026-09-09T09:57:58+00:00",106,"\u003Cp> కర్ణాటకలో కన్నడ మాధ్యమ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు అత్యంత వేదనతో వినూత్న నిరసన చేపట్టారు. 1995 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కన్నడ మీడియం పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం (గ్రాంట్-ఇన్-ఎయిడ్) అందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా తన రక్తంతోనే ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆ నిధులు లేకపోవడం వల్ల తమ పాఠశాల మూతపడే ప్రమాదంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలోని సాలేశ్వర విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రశాంత్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. లేఖ రాయడం కోసం ఆయన ముందుగా సిరంజితో తన చేతి నుంచి రక్తాన్ని తీసి కాగితంపై పోశారు. ఆపై తన వేళ్లను ఆ రక్తంలో ముంచి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాశారు. బుధవారం జరగనున్న ప్రజా సేవా ఆందోళన కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పను కలసి ఈ రక్తపు లేఖను వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>తమ విద్యాసంస్థ గత 31 ఏళ్లుగా గ్రామీణ విద్యార్థులకు కన్నడ మాధ్యమంలో విద్యాబోధన అందిస్తోందని ఉపాధ్యాయుడు ప్రశాంత్ తెలిపారు. గతంలో ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం అర్హతలను పరిశీలించిన సమయంలో కేవలం ఒక్క రోజు వ్యవధి తక్కువగా ఉండటంతో తమ పాఠశాల ఆ అవకాశాన్ని కోల్పోయిందని వాపోయారు. నాటి నుంచి నిధుల కొరత తీవ్రమై ఉపాధ్యాయుల జీతభత్యాలు, పాఠశాల నిర్వహణ భారంగా మారి సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని వివరించారు.\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రంలో మాతృభాషా విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, 1995 తర్వాత స్థాపించబడిన అన్ని కన్నడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తక్షణమే గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ లేఖపై సానుకూలంగా స్పందించి తమలాంటి అనేక కన్నడ పాఠశాలలను, వాటిపై ఆధారపడిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (4).jpeg",[],{"title":11,"description":36},"కర్ణాటకలో కన్నడ మాధ్యమ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు అత్యంత వేదనతో వినూత్న నిరసన చేపట్టారు. 1995 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కన్నడ మీడియం పాఠశాలలకు..",[38,46,53,61,67,74,80,86,93,99],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"tg-assembly-political-war-congress-brs-public-issues-ignored","TG: అసెంబ్లీలో రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వార్‌తో ప్రజా సమస్యలు బైపాస్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bf3bf24-c4d1-4f1e-8926-52eaee108ecc.webp","Mahesh","2026-09-09T09:59:14+00:00",4,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":29},"those-conspiracies-are-the-reason-for-ysrcps-downfall-chief-whip-anuradha","వైఎస్సార్‌సీపీ పతనానికి ఆ కుట్రలే కారణం: చీఫ్‌విప్ అనురాధ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66b02c5c-d560-4e82-be8f-29ca0532a5bd.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T10:03:38+00:00",{"slug":54,"title":55,"category":41,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"brs-mlas-meet-governor-and-complaint-on-police-and-government","మాపై దాడులు, కేసులు, కుట్రలు.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff8677fb6-909d-444a-9602-624f8e198d04.jpg","NK","11 నిమిషాల పఠనం","2026-09-09T10:06:50+00:00",55,{"slug":62,"title":63,"category":41,"image":64,"author":15,"read_time":65,"published_at":66,"public_read_count":29},"threat-calls-to-film-actor-tanish-warned-that-a-list-of-his-irregularities-would-be-exposed","సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా విప్పుతానని హెచ్చరిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe70fd64c-8998-4fe8-ae5b-b8bf1740050d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T10:08:46+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":72,"read_time":26,"published_at":73,"public_read_count":60},"the-paradise-ticket-hike","The Paradise: రవితేజను ఫాలో అవుతున్న నాని..ప్యారడైజ్ కి నో టికెట్ హైక్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b5aa5f0-5a19-4639-a27e-4d91c5c6be79.webp","Anshu","2026-09-09T10:27:33+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":72,"read_time":26,"published_at":79,"public_read_count":29},"prabhas-vs-naga-chaithanya","Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","2026-09-09T07:32:26+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":26,"published_at":85,"public_read_count":29},"immigration-in-just-15-seconds-an-innovative-initiative-at-dubai-airport","కేవలం 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వినూత్న ప్రయోగం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff38f2a6b-c22c-4191-bd28-110f0ba28407.jpg","2026-09-09T07:14:12+00:00",{"slug":87,"title":88,"category":41,"image":89,"author":90,"read_time":26,"published_at":91,"public_read_count":92},"kcrs-call-to-the-youth-advice-not-to-forget-that-task","KCR :  యువతకు కేసీఆర్ పిలుపు.. ఆ పని మరువద్దంటూ సూచన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6d3b649-96d3-4415-8321-a22443485640.jpg","Kumar","2026-09-09T06:58:26+00:00",310,{"slug":94,"title":95,"category":41,"image":96,"author":15,"read_time":26,"published_at":97,"public_read_count":98},"where-is-the-response-to-the-attacks-on-women-mlas-sabitamma-and-sunitamma-lash-out","మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc9713e27-6e0e-4d07-9177-4b84f42e6ca7.jpg","2026-09-09T06:56:42+00:00",157,{"slug":100,"title":101,"category":41,"image":102,"author":90,"read_time":26,"published_at":103,"public_read_count":104},"what-action-has-been-taken-against-the-mla-who-wished-for-kcrs-death-former-minister-talasani","BRS : కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F701722ee-70fa-4de9-95e5-052eaa1d5036.jpg","2026-09-09T06:41:16+00:00",412,[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]