[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rss-world-wide":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":33,"published_at":34,"updated_at":35,"public_read_count":36,"body":37,"images":38,"video_url":5,"video_urls":41,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":42,"read_next":45,"sponsored_content":105},5015,1666,"rss-world-wide","అమెరికా తర్వాత బ్రిటన్‌కు మోహన్‌ భగవత్‌.. RSSపై రచ్చ ఎందుకు?","RSS ఇప్పుడు శతాబ్ది దశలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో సంస్థ కార్యకలాపాలను భారత్‌ దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి మరింత చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌ పర్యటనలు కూడా ఈ గ్లోబల్‌ ఔట్‌రీచ్‌లో భాగంగానే జరుగుతున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63bb874b-71f0-44a4-99b5-22e65c120853.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63bb874b-71f0-44a4-99b5-22e65c120853.jpg","Kashi","international","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32],"Mohan Bhagwat","RSS","Rashtriya Swayamsevak Sangh","RSS Centenary","UK Visit","London","RSS Global Outreach","Indian Diaspora","Hindu Organisations","UK Politics","US Controversy","RSS News","India News","Global Outreach","10 నిమిషాల పఠనం","2026-09-04T06:24:51+00:00","2026-09-04T06:25:00+00:00",157,"\u003Cp>లండన్‌ చేరుకున్న RSS చీఫ్‌.. \u003C\u002Fp>\u003Cp>బ్రిటన్‌లో ఘన స్వాగతం\u003C\u002Fp>\u003Cp>భగవత్‌ పర్యటనపై బ్రిటన్‌ పార్లమెంట్‌లోనూ ప్రశ్నలు\u003C\u002Fp>\u003Cp>అమెరికాలో విమర్శలు.. UKలోనూ అదే చర్చ.. \u003C\u002Fp>\u003Cp>అసలు RSS గ్లోబల్‌ ప్లాన్‌ ఏంటి?\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మూడు దేశాల పర్యటనలో భాగంగా బ్రిటన్‌ చేరుకున్నారు. అమెరికా, కెనడా పర్యటనల తర్వాత ఆయన లండన్‌ రావడం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన గ్లోబల్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమాల్లో భాగంగానే ఈ పర్యటన సాగుతోంది. వీకెండ్‌లో బ్రిటన్‌లోని భారతీయ ప్రవాసులతో భగవత్‌ సమావేశమై ప్రసంగించే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>అయితే ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. అమెరికాలో భగవత్‌ పర్యటనకు ముందు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు బ్రిటన్‌లో కూడా ఆయన పర్యటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బ్రిటన్‌లోని వందకు పైగా హిందూ కమ్యూనిటీ సంస్థలు భగవత్‌ రాకను స్వాగతిస్తుండగా.. మరోవైపు ఆయన పర్యటనపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రశ్నలు కూడా తలెత్తాయి.\u003C\u002Fp>\u003Cp>లండన్‌లో ఘన స్వాగతం.. మద్దతుగా వందకుపైగా సంస్థలు\u003C\u002Fp>\u003Cp>మోహన్‌ భగవత్‌ లండన్‌ చేరుకున్న వెంటనే బ్రిటన్‌లోని పలు హిందూ, భారతీయ సంస్థలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. హిందూ కౌన్సిల్‌ UK, హిందూ ఫోరం ఆఫ్‌ బ్రిటన్‌, హిందూ స్వయంసేవక్‌ సంఘ్‌ UK, INSIGHT UK సహా వందకుపైగా సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.\u003C\u002Fp>\u003Cp>RSSను ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివర్ణించిన ఈ సంస్థలు.. సేవా కార్యక్రమాలు, సామాజిక సమైక్యత, విద్య, నాయకత్వ నిర్మాణం, విపత్తుల సమయంలో సహాయం వంటి అంశాల్లో RSS పాత్రను ప్రస్తావించాయి.\u003C\u002Fp>\u003Cp>అంతేకాదు.. RSS శతాబ్ది సందర్భంగా భగవత్‌ నాయకత్వంలో చేపడుతున్న ఐదు సామాజిక మార్పుల‌కూ మద్దతు ప్రకటించాయి. సామాజిక సామరస్యం, కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం, నిస్వార్థ సేవ, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతలను ఈ సంస్థలు ప్రధాన అంశాలుగా పేర్కొన్నాయి.\u003C\u002Fp>\u003Cp>అంటే.. భగవత్‌ పర్యటనను కేవలం ఒక రాజకీయ లేదా సంస్థాగత కార్యక్రమంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంతో RSS సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా మద్దతుదారులు చూస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రశ్నలేంటి?