[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},4812,1569,"rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral","Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!","అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్న కుటుంబ విలువలు అమెరికాకు వచ్చాక దిగజారిపోతున్నాయని,ముఖ్యంగా పెళ్లయిన మహిళలే అధికంగా పెళ్లికాని యువకులతో  వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని  సదరు వీడియోలో  ఆరోపించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23],"america","extramarrital affairs","womens","viral video","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-02T05:29:49+00:00","2026-09-02T05:30:44+00:00",157,"\u003Cp>అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్న కుటుంబ విలువలు అమెరికాకు వచ్చాక దిగజారిపోతున్నాయని,ముఖ్యంగా పెళ్లయిన మహిళలే అధికంగా పెళ్లికాని యువకులతో  వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని  సదరు వీడియోలో  ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎన్నారైల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇండియా నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు, చదువుల్లో రాణిస్తున్నప్పటికీ వారు అవలంభిస్తున్న కొన్ని విధానాలు మొత్తం తెలుగు కమ్యూనిటీకి చేటు చేసేలా ఉన్నాయని సదరు మహిళ  వీడియోలో ప్రస్తావించింది.\u003C\u002Fp>\u003Cp>ఎన్‌ఆర్‌ఐ (NRI)ల జీవనశైలి, వివాహేతర సంబంధాలు, వింత పోకడలు, షుగర్ డాడీ,  షుగర్ మమ్మీ కల్చర్ నానాటికీ పెరిగిపోతుందని ఆమె వీడియోలో ఆరోపించింది.ఈ వ్యవహారం పెద్దలకు తెలిసినా వారు ఏం చేయలేకపోతున్నారని, మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆ మహిళ ఆవేదన వ్యక్తం  చేసింది. అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు పెరిగిపోతున్నాయని వెల్లడించింది. అందుకు ఒక ఉదాహరణ కూడా  పేర్కొంది.\u003C\u002Fp>\u003Cp>తన ఫ్రెండ్ డివర్స్ తీసుకుని ఒంటరిగా ఉందని, ఆమెకు పెళ్లికాని యువకుడు పరిచయం అయ్యాడని తెలిపింది. వారిద్దరూ రిలేషన్‌లోకి వెళ్లారని.. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారని తెలిపింది. పెళ్లికి ముందే ఇంటిమేట్ కావడంతో తను ప్రెగ్నెంట్ అయ్యిందని.. అయితే, గర్భంతో ఉన్నప్పుడు పెళ్లి ఎలా పాజిబుల్ అవుతుందని ఆమె ప్రియుడు చెప్పడంతో గర్భస్రావం చేయించుకుందని పేర్కొంది. తీరా ప్రెగ్నెన్సీ తీసేయించుకున్నాక అతను పెళ్లికి నిరాకరించాడని.. వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోవడం  లేదని కారణాన్ని సాకుగా చూపాడని తెలిపింది.దీంతో పోస్టు ప్రెగ్నెన్సీ కారణంగా  తన ఫ్రెండ్ డిప్రెషన్‌లోకి వెళ్లిందని  వెల్లడించింది. ఇలాంటి ఘటనలు అమెరికాలో  చాలా జరుగుతున్నాయని, పెళ్లయిన మహిళలు డేటింగ్ బాట పడుతున్నారని ఆరోపించింది.\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉండగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు ఎన్‌ఆర్‌ఐ సమాజాన్ని జనరలైజ్ చేయడం సరికాదని మండిపడుతున్నారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"lady .jpg",[],"https:\u002F\u002Fx.com\u002FRTVnewsnetwork\u002Fstatus\u002F2094955424881783294?s=20",{"title":35,"description":36},"Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడ","అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్",[38,45,53,61,68,74,81,86,93,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":27},"murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha","TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","4 నిమిషాల పఠనం","2026-09-02T05:55:26+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"siege-from-all-eight-directions","అష్టదిగ్బంధనం","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc3cc852a-aefb-4549-8863-fd402c5f2efb.png","8 నిమిషాల పఠనం","2026-09-02T06:12:41+00:00",463,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":43,"published_at":59,"public_read_count":60},"chiranjeevi-pawan-kalyan","Chiranjeevi: సంకల్ప సాధకుడు \"కళ్యాణ్ బాబు\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92c0c979-d649-4283-b0ca-40c15a5d1ec6.webp","Anshu","2026-09-02T06:42:42+00:00",106,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":43,"published_at":66,"public_read_count":67},"chloroquine-spells-disaster-number-of-victims-rising","AP : కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","2026-09-02T06:59:26+00:00",2,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":43,"published_at":73,"public_read_count":67},"turmoil-in-congress-meenakshi-bids-adieu-to-telangana-politics","TG : కాంగ్రెస్‌లో కల్లోలం..  తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd351cb89-e404-4f05-b657-cb735700514b.jpg","2026-09-02T07:14:03+00:00",{"slug":75,"title":76,"category":71,"image":77,"author":78,"read_time":24,"published_at":79,"public_read_count":80},"telangana-a-four-pronged-strategy-regarding-congress-1000-day-rule-is-this-ktr-master-plan","Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2e0e593e-060d-484c-aa22-5e2b9fb6290a.jpg","Venu","2026-09-02T04:59:44+00:00",208,{"slug":82,"title":83,"category":71,"image":84,"author":15,"read_time":43,"published_at":85,"public_read_count":80},"three-months-ration-another-piece-of-good-news-for-beneficiaries","TG : మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7642422c-5c8c-4597-902f-b866f0b8dcb9.webp","2026-09-02T04:30:30+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":91,"read_time":24,"published_at":92,"public_read_count":80},"shakthi-sharma-women-power","ఆకాశమే హద్దు.. రక్షణ రంగంలో మహిళల దూకుడు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5756b421-e470-4d02-a81e-a34ca9478fd9.jpg","Kashi","2026-09-02T04:09:54+00:00",{"slug":94,"title":95,"category":71,"image":96,"author":15,"read_time":43,"published_at":97,"public_read_count":60},"revanths-plunder-uproar-over-posters-against-the-1000-day-rule","TG : రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dba70e2-68aa-4cfa-bd0a-bb20637b94be.jpg","2026-09-02T04:08:37+00:00",{"slug":99,"title":100,"category":71,"image":101,"author":78,"read_time":102,"published_at":103,"public_read_count":80},"hyderabad-corruption-unearthed-in-ghmc-special-audit-exposes-the-scam","Hyderabad: జీహెచ్‌ఎంసీలో బయటపడ్డ అవినీతి.. ప్రత్యేక ఆడిట్‌తో గుట్టు రట్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F813a659a-106f-4e78-a2d6-1ca6e8ce7b7e.jpg","7 నిమిషాల పఠనం","2026-09-02T04:01:48+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]