[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pune-battle-cry-against-mpsc-irregularities-cjp-abhijit-deepke-supports-the-students-struggle":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},5239,1774,"pune-battle-cry-against-mpsc-irregularities-cjp-abhijit-deepke-supports-the-students-struggle","Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!","అక్టోబర్ 25న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, రద్దు చేసిన స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత వచ్చే వరకు, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd305b999-4898-4766-9f08-2b8b7ff887fc.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd305b999-4898-4766-9f08-2b8b7ff887fc.jpg","Venu","national","routine",[19,20,21,22,23,24,25],"Maharashtra","Pune","CJP","MPSC","Abhijit Deepke","supports","students","5 నిమిషాల పఠనం","2026-09-06T11:31:04+00:00","2026-09-06T11:32:32+00:00",55,"\u003Cp>మహారాష్ట్రలో పోటీ పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది! MPSC పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన అభ్యర్థులకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. పుణేలోని ఓంకారేశ్వర్ మందిర్ చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జరగనున్న విద్యార్థి ఆక్రోశ్ మోర్చాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని CJP అధినేత అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా వెల్లడించారు.. \u003C\u002Fp>\u003Cp>ఈ ఉద్యమంలో విద్యార్థులు మరియు CJP ప్రధానంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. MPSC అధ్యక్షుడు, కార్యదర్శి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, వారి స్థానంలో నీతి, నిజాయితీ కలిగిన అధికారులను నియమించాలని కోరారు. గ్రూప్-బీ పరీక్షలోని అభ్యంతరాలపై ఎనిమిది రోజుల్లోగా స్పష్టతనిచ్చి, జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>అంతేకాకుండా, రాజ్యసేవ మెయిన్స్ 2025, వ్యవసాయ సేవల డిస్క్రిప్టివ్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు. మరోవైపు, ముంబై క్రైమ్ బ్రాంచ్ MPSCకి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను వెంటనే బహిరంగపరచాలని CJP డిమాండ్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు, అండర్ సెక్రటరీ అభిజీత్ లెండే పదవీకాలంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని స్పష్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>నిందితులు లెండే, మరాఠే, నఖాతేల సర్వీస్ కాలం, వారి పదోన్నతుల ప్రమాణాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, వీరి కాంటాక్ట్‌ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల కాల్ డేటా రికార్డ్స్‌ను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించారు. దీంతో పాటు ప్రవీణ్ పాటిల్, మయూర్ ఠాక్రేలతో పాటు ఈ కుంభకోణంలో ఇతర ఏజెంట్ల ప్రమేయంపై స్వతంత్ర విచారణ జరగాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. DI విభాగంలోని అనుమానాస్పద ఫలితాలు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులపై ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే అక్టోబర్ 25న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, రద్దు చేసిన స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత వచ్చే వరకు, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. మరోవైపు అధికారిక వ్యవస్థల్లో పాతుకుపోయిన అవినీతిపై కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది.. \u003C\u002Fp>\u003Cp>గతంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న ఎందరో అధికారుల అక్రమాలను CJP ఎండగట్టింది. ప్రజా ఉద్యమాల ద్వారా వారిని దిగివచ్చేలా చేసి, రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెచ్చిన చరిత్ర CJPకి ఉంది. అదే ఊపుతో, ఇప్పుడు MPSC అక్రమార్కుల ఆట కట్టించేందుకు, విద్యార్థుల వైపు నిలబడి మరో పోరాటానికి సిద్ధమైంది.. \u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"ANI-20260730080215-600x315.jpg",[],{"title":36,"description":37},"MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్","అక్టోబర్ 25న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, రద్దు చేసిన స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే",[39,47,54,62,67,74,80,85,90,95],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"would-they-remain-silent-if-this-happened-to-the-dgps-daughters-in-law-kavitha-expresses-outrage-over-the-constables-suspension","'డీజీపీ కోడళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' కానిస్టేబుల్ సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef7ccbfc-6a2c-4c02-99c4-6d4ae42d691b.jpg","Mamatha puppala","2026-09-06T11:35:20+00:00",157,{"slug":48,"title":49,"category":42,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":53},"ys-sharmila-daughter-anjali-reddy-engaged-to-dr-somala-raghuram-reddy","ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fe8254d-5cbb-490f-ba2e-7d99ee189892.jpg","Mahesh","2026-09-06T11:37:01+00:00",4,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":44,"read_time":59,"published_at":60,"public_read_count":61},"viral-duleep-trophy-final-tilak-varma-teases-vaibhav-suryavanshi","VIRAL: దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb745877f-2374-4329-900c-aba187138ba5.jpg","4 నిమిషాల పఠనం","2026-09-06T11:59:00+00:00",106,{"slug":63,"title":64,"category":42,"image":65,"author":51,"read_time":59,"published_at":66,"public_read_count":53},"kcr-should-resign-as-mla-mahesh-kumar-goud-demands-at-indira-park-protest","TG: కేసీఆర్‌పై మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఫైర్.. ప్రతిపక్ష నేత హోదాకు న్యాయం చేయాలని డిమాండ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff33258f0-82f0-48ba-a855-b8d82943886f.jpg","2026-09-06T12:10:40+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":72,"read_time":59,"published_at":73,"public_read_count":46},"krish-jagarlamudi-gen-z-batch","krish Jagarlamudi: ఫ్లాప్స్ ప్రభావం..కొత్త వాళ్ళతో మొదటి సినిమాలా ప్రయత్నం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F147a971f-0276-4f91-a912-d117f68a11a8.jpg","Anshu","2026-09-06T12:13:05+00:00",{"slug":75,"title":76,"category":70,"image":77,"author":51,"read_time":59,"published_at":78,"public_read_count":79},"the-paradise-nani-low-promotions-release-15-days-away","The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ్గించాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7cbf879d-10b8-4dc0-9621-4dbb37001d08.webp","2026-09-06T10:50:14+00:00",208,{"slug":81,"title":82,"category":16,"image":83,"author":15,"read_time":59,"published_at":84,"public_read_count":29},"delhi-pg-pg-hostel-collapses-50-students-trapped-under-the-debris","Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feddac82d-fcea-4a23-9afe-f3d251c6bc53.jpg","2026-09-06T10:30:41+00:00",{"slug":86,"title":87,"category":42,"image":88,"author":51,"read_time":59,"published_at":89,"public_read_count":29},"tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders","TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","2026-09-06T09:50:17+00:00",{"slug":91,"title":92,"category":42,"image":93,"author":44,"read_time":59,"published_at":94,"public_read_count":61},"date-finalized-for-monsoon-season-paddy-procurement-key-decision-by-the-revanth-government","వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ea2b103-a775-4e7c-ba35-e5eacd812882.jpg","2026-09-06T09:29:44+00:00",{"slug":96,"title":97,"category":42,"image":98,"author":44,"read_time":59,"published_at":99,"public_read_count":46},"dgp-takes-a-serious-view-of-forced-extortion-by-transgender-individuals-issues-key-directives","ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a740b9e-157c-4250-b3ff-f98fff21ef02.jpg","2026-09-06T09:13:48+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]