\u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో భగవత్‌ పర్యటనపై బ్రిటన్‌లో మరో చర్చ కూడా మొదలైంది. బ్రిటిష్‌ ఇండియన్‌ ఎంపీ నదియా విట్టోమ్‌.. భగవత్‌ పర్యటనకు సంబంధించి బ్రిటన్‌ హోం ఆఫీస్‌ను ప్రశ్నించారు. హేట్‌ స్పీచ్‌, ఎక్స్‌ట్రీమిజం వంటి అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో.. భగవత్‌ పర్యటనను ప్రభుత్వం పూర్తిగా అంచనా వేసిందా? అని ఆమె ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>దీనికి బ్రిటన్‌ సెక్యూరిటీ మంత్రి డాన్‌ జార్విస్‌ స్పందిస్తూ.. వ్యక్తిగత కేసులపై ప్రభుత్వం వ్యాఖ్యానించదని చెప్పారు. అయితే హింస, ద్వేషాన్ని ప్రోత్సహించే భావజాలాలను వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>UKలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను పాటించాల్సిందేనని కూడా ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. భగవత్‌ పర్యటన కేవలం RSS శతాబ్ది కార్యక్రమమా? లేక దీనికి అంతర్జాతీయ రాజకీయ కోణం కూడా ఉందా?\u003C\u002Fp>\u003Cp>అమెరికాలో ఏం జరిగింది?\u003C\u002Fp>\u003Cp>భగవత్‌ బ్రిటన్‌ పర్యటనకు ముందు అమెరికాలో ఆయన పర్యటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.\u003C\u002Fp>\u003Cp>అయితే ఈ కార్యక్రమానికి ముందు అమెరికాలోని కొన్ని రాజకీయ, పౌర హక్కుల వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. US క‌మిష‌న్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజియ‌స్ ఫ్రీడ‌మ్.. RSS సభ్యులపై ఆంక్షలను పరిశీలించాలని, భగవత్‌కు ఉన్నతస్థాయి సమావేశాలు, దౌత్యపరమైన మర్యాదలు ఇవ్వకుండా చూడాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.\u003C\u002Fp>\u003Cp>అమెరికా కాంగ్రెస్‌కు చెందిన రషీదా త్లైబ్‌, జిమ్‌ మెక్‌గవర్న్‌ కూడా భగవత్‌ పర్యటనపై విమర్శలు చేశారు. RSSపై మతపరమైన మైనారిటీల విషయంలో వివక్ష, హింసను ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు చేశారు. మరోవైపు న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీ కూడా RSSపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>అయితే భగవత్‌ తన ప్రసంగంలో మాత్రం భిన్నమైన సందేశం ఇచ్చారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఎవరైనా హిందువు భావిస్తే.. అతను హిందువు కాదనే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని చెప్పారు. భిన్నత్వమే ఏకత్వానికి అలంకారమని కూడా పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>RSS అసలు టార్గెట్‌ ఏంటి?\u003C\u002Fp>\u003Cp>ఇక్కడే అసలు విషయం. RSS ఇప్పుడు శతాబ్ది దశలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో సంస్థ కార్యకలాపాలను భారత్‌ దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి మరింత చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అమెరికా, కెనడా, బ్రిటన్‌ పర్యటనలు కూడా ఈ గ్లోబల్‌ ఔట్‌రీచ్‌లో భాగంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులతో నేరుగా మాట్లాడటం, RSS ఆలోచనలు, సామాజిక కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించడం ఈ పర్యటనల్లో కీలకంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>అందుకే మోహన్‌ భగవత్‌ లండన్‌ పర్యటనపై ఒకవైపు విమర్శలు వినిపిస్తుంటే.. మరోవైపు భారీ స్థాయిలో మద్దతు కూడా కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అమెరికా తర్వాత బ్రిటన్‌.. ఎందుకింత ఫోకస్‌?\u003C\u002Fp>\u003Cp>అమెరికా, కెనడా, బ్రిటన్‌.. ఈ మూడు దేశాల్లోనూ భారతీయ ప్రవాసుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా వీరి ప్రభావం ఎక్కువ. ఇలాంటి సమయంలో RSS శతాబ్ది ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం ద్వారా.. సంస్థకు సంబంధించిన భావజాలాన్ని ప్రవాస భారతీయులలోకి మరింత విస్తరించాలన్నది ఈ పర్యటనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. RSSపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమర్శలకు నేరుగా సమాధానం చెప్పే వేదికలను కూడా భగవత్‌ తన ప్రసంగాల ద్వారా ఉపయోగించుకుంటున్నారు. అమెరికాలో చేసిన ప్రసంగంలో ఏకత్వం, సామరస్యం గురించి మాట్లాడటం దీనికి ఉదాహరణగా చూడవచ్చు.\u003C\u002Fp>\u003Cp>లండన్‌లో భగవత్‌ ఏం చెబుతారు?\u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు అందరి దృష్టి లండన్‌లో జరిగే భగవత్‌ సమావేశంపైనే ఉంది. బ్రిటన్‌లోని భారతీయ ప్రవాసులకు ఆయన ఎలాంటి సందేశం ఇస్తారు? RSS భవిష్యత్‌ ప్రణాళికలను ఎలా వివరిస్తారు? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విమర్శలకు ఏమైనా స్పందిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>ఒకవైపు వందకుపైగా హిందూ కమ్యూనిటీ సంస్థలు భగవత్‌కు మద్దతుగా నిలిచాయి. మరోవైపు ఆయన పర్యటనపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రశ్నలు వచ్చాయి. అమెరికాలో కూడా ఇలాంటి మద్దతు, వ్యతిరేకత రెండూ కనిపించాయి. అంటే.. RSS శతాబ్ది వేడుకలు ఇప్పుడు భారత్‌ సరిహద్దులు దాటి అంతర్జాతీయ చర్చగా మారుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>మోహన్‌ భగవత్‌ లండన్‌ పర్యటనతో ఈ చర్చ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు RSS ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని ఎంతవరకు విస్తరించగలదు? అంతర్జాతీయ వేదికలపై వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటుంది? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.\u003C\u002Fp>",[39],{"url":13,"name":40},"sangham_vishwavyaptam_compressed_1mb.jpg",[],{"title":43,"description":44},"Mohan Bhagwat in UK: RSS Expands Its Global Outreach","Mohan Bhagwat’s UK visit highlights RSS’s global outreach amid support from Hindu groups and criticism from some British and US voices.",[46,55,61,68,74,79,87,93,98],{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"brutal-attack-on-brother-in-law-over-fears-that-the-sister-might-not-get-a-share-of-the-property","Crime : అక్కకు ఆస్తి రాదేమోనని..బావపై కిరాతకం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2ab549f8-6ec9-4a95-aa67-60b5618121c3.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-04T06:29:40+00:00",106,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":51,"read_time":52,"published_at":60,"public_read_count":54},"atrocity-against-female-journalist-for-questioning-the-cm","Delhi : సీఎంను ప్రశ్నించిందని.. మహిళా జర్నలిస్టుపై ఘోరం","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f46eb8f-92ab-4739-b195-c8279d2110a7.jpg","2026-09-04T06:53:52+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":51,"read_time":52,"published_at":66,"public_read_count":67},"kcr-is-a-good-man-his-word-is-his-bond-konda-surekha","TG : కేసీఆర్ మంచి వారు.. ఆయన మాటంటే మాటే : కొండా సురేఖ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F47b12f71-06ca-4360-9ba7-b538c523ff6a.webp","2026-09-04T07:35:30+00:00",2,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":51,"read_time":52,"published_at":73,"public_read_count":67},"dropping-one-moment-and-rising-the-nextgold-prices-deliver-another-shock","GOlD :   అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325b09d3-44b8-4064-85db-cddb219f643f.jpg","2026-09-04T07:47:13+00:00",{"slug":75,"title":76,"category":64,"image":77,"author":51,"read_time":52,"published_at":78,"public_read_count":54},"kondas-ministerial-portfolios-retained-by-cm-revanth","TG : సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa99d7fcb-a723-4eb5-89b0-ae27188e9f5a.jpg","2026-09-04T05:53:36+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":84,"read_time":52,"published_at":85,"public_read_count":86},"prashanth-neel-bollywood-stars","Prashanth Neel: 'డ్రాగన్' లో మరో బాలీవుడ్ స్టార్స్..నీల్ టార్గెట్ అక్కడేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8618ced9-0f4f-49b6-b99a-927626404364.webp","Anshu","2026-09-04T05:39:25+00:00",55,{"slug":88,"title":89,"category":64,"image":90,"author":15,"read_time":91,"published_at":92,"public_read_count":36},"revanth-delhi-tour-again","మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లో ‘బిగ్ ఛేంజ్‌’కు రంగం సిద్ధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbb38f52b-3789-4301-979f-d32de35f7ec9.jpg","9 నిమిషాల పఠనం","2026-09-04T05:13:20+00:00",{"slug":94,"title":95,"category":64,"image":96,"author":51,"read_time":52,"published_at":97,"public_read_count":36},"clash-during-teej-celebrations-students-clash-at-jntu","Hyd : ‘తీజ్’ వేడుకల్లో ఘర్షణ.. JNTUలో కొట్టుకున్న విద్యార్థులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb1642f7f-a164-4313-8b37-9bfed9a4f60b.jpg","2026-09-04T04:43:52+00:00",{"slug":99,"title":100,"category":101,"image":102,"author":51,"read_time":103,"published_at":104,"public_read_count":36},"hasnt-konda-changed-his-ways-did-he-fail-to-garner-sympathy-even-after-being-dismissed","TG : కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb22c8174-1820-42f1-9952-7e4f20e132d7.png","5 నిమిషాల పఠనం","2026-09-04T04:08:07+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]