[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":95},5893,2095,"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","Retro PhotoScam Alert : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. పాతకాలం నాటి దుస్తులు, వింటేజ్ హెయిర్‌స్టైల్, నాటి బ్లాక్ అండ్ వైట్‌తో కనిపించే '1980s రెట్రో ఫోటో' ట్రెండ్ నెటిజన్లను ఊపేస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22],"Retro Photo Scam","Cyber Crime","Cyber Security","swechaa news","5 నిమిషాల పఠనం","2026-09-12T12:17:43+00:00","2026-09-12T12:36:04+00:00",157,"\u003Cp>Retro PhotoScam Alert : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. పాతకాలం నాటి దుస్తులు, వింటేజ్ హెయిర్‌ స్టైల్, నాటి బ్లాక్ అండ్ వైట్‌తో కనిపించే '1980s రెట్రో ఫోటో' ట్రెండ్ నెటిజన్లను ఊపేస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 80ల నాటి లుక్‌లోకి మార్చుకుని వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సరదా వెనుక డిజిటల్ దొంగలు పన్నిన ప్రమాదకరమైన ఉచ్చు దాగుందని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద బాంబు పేల్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆ ఒక్క లింక్ టచ్ చేస్తే..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రజల్లో విపరీతంగా పెరిగిన ఈ వింటేజ్ ఫోటో క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమ సరికొత్త అస్త్రంగా మార్చుకున్నారు. \"1980s Retro Photo App\", \"Viral 1980 Photo Generator\" పేర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో గుర్తు తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్ లింకులను యథేచ్ఛగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఫోటో మారే మ్యాజిక్ ఏదో జరుగుతుందని ఆశపడి ఆ అనధికారిక లింకులపై క్లిక్ చేసి, యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు. వాటిని ఇన్‌స్టాల్ చేసుకున్న క్షణమే మీ మొబైల్ పూర్తిగా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>వ్యక్తిగత డేటా హ్యాక్.. బ్యాంకు ఖాతాల్లో\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఈ ఫేక్ యాప్స్ ద్వారా ఫోన్లలోకి చొరబడే ప్రమాదకరమైన మాల్వేర్ల సహాయంతో యూజర్స్‌కి ఏమాత్రం అనుమానం రాకుండా వారి వ్యక్తిగత డేటాను తస్కరిస్తున్నారు. నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, క్రెడిట్\u002Fడెబిట్ కార్డుల సీక్రెట్ సమాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాలను నిమిషాల్లో ఖాళీ చేసే ప్రమాదం ఉంది. ఇంతటితో ఆగకుండా, ఫోన్ గ్యాలరీలోని వ్యక్తిగత ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను సైతం అపహరించి డార్క్ వెబ్‌లో విక్రయించడం లేదా వాటితో బ్లాక్‌మెయిలింగ్, వేధింపులకు గురిచేసే భయంకరమైన కోణం ఇందులో దాగుందని హెచ్చరిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>శాశ్వతంగా పబ్లిక్ డొమైన్‌లోకి\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మనం సరదా కోసం అప్‌లోడ్ చేసే ప్రతి ఫోటో జీవితాంతం ఇంటర్నెట్ డొమైన్‌లోనే ఉండిపోతుందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లిన ఫోటోపై మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని, అవి సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెట్టే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా పోలీసులు పలు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా థర్డ్ పార్టీ లింకుల ద్వారా వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ను మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. కేవలం గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న సురక్షితమైన యాప్‌లను మాత్రమే వాడాలని చెబుతున్నారు. \u003C\u002Fp>\u003Cp>అనధికారిక సైట్లలో ఫ్యామిలీ, వ్యక్తిగత ఫోటోలను అప్‌లోడ్ చేసి ట్రెండ్‌ను ఫాలో కావొద్దని హెచ్చరించారు. తెలియని లింకులు క్లిక్ చేసి మోసపోతే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"WhatsApp Image 2026-09-12 at 5.43.31 PM.jpeg",[],{"title":33,"description":34},"Retro PhotoScam Alert: 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న","Retro PhotoScam Alert: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. పాతకాలం నాటి దుస్తులు, వింటేజ్ హెయిర్‌స్టైల్, నాటి బ్లాక్ అండ్ వైట్‌తో కనిపించే '1980s",[36,44,52,60,67,72,78,84,90],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-12T12:40:02+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",55,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":59},"dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case","Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","4 నిమిషాల పఠనం","2026-09-12T13:27:47+00:00",2,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":48,"read_time":42,"published_at":65,"public_read_count":66},"pm-modi-shares-photo-with-xi-jinping-putin-at-brics-summit","BRICS Summit: బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc82518-b41d-46b6-9677-85291a8359aa.jpg","2026-09-12T13:49:05+00:00",0,{"slug":68,"title":69,"category":16,"image":70,"author":48,"read_time":57,"published_at":71,"public_read_count":51},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","2026-09-12T12:06:41+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":41,"read_time":42,"published_at":76,"public_read_count":77},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","2026-09-12T12:03:50+00:00",208,{"slug":79,"title":80,"category":16,"image":81,"author":41,"read_time":57,"published_at":82,"public_read_count":83},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",259,{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":89},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","2026-09-12T11:37:06+00:00",106,{"slug":91,"title":92,"category":16,"image":93,"author":41,"read_time":57,"published_at":94,"public_read_count":83},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]