[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":99},5098,1705,"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  పార్టీ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే  దౌర్జన్యం  చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"KTR","BRS","CONGRESS","REVANTH REDDY","SWECHAANEWS","6 నిమిషాల పఠనం","2026-09-05T07:45:47+00:00","2026-09-05T07:46:14+00:00",157,"\u003Cp>రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  పార్టీ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే  దౌర్జన్యం  చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘జెన్ జీ’ సభకు హాజరైన  కేటీఆర్..రేవంత్ సర్కారు ప్రభుత్వ విధానాలు, పాలన తీరుపై విరుచుకపడ్డారు. \u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని  ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారని, 1000 రోజులు అయింది  ఏం చేశారని ప్రశ్నించారు. బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కేసీఆర్ రాజీనామా చేస్తే... \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>‘ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్. కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నారు.రాజీనామా చేయాల్సింది తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానని 1000 రోజులైనా చేయని ధోకేబాజ్ రాజీనామా చేయాలి. 2006లో ఇదే తీరుగా కాంగ్రెస్సోళ్లు కేసీఆర్ రాజీనామా చేయాలని కరీంనగర్ గడ్డపై ఎగిరారు.నాడు కేసీఆర్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ వీపు పగిలింది.  కేసీఆర్ రాజీనామా చేయాలా? లేదా రేవంత్ రెడ్డి అనే బట్టెబాస్ గాడు చేయాలా?’ తెలంగాణ ప్రజానీకం డిసైడ్ చేయాలన్నారు.\u003C\u002Fp>\u003Cp>ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన ‘తెలంగాణ యూత్ డిక్లరేషన్’ హామీ వీడియోలను ప్లే చేసి చూపించిన కేటీఆర్.. యువతరం కాంగ్రెస్ అబద్ధపు హామీలను గమనించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను మార్చే సత్తా యువతరానికి ఉందని..  ఢిల్లీలో విద్యార్థులు కదం తొక్కితేనే  ప్రధాని మోడీ వణికిపోయారని గుర్తుచేశారు. ‘మోడీనే గడగడలాడించిన యువతకు ఈ కేడీ ఓ లెక్కనా? హైదరాబాద్‌లో ఉండే ఈ చిట్టినాయుడు ‘జెన్-జీ’కి లెక్క కానే కాదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మంత్రుల తలో మాట..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే..  ‘ఒక మంత్రేమో లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటాడు. ఇంకో మంత్రేమో 60 వేలు, మరొకరేమో 70 వేలు అంటాడు. నోటికి ఎంత వస్తే.. అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాంగ్రెస్సోళ్లు. వీళ్లకో తిక్క ఉంది.. కానీ ఆ తిక్కకు లెక్క లేదు.నకల్ కొట్టాలంటే అకల్ ఉండాలి.. వీళ్లకు అది కూడా లేదు’ అని సెటైర్లు వేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong> జాక్‌పాట్ సీఎం రేవంత్.. \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>రేవంత్ రెడ్డి ఒక ఓటుకు నోటు దొంగ అని జాక్‌పాట్ తగలడంతో.. సీఎం కుర్చీలో కూర్చున్నారని అన్నారు. అడ్డమైన జీవోలు తెచ్చి.. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘నేను మాటిస్తున్నా.. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం గల్లా పట్టి నిలదీసే బాధ్యత మాది. విద్యార్థులకు న్యాయం చేస్తాం ’ అని  పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ముసలి నక్క కాంగ్రెస్.. \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్ అని కేటీఆర్ మండిపడ్డారు. 1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ఈ ముసలి నక్కే అని,  1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అన్నారు. 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్‌లో కలుపుకుంది కూడా ఈ ముసలి నక్కే అని మండిపడ్డారు. 2004లో సోనియా గాంధీ మాటిచ్చి ఆ తర్వాత పదేళ్లు తెలంగాణ ఇవ్వకుండా సతాయించిందని, శ్రీకాంతాచారి లాంటి తమ్ముళ్లు వందల మంది ప్రాణాలు కోల్పోయాక, కేసీఆర్ నిరాహార దీక్ష చేశాక ఈ ముసలి నక్క తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096135686072213838?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096135686072213838?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096131975245668649?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096131975245668649?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ktr karimnagar .jpg",[],{"title":11,"description":34},"రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికా",[36,42,51,57,63,71,76,82,88,94],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":24,"published_at":41,"public_read_count":27},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","Venu","2026-09-05T08:06:01+00:00",{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T08:36:44+00:00",106,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":48,"published_at":56,"public_read_count":27},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","2026-09-05T08:38:50+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":48,"published_at":61,"public_read_count":62},"beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao","BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","2026-09-05T09:02:58+00:00",3,{"slug":64,"title":65,"category":16,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":70},"bjp-candidates-shock-graduate-mlc-ramchander-rao-contest","Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7caf419f-882f-4d67-89d8-e33c48365f8a.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-05T09:10:17+00:00",1,{"slug":72,"title":73,"category":45,"image":74,"author":47,"read_time":48,"published_at":75,"public_read_count":50},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","2026-09-05T07:39:43+00:00",{"slug":77,"title":78,"category":54,"image":79,"author":15,"read_time":80,"published_at":81,"public_read_count":27},"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00",{"slug":83,"title":84,"category":45,"image":85,"author":47,"read_time":48,"published_at":86,"public_read_count":87},"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","2026-09-05T06:41:04+00:00",55,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":68,"published_at":93,"public_read_count":50},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","2026-09-05T06:39:17+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":15,"read_time":48,"published_at":98,"public_read_count":50},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]