[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":101},4215,1277,"no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight","AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం","ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందిపై రోగి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల  మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23],"no power","government hospital","mobile torch","treatment","Andrapradesh","4 నిమిషాల పఠనం","2026-08-27T05:03:21+00:00","2026-08-27T05:04:16+00:00",106,"\u003Cp>ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందిపై రోగి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల  మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే  కాలిన గాయాలతో వచ్చిన ఐదేళ్ల బాలుడికి మొబైల్ టార్చ్‌లైట్ వెలుగుల్లో ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు.బిడ్డిక జీవన్(5)పై  ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడ్డాయి. దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే మన్యం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.\u003C\u002Fp>\u003Cp>అదే సమయంలో  ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్యులు మొబైల్ టార్చ్ ‌లైట్ వెలుగులోనే బాలుడికి వైద్యం అందించినట్టు  తెలిసింది. బాధిత బాలుడికి మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచన మేరకు కుటుంబసభ్యులు మరల పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదని..  రోడ్లు, తాగు నీరు, ఆస్పత్రులు ఏర్పాటు చేయించామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతుండగా..  ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అందులో కరెంట్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా? జనరేటర్ సదుపాయం కూడా లేకపోతే ఎలా? అని ప్రజలు నిలదీస్తున్నారు.కాగా, టార్చ్ లైట్ వెలుగుల్లో బాలుడికి చికిత్స అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వాలు మారిన సర్కారీ ఆస్పత్రుల్లో వసతులు మెరుగవ్వడం లేదని విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>  \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092831303712542725?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092831303712542725?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"torch.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092831303712542725?s=20",{"title":35,"description":36},"AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి","ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందిపై రోగి తరఫు బంధువ",[38,46,53,59,65,73,78,83,91,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":45},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","5 నిమిషాల పఠనం","15 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":24,"published_at":52,"public_read_count":45},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png","Mamatha puppala","25 నిమిషాలు క్రితం",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":24,"published_at":58,"public_read_count":27},"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg","32 నిమిషాలు క్రితం",{"slug":60,"title":61,"category":49,"image":62,"author":51,"read_time":24,"published_at":63,"public_read_count":64},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg","51 నిమిషాలు క్రితం",157,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":27},"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","Anshu","3 నిమిషాల పఠనం","55 నిమిషాలు క్రితం",{"slug":74,"title":75,"category":41,"image":76,"author":15,"read_time":24,"published_at":77,"public_read_count":27},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","1 గంట క్రితం",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":51,"read_time":43,"published_at":77,"public_read_count":64},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":89,"published_at":77,"public_read_count":90},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం",565,{"slug":92,"title":93,"category":41,"image":94,"author":15,"read_time":24,"published_at":77,"public_read_count":27},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg",{"slug":96,"title":97,"category":86,"image":98,"author":51,"read_time":99,"published_at":100,"public_read_count":64},"that-is-the-cause-of-the-flash-floods-in-nepal-another-disaster-looming","నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F21239414-22a0-48da-8c72-db507b3b90cd.jpg","6 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]