[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":98},4556,1444,"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","ఢిల్లీలో యువత (Gen Z) చేపట్టిన నీట్ (NEET) నిరసనల సెగ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన పాఠాలే నేర్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆందోళనల తదనంతర పరిణామాలను గ్రహించిన మోదీ, ప్రస్తుతం ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ఏ సామాజిక మాధ్యమ పోస్ట్ పెట్టినా లేదా 'మన్ కీ బాత్' వంటి వేదికల ద్వారా ప్రసంగించినా యువత అంశాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"PMModi","MannKiBaat2026","BharatRajya","DrugFreeIndia","VocalForLocal","NationalNewsTelugu","swechaanews","5 నిమిషాల పఠనం","2026-08-30T09:40:25+00:00","2026-08-30T09:40:51+00:00",412,"\u003Cp>ఢిల్లీలో యువత (Gen Z) చేపట్టిన నీట్ (NEET) నిరసనల సెగ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన పాఠాలే నేర్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆందోళనల తదనంతర పరిణామాలను గ్రహించిన మోదీ, ప్రస్తుతం ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ఏ సామాజిక మాధ్యమ పోస్ట్ పెట్టినా లేదా 'మన్ కీ బాత్' వంటి వేదికల ద్వారా ప్రసంగించినా యువత అంశాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. నవతరం ఆలోచనలను, వారి సృజనాత్మకతను నిరంతరం ప్రశంసిస్తూ, 'డ్రగ్-ఫ్రీ ఇండియా' లాంటి ప్రచారాల్లో వారినే భాగస్వాములను చేస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ తన 137వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సాంకేతికతను ఉపయోగిస్తూ యువత చేస్తున్న వినూత్న ప్రయత్నాలను విశేషంగా ప్రశంసించారు. ముఖ్యంగా ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రి రూపొందించిన ‘BharatRajya’ అనే వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిర్దిష్ట సంవత్సరాన్ని ఎంచుకుంటే ఆ సమయంలో భారతదేశాన్ని పాలించిన రాజులు, రాజ్యాల వివరాలను అందించే ఈ సైట్ ద్వారా సాంకేతికత సహాయంతో చరిత్రను మరింత ఆసక్తికరంగా, సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుందని మోదీ కొనియాడారు.\u003C\u002Fp>\u003Cp>దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘డ్రగ్-ఫ్రీ ఇండియా’ (మాదకద్రవ్యాల రహిత భారత్) ఉద్యమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడుకోవడం అత్యంత కీలకమని, దీనికోసం సమాజంలో అవగాహన పెంచేందుకు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, యువత చొరవతో ముందుకు రావాలని సూచించారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, చిన్న మార్పులు కూడా సరైన దిశలో పడితే దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనందించే క్రమంలో ప్రధాని ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. \u003C\u002Fp>\u003Cp>స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, చేతివృత్తుల కళాకారులు, చిన్న తరహా పరిశ్రమలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పౌరులందరూ వీలైనంత వరకు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. మరొకవైపు పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని గుర్తుచేశారు. ఒక ప్రాంతంలో పరిశుభ్రత పాటించడం వల్ల అక్కడ ఆరోగ్యం పెరగడమే కాకుండా, ఆ ప్రాంత స్వరూపమే మారిపోతుందని వ్యాఖ్యానించారు. \u003C\u002Fp>\u003Cp>మొత్తంగా ఈ 137వ కార్యక్రమంలో యువ ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ వెలుగులు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రధాని సమగ్రమైన దిశానిర్దేశం చేశారు. జెన్జీ వర్గం నుంచి వ్యతిరేకత పెరిగితే రాజకీయంగా జరిగే నష్టాన్ని ముందే ఊహించి, వారి నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ప్రధాని తమ ప్రసంగాల్లో యువత ప్రాధాన్యతను నిలబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-30 150817.jpg",[],{"title":11,"description":36},"ఢిల్లీలో యువత (Gen Z) చేపట్టిన నీట్ (NEET) నిరసనల సెగ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన పాఠాలే నేర్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆందోళనల తదనంతర పరిణామాలను ..",[38,47,54,59,65,71,76,81,88,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","1 గంట క్రితం",106,{"slug":48,"title":49,"category":41,"image":50,"author":43,"read_time":51,"published_at":52,"public_read_count":53},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","4 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",157,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":53},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg",{"slug":60,"title":61,"category":57,"image":62,"author":63,"read_time":51,"published_at":52,"public_read_count":64},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu",667,{"slug":66,"title":67,"category":41,"image":68,"author":69,"read_time":70,"published_at":52,"public_read_count":29},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":43,"read_time":51,"published_at":52,"public_read_count":53},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg",{"slug":77,"title":78,"category":41,"image":79,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":80},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg",514,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":43,"read_time":51,"published_at":86,"public_read_count":87},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg","3 గంటలు క్రితం",4,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":51,"published_at":86,"public_read_count":46},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",{"slug":94,"title":95,"category":57,"image":96,"author":63,"read_time":51,"published_at":86,"public_read_count":97},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]