[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":102},4543,1437,"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు వేళ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదయం 9:20గంటల సమయంలో పాఠశాలలో 1,643మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగా ఎగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయని ప్రిన్సిపాల్‌కు ఫోన్ కాల్ వచ్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24],"NepalFloods","RajendraDawadi","HeroicRescue","NuwakotNepal","InternationalNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T08:34:27+00:00","2026-08-30T08:34:43+00:00",463,"\u003Cp>\u003Cspan>&nbsp;నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు వేళ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదయం 9:20గంటల సమయంలో పాఠశాలలో 1,643మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగా ఎగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయని ప్రిన్సిపాల్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ప్రారంభంలో మూడంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని భావించినప్పటికీ, పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుని ఆయన తక్షణమే స్పందించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;వెంటనే పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయించడంతో పాటు బస్సులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. భయంతో స్పృహతప్పి పడిపోయిన ఒక విద్యార్థినిని బైక్‌పై పంపించి, మిగిలిన పిల్లలందరినీ ఎత్తైన కొండ ప్రాంతం వైపు పరుగులు తీయించారు. ఏ ఒక్క చిన్నారీ వెనుకబడిపోకుండా తనే అందరికంటే చివర్లో నడుస్తూ పర్యవేక్షించారు. పిల్లలంతా కొండపైన ఉన్న రావి చెట్టు వద్దకు చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ప్రళయంలా వచ్చిన వరద ప్రవాహం ఆ మూడు అంతస్తుల భవనాన్ని మట్టి, రాళ్లతో కప్పేసి పూర్తిగా తుడిచిపెట్టేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రిన్సిపాల్ చొరవతో 1,643మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయనతో పాటు పనిచేసే ఇద్దరు సిబ్బందిని కాపాడుకోలేకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం టిఫిన్ కోసం నది ఒడ్డున ఉన్న గదికి వెళ్లిన చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్(32), పాఠశాల తలుపులు వేయడానికి వెళ్లిన వాచ్‌మన్ సుల్తాన్ లామా ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు దవాడీని దేవుడిలా కొనియాడుతుంటే, పిల్లల ప్రాణాలు కాపాడటం తన బాధ్యత మాత్రమేనని ఆయన నమ్రతతో తెలిపారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద దాదాపు 50ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ప్రళయం సంభవించింది. 2015నాటి వినాశకర భూకంపం తరహాలోనే హిమాలయ ప్రాంతాల్లో సంభవించే ఆకస్మిక వరదలు ఎంతటి తీవ్ర ముప్పు కలిగిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సరియైన సమయంలో తీసుకునే ఒక్క సాహసోపేత నిర్ణయం వేలాది ప్రాణాలను కాపాడగలదని రాజేంద్ర దవాడీ నిరూపించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-08-30 at 2.00.41 PM.jpeg",[],"https:\u002F\u002Fx.com\u002Ftv13gujarati\u002Fstatus\u002F2093966391225504078?s=20",{"title":36,"description":37},"ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు..",[39,47,55,61,67,74,81,86,91,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":44,"published_at":45,"public_read_count":46},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","5 నిమిషాల పఠనం","22 నిమిషాలు క్రితం",4,{"slug":48,"title":49,"category":42,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","25 నిమిషాలు క్రితం",2,{"slug":56,"title":57,"category":42,"image":58,"author":51,"read_time":25,"published_at":59,"public_read_count":60},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","51 నిమిషాలు క్రితం",157,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":25,"published_at":66,"public_read_count":60},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","58 నిమిషాలు క్రితం",{"slug":68,"title":69,"category":64,"image":70,"author":71,"read_time":25,"published_at":72,"public_read_count":73},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu","1 గంట క్రితం",667,{"slug":75,"title":76,"category":42,"image":77,"author":78,"read_time":79,"published_at":72,"public_read_count":80},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం",412,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":51,"read_time":25,"published_at":72,"public_read_count":60},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":51,"read_time":25,"published_at":72,"public_read_count":46},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":25,"published_at":72,"public_read_count":96},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",106,{"slug":98,"title":99,"category":64,"image":100,"author":71,"read_time":25,"published_at":72,"public_read_count":101},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]