[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nepal-changes-its-stance-within-24-hours-declining-the-aid":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":104},4401,1368,"nepal-changes-its-stance-within-24-hours-declining-the-aid","NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!","భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన దౌత్య ఒత్తిడి కారణంగా తన వైఖరిని సవరించుకుంది. భోటేకోశీ పరివాహక ప్రాంతాల్లో వందలాది మంది విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో, సాంకేతిక, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల బృందాలను మాత్రమే తమ దేశంలోకి