[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-new-voter-list":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":32,"published_at":33,"public_read_count":34,"body":35,"images":36,"video_url":5,"video_urls":39,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":40,"read_next":43,"sponsored_content":104},4187,1263,"new-voter-list","ఎవరి ఓటు ఉంటుంది? ఎవరి ఓటు పోతుంది? నేటి నుంచే కొత్త‌ లెక్క!","తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్‌లో జరిగే ప్రతి మార్పు పార్టీలకు కీలకమే. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు తగ్గినా.. మరికొన్ని వేల ఓట్లు కొత్తగా చేరినా.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండొచ్చు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F817be9fd-52af-4c1a-9ab0-a3a859dfcbb3.jpg","Kashi","telangana","routine",[18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31],"Telangana Politics","Telangana Voter List","Voter Roll Revision","Telangana Elections","Congress Telangana","BRS Telangana","BJP Telangana","Telangana Political News","Voter Verification","Telangana News","Political Analysis","Telangana Voters","Electoral Roll","Hyderabad Politics","7 నిమిషాల పఠనం","2026-08-26T17:54:53+00:00",106,"\u003Cp>నేటి నుంచే ఓటు గేమ్.. \u003C\u002Fp>\u003Cp>తెలంగాణ రాజకీయాల్లో కొత్త టెన్షన్!\u003C\u002Fp>\u003Cp>గ్రామాల్లో గ్రామ స‌భ‌లు.. ప‌ట్ట‌ణాల్లో వార్డు స‌భ‌లు\u003C\u002Fp>\u003Cp>ఓట‌రు జాబితాను చ‌దివి వినిపించ‌నున్న అధికారులు\u003C\u002Fp>\u003Cp>తెలంగాణలో నేటి నుంచే ఓటర్ల లెక్కలు మరోసారి తెరపైకి రాబోతున్నాయి. మ‌రికొద్ది గంట‌ల్లో ప్రత్యేక ఓటర్‌ సభలకు తెరలేవనుంది. గ్రామాల్లో గ్రామసభలు.. పట్టణాల్లో వార్డు సభలు.. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఓటర్ల జాబితాను ప్రజల ముందే చదివి వినిపించనున్నారు. పైకి చూస్తే ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియలా కనిపించొచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. ఇది అంతకంటే పెద్ద విషయం.\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే ఇప్పుడు చర్చ కేవలం నా పేరు ఓటర్ లిస్టులో ఉందా? అన్నదే కాదు. ఎవరి పేరు ఉంది? ఎవరి పేరు లేదు? ఎవరిని ఎందుకు గుర్తించారు? ఎవరిని ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలు కూడా రాజకీయంగా మారే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆగస్టు 17న తెలంగాణలో డ్రాఫ్ట్ ఓటర్ రోల్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునే కీలక దశ మొదలవుతోంది. ఇవాళ‌ జరిగే గ్రామ, వార్డు సభల్లో బూత్ లెవల్ అధికారులు డ్రాఫ్ట్ జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపిస్తారు. జాబితాలో లేని అర్హులైన వారి వివరాలను కూడా గుర్తించనున్నారు.\u003C\u002Fp>\u003Cp>అసలు పొలిటికల్ ట్విస్ట్ మొద‌లు...\u003C\u002Fp>\u003Cp>తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్‌లో జరిగే ప్రతి మార్పు పార్టీలకు కీలకమే. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు తగ్గినా.. మరికొన్ని వేల ఓట్లు కొత్తగా చేరినా.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండొచ్చు. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి కూడా బూత్‌ల వైపు మళ్లుతోంది.\u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఈ ఓటర్ లిస్ట్ సవరణ మరింత ఆసక్తికరంగా మారింది. “నో మ్యాపింగ్” కేటగిరీలో ఉన్న 5,80,908 మంది ఓటర్లతో పాటు స‌రైన డేటా లేని మరో 6,72,678 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12 లక్షలకు పైగా ఓటర్ల వ్యవహారం పరిశీలనలోకి రానుంది. ఇలాంటి కేసుల్లో సంబంధిత ఓటర్లు ఒరిజినల్ డాక్యుమెంట్లతో అధికారుల ముందు హాజరుకావాల్సిన పరిస్థితి కూడా ఉంది.\u003C\u002Fp>\u003Cp>హైద‌రాబాదే కీల‌కం...\u003C\u002Fp>\u003Cp>ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాల్లో మార్పులు, పరిశీలనలు జరిగితే.. నగరంలోని నియోజకవర్గాల ఓటర్ మ్యాథ్స్ ఎంతవరకు మారుతుంది? ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సవరణ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల లెక్కలు కూడా మారుతాయా? ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌రం. \u003C\u002Fp>\u003Cp>ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా ఓటర్ లిస్ట్‌లో చేరేందుకు అవకాశం ఉంది. అంటే ఈ ప్రక్రియ కేవలం ఉన్న ఓటర్ల పేర్లను పరిశీలించడం మాత్రమే కాదు.. కొత్త ఓటర్లను కూడా రాజకీయ వ్యవస్థలోకి తీసుకొచ్చే ప్రక్రియ.\u003C\u002Fp>\u003Cp>అంటే.. తెలంగాణలో 2028 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఓటర్ మ్యాథ్స్ మాత్రం ఇప్పటి నుంచే మొదలైనట్టే. కాంగ్రెస్‌కు అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి బూత్ కీలకం. బీఆర్ఎస్‌కు తిరిగి బలపడాలంటే తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలి. బీజేపీకి అయితే తెలంగాణలో తన బేస్‌ను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడు పార్టీల రాజకీయ పోరులో.. చివరికి బూత్ దగ్గర పడే ఒక్కో ఓటే కీలకం.\u003C\u002Fp>\u003Cp>అందుకే ఆగస్టు 27 కేవలం మరో తేదీ కాదు. నేటి నుంచే తెలంగాణలో ఓటు లెక్క మళ్లీ మొదలవుతోంది. గ్రామ సభలో చదివే ఒక్కో పేరు.. వార్డు సభలో కనిపించే ఒక్కో ఓటు.. భవిష్యత్ రాజకీయ లెక్కల్లో ఒక్కో సంఖ్యగా మారబోతోంది. ఇప్పటి వరకు నాయకులు సభల్లో మాట్లాడారు. ఇక నుంచి ఓటర్ల జాబితానే మాట్లాడబోతోంది.\u003C\u002Fp>\u003Cp>మరి ఈ కొత్త ఓటర్ లెక్కలు ఎవరికి కలిసొస్తాయి? ఎవరికి షాక్ ఇస్తాయి? ఎవరి ఓటు బ్యాంకు బలపడుతుంది? ఎవరి రాజకీయ మ్యాథ్స్ మారుతుంది? అసలు తెలంగాణ రాజకీయాల నెక్స్ట్ గేమ్.. అనేది నేటి నుంచే మొదలవుతోంది.\u003C\u002Fp>",[37],{"url":13,"name":38},"telangana_voter_political_1mb.jpg",[],{"title":41,"description":42},"Telangana Voter Roll Update: Political Game Starts Today","Telangana begins voter roll verification today. With Congress, BRS and BJP watching closely, every voter could reshape the state's political calculations.",[44,53,60,65,71,77,82,87,93,99],{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row","Ramchander Rao: 22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-రాంచందర్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1172b1e9-aa74-419c-9a08-fe5d9fd77106.jpg","NK","3 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",55,{"slug":54,"title":55,"category":47,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":34},"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","4 నిమిషాల పఠనం","5 గంటలు క్రితం",{"slug":61,"title":62,"category":47,"image":63,"author":49,"read_time":64,"published_at":59,"public_read_count":52},"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","5 నిమిషాల పఠనం",{"slug":66,"title":67,"category":47,"image":68,"author":57,"read_time":32,"published_at":69,"public_read_count":70},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","6 గంటలు క్రితం",361,{"slug":72,"title":73,"category":47,"image":74,"author":49,"read_time":75,"published_at":76,"public_read_count":52},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం","7 గంటలు క్రితం",{"slug":78,"title":79,"category":47,"image":80,"author":49,"read_time":81,"published_at":76,"public_read_count":52},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":57,"read_time":64,"published_at":76,"public_read_count":52},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":92,"read_time":50,"published_at":76,"public_read_count":34},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu",{"slug":94,"title":95,"category":90,"image":96,"author":92,"read_time":58,"published_at":97,"public_read_count":98},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","8 గంటలు క్రితం",208,{"slug":100,"title":101,"category":47,"image":102,"author":49,"read_time":64,"published_at":103,"public_read_count":34},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","9 గంటలు క్రితం",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]