[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-pm-modi-brics-countries-should-set-global-rules-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},6003,2149,"pm-modi-brics-countries-should-set-global-rules-comments","PM Modi: బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు","PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపం వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fefd4fd8e-bbc4-4f7e-bf9d-0a882fbfe8be.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fefd4fd8e-bbc4-4f7e-bf9d-0a882fbfe8be.jpg","Mahesh","zindagi","routine",[19,20,21,22,23,24],"PM Modi","Narendra Modi","BRICS Summit","BRICS","India BRICS","swechaa news","5 నిమిషాల పఠనం","2026-09-13T11:55:17+00:00","2026-09-13T11:56:04+00:00",106,"\u003Cp>PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపం వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందే పరోక్షంగా చైనా అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ మోడీ చేసిన కామెంట్స్ దౌత్య వర్గాల్లో సంచలనంగా మారాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>జిన్‌పింగ్ ఎదుటే 'ఖనిజాల ఆధిపత్యం'పై సూటి దాడి \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు అత్యంత కీలకమైన 'అరుదైన ఖనిజాల' ప్రాసెసింగ్‌లో చైనా ఏకఛత్రాధిపత్యం (దాదాపు 90 శాతం) చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి సరఫరాను ఆయుధంగా మలుచుకుని ఇతర దేశాలను ఒత్తిడికి గురిచేసే ధోరణిని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు. \"అత్యాధునిక సాంకేతికతను, సంక్లిష్ట ఖనిజాలను అడ్డం పెట్టుకుని ఇతరులను బెదిరించే చర్యలను ప్రపంచం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. ఇలాంటి ప్రవర్తన దేశాల సమిష్టి ప్రగతికి గొడ్డలిపెట్టు\" అని స్పష్టం చేశారు. ఎదురుగా జిన్‌పింగ్ కూర్చుని వింటుండగానే మోడీ నేరుగా ఈ అంశాన్ని లేవనెత్తడం సదస్సులో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఇకపై నియమాలు పాటించే వాళ్లం కాదు.. రాసే వాళ్లం \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అభివృద్ధి చెందుతున్న 'గ్లోబల్ సౌత్' దేశాల గొంతుకగా నిలిచిన ప్రధాని మోడీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో వస్తున్న అసమానతలను కుండబద్దలు కొట్టారు. \"ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ముందుగా నష్టపోయేది గ్లోబల్ సౌత్ దేశాలే. కానీ, ప్రపంచ విధానాలను నిర్దేశించే కీలక నిర్ణయాధికారాల దగ్గరకు వచ్చేసరికి ఈ దేశాలను వెనుక వరుసలో కూర్చోబెడుతున్నారు. ఇది మారాలి. ఇకపై మనం ఇతరులు రాసిన నిబంధనలను పాటించే వాళ్లుగా మాత్రమే మిగిలిపోకూడదు.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే నియమాలను తయారు చేసే స్థాయికి ఎదగాలి\" అని దిశానిర్దేశం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్టార్టప్ నిధి.. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>బ్రిక్స్ దేశాల బలం వాటి వైవిధ్యంలోనే ఉందని పేర్కొన్న ప్రధాని, భవిష్యత్ అవసరాల కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు. బ్రిక్స్ దేశాల్లోని అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రత్యేక స్టార్టప్ నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను ముందుగానే పసిగట్టి అడ్డుకునే వ్యవస్థపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటించారు. ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, భారత్ ఎల్లప్పుడూ ప్రకృతి సమతుల్యతకే ప్రాధాన్యత ఇస్తుందని మోడీ పునరుద్ఘాటించారు. సాధారణ చర్చలకే పరిమితం కాకుండా, పొరుగు దేశపు ఆధిపత్య పోకడలను ప్రపంచ వేదికపైనే ప్రశ్నిస్తూ, గ్లోబల్ సౌత్ నాయకత్వ బాధ్యతను భారత్ భుజానికెత్తుకున్న తీరు ఈ సదస్సులో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-13 at 5.21.46 PM.jpeg",[],{"title":35,"description":36},"PM Modi: బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని","PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపం వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దే",[38,47,54,59,65,70,76,81,86,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"ntr-dragon-prashanth-neel","NTR-Dragon: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe74cf6d7-21dc-452b-a6c5-f4724d8567ef.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-13T11:57:18+00:00",259,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":44,"published_at":53,"public_read_count":28},"madhya-pradesh-i-am-resigning-from-the-cm-post-abhijeet-dipke-sensational-post","Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca75c0f5-0630-4143-a8db-5ccf5bd04dfa.jpg","Venu","2026-09-13T11:59:32+00:00",{"slug":55,"title":56,"category":41,"image":57,"author":43,"read_time":44,"published_at":58,"public_read_count":28},"tollywood-anupama-parameswaran","Tollywood: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2140aa81-4115-4238-b772-28958f968d79.jpg","2026-09-13T12:17:26+00:00",{"slug":60,"title":61,"category":41,"image":62,"author":43,"read_time":44,"published_at":63,"public_read_count":64},"rashmika-mandanna-rashmika-mandanna","Rashmika Mandanna: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffa3213f7-952d-4617-b372-a38f1343311c.jpg","2026-09-13T12:41:30+00:00",55,{"slug":66,"title":67,"category":41,"image":68,"author":15,"read_time":25,"published_at":69,"public_read_count":64},"nandus-world-youtuber-fraud-case-husband-role-behind-the-scenes-gang","Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97d4947d-ac2a-41e1-a858-6fe2463ba26f.jpg","2026-09-13T12:52:34+00:00",{"slug":71,"title":72,"category":41,"image":73,"author":43,"read_time":44,"published_at":74,"public_read_count":75},"aishwarya-lekshmi-spirit","Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb400fbbe-28e5-4ece-9a62-12172f0dfd71.webp","2026-09-13T11:35:51+00:00",310,{"slug":77,"title":78,"category":50,"image":79,"author":52,"read_time":44,"published_at":80,"public_read_count":64},"odisha","Odisha: ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe22e632c-1c95-4fc3-9190-c0a6ad65e551.jpg","2026-09-13T11:22:27+00:00",{"slug":82,"title":83,"category":41,"image":84,"author":15,"read_time":25,"published_at":85,"public_read_count":28},"movie-intervals-technical-problem-to-multi-crore-business-story","Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","2026-09-13T10:29:56+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":91,"read_time":44,"published_at":92,"public_read_count":28},"singareni-coal-heavy-rains-coal-production-halted-in-singareni-mines","SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca6300da-9673-4a33-a0b6-e135fd75f1a7.jpg","Mamatha puppala","2026-09-13T09:40:57+00:00",{"slug":94,"title":95,"category":89,"image":96,"author":97,"read_time":44,"published_at":98,"public_read_count":99},"i-was-the-first-to-support-revanth-but-konda-surekha","Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","Kumar","2026-09-13T09:39:20+00:00",514,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]