[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pm-modi-not-war-but-peace-is-the-way-modi-delivers-a-message-of-peace-in-putins-presence":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":108},4693,1510,"pm-modi-not-war-but-peace-is-the-way-modi-delivers-a-message-of-peace-in-putins-presence","PM Modi: 'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!","బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మంత్రాన్ని జపించారు. \"ముగింపు లేని యుద్ధాల నుంచి.. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడాలి\" అని పిలుపునిచ్చారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8d943977-e014-4556-a12c-3112603b4b00.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8d943977-e014-4556-a12c-3112603b4b00.jpg","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24,25],"ModiPutinMeet","SCOSummit2026","IndiaRussiaTies","VladimirPutin","NarendraModi","BishkekSCO","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T03:19:05+00:00","2026-09-01T03:20:55+00:00",412,"\u003Cp>బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మంత్రాన్ని జపించారు. \"ముగింపు లేని యుద్ధాల నుంచి.. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడాలి\" అని పిలుపునిచ్చారు. గాంధీ, బుద్ధుడు నడిచిన నేతగా భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపనకు జరిగే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>త్వరలోనే న్యూఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా, అందుకు పుతిన్ సానుకూలంగా స్పందించారు. భారత్-రష్యాల మధ్య ఉన్న 'విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలోపేతమవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనబరుస్తున్న వ్యక్తిగత శ్రద్ధ, చొరవ, ఇరు నేతల మధ్య ఉన్న ఆప్యాయమైన స్నేహబంధమే ప్రధాన కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు.\u003C\u002Fp>\u003Cp>ఇరు దేశాల మధ్య కేవలం వ్యూహాత్మక, వాణిజ్యపరమైన ఒప్పందాలు మాత్రమే కాకుండా, బలమైన వ్యక్తిగత విశ్వాసం నిండి ఉందనడానికి ఈ సమావేశం నిదర్శనంగా నిలిచింది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై పుతిన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేస్తూ, గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే ఎస్‌సీఓ సదస్సు వేదికగా మోదీని కలవడం సంతోషంగా ఉందన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక రంగాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, గత ఏడాది స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధి చెందిందని వెల్లడించారు. విద్యా రంగంలోనూ రెండు దేశాల భాగస్వామ్యం అద్భుతంగా సాగుతోందని, రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో ఏడు రెట్లు పెరిగి దాదాపు 40వేలకు చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. \u003C\u002Fp>\u003Cp>మరొకవైపు, 2027 నాటికి భారత్-రష్యా దౌత్య సంబంధాలు 80 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్న దృష్ట్యా ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు నాయకులు నిర్ణయించారు. ద్వైపాక్షిక భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఒకే వాహనంలో ప్రయాణించి బిష్కెక్‌లో ప్రారంభమైన ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ వేడుకకు కలిసి వెళ్లడం ప్రపంచ దౌత్య వర్గాలలో ఆకర్షణగా నిలిచింది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"HRDsKT1bcAEMKMA.jpeg",[],{"title":36,"description":37},"'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!","బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి ..",[39,47,53,60,68,75,83,89,94,101],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"cyber-crime-cybercriminals-new-plan-online-fraud-under-the-guise-of-donations","Cyber crime: సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81d0c4a-5bc8-4cae-8a34-5b1f571368c8.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-09-01T03:31:44+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":52},"el-nino-effect-threat-to-irrigation-and-drinking-water-supplies-in-september-inevitable","'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff4a9ad86-2b1a-4675-8949-086a5d10576e.jpg","2026-09-01T03:41:43+00:00",514,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":26,"published_at":58,"public_read_count":59},"anna-hazare-critically-ill-shifted-to-hospital-in-mumbai","అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc75e36-d661-4269-bd06-f9b14af58237.jpg","2026-09-01T04:03:01+00:00",157,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":46},"a-mothers-daring-feat-for-her-daughters-education-carrying-her-slippers-in-hand","viral :  కూతురి చదువు కోసం ఓ తల్లి సాహసం.. చెప్పులు చేతబట్టుకుని!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c49dafa-3de9-4f73-9f83-74b9d476c13f.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-01T04:06:57+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":43,"read_time":73,"published_at":74,"public_read_count":59},"telangana-the-gang-foreman-achieves-nothing-but-his-talk-is-endless","Telangana: గుంపు మేస్త్రీ.. చేతలు సున్నా!! మాటలు మిన్న!!","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdee291f0-360f-4f6e-81ea-c237a8437092.jpg","7 నిమిషాల పఠనం","2026-09-01T04:07:23+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":43,"read_time":80,"published_at":81,"public_read_count":82},"vikarabad-vikarabad-department-of-agriculture-groundnut-seed-distribution","Vikarabad: సబ్సిడీ నిధులు గోల్‌మాల్.. కలెక్టర్ నివేదికతో కదిలిన ఫైల్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd82d3842-db55-4b3e-b1c4-439dd54dd92e.webp","5 నిమిషాల పఠనం","2026-09-01T02:52:58+00:00",55,{"slug":84,"title":85,"category":86,"image":87,"author":43,"read_time":26,"published_at":88,"public_read_count":82},"spirituality-they-say-that-dying-in-kashi-leads-to-liberation-why","Spirituality: కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుకు?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F15014c17-b4ad-46ca-9dab-0cfdbaad3b69.jpg","2026-09-01T02:26:15+00:00",{"slug":90,"title":91,"category":86,"image":92,"author":43,"read_time":80,"published_at":93,"public_read_count":82},"spirituality-who-are-the-tathastu-deities-and-what-is-the-reason-behind-them-getting-that-name","Spirituality: తథాస్తు దేవతలు అంటే ఎవరూ?.. వారికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba20c7f3-7b7e-4ea5-b11d-0462a69b1adb.jpg","2026-09-01T02:19:56+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":98,"read_time":99,"published_at":100,"public_read_count":59},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",{"slug":102,"title":103,"category":104,"image":105,"author":106,"read_time":66,"published_at":107,"public_read_count":82},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","NK","2026-08-31T18:16:48+00:00",[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]