[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":101},4740,1533,"remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail","Hyd :  చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య","తనకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే మనస్తాపంతో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న  జైలు అధికారులు వెంటనే  ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"suicide","Prisoner","chanchalguda jail","hyderabad","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-01T07:05:34+00:00","2026-09-01T07:06:42+00:00",106,"\u003Cp>తనకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే మనస్తాపంతో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న  జైలు అధికారులు వెంటనే  ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని చంచల్ గూడ జైలులో వెలుగుచూసింది.కాగా, ఖైదీ మరణంతో  ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఘటనలో  కంది సాగర్(31)ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైలుకు తరలించారు.అయితే, తనకు బెయిల్ ఇప్పించాలని బాధితుడు తన భార్యను వేడుకున్నట్టు  సమాచారం. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది జైలులోనే వాష్ రూమ్‌‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఖైదీని కాపాడేందుకు జైలు అధికారులు తీవ్రంగా యత్నించినట్టు సమాచారం. బాధితుడిని వెంటనే  హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గంమధ్యలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నట్టు  అధికారులు వెల్లడించారు. కాగా, రిమాండులో ఉన్న ఖైదీ మరణించిన విషయాన్ని వారి కుటుంబసభ్యులకు పోలీసులు చేరవేసినట్టు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని  కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"chanchalguda jail.jpg",[],{"title":11,"description":34},"తనకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే మనస్తాపంతో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న  జైలు అధికారులు వెంటనే  ఆస్పత్రికి తరలించగా అప్ప",[36,45,51,58,64,70,76,82,89,95],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"varanasi-ott-business","Varanasi: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-01T07:09:51+00:00",55,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":42,"published_at":50,"public_read_count":27},"tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses","TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","Mamatha puppala","2026-09-01T07:22:07+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":24,"published_at":56,"public_read_count":57},"knife-attack-on-police-accused-shot","AP : పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","2026-09-01T07:27:27+00:00",157,{"slug":59,"title":60,"category":16,"image":61,"author":49,"read_time":42,"published_at":62,"public_read_count":63},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","2026-09-01T07:44:01+00:00",259,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":15,"read_time":42,"published_at":69,"public_read_count":57},"girl-kidnapped-in-patancheru-parents-attacked","Crime :  పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F46e25576-9949-4393-9b3b-4b44221c3999.jpg","2026-09-01T07:55:04+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":49,"read_time":42,"published_at":75,"public_read_count":27},"is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments","పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","2026-09-01T06:54:26+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":42,"published_at":80,"public_read_count":81},"kalyana-lakshmi-shaadi-mubarak-high-court-expresses-anger-over-the-governments-approach","TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e7c3ba2-c239-4fbe-b0d1-fa89b28e6b39.jpg","2026-09-01T06:50:56+00:00",361,{"slug":83,"title":84,"category":16,"image":85,"author":86,"read_time":87,"published_at":88,"public_read_count":63},"revanth-greater-plan","హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b531b5f-b990-4fa6-9578-5eef65a1b6b6.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-01T06:39:19+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":49,"read_time":42,"published_at":94,"public_read_count":27},"tim-cooks-era-at-apple-comes-to-an-end-john-ternus-named-as-the-new-leader","యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8c33d1-349b-48cc-83c7-aec531ad1619.png","2026-09-01T06:26:04+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":49,"read_time":42,"published_at":100,"public_read_count":27},"125-year-old-ancient-temple-demolished-in-pakistan-strong-protests","పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3591b251-34a0-483f-addf-4fe3850f54b7.jpg","2026-09-01T06:03:03+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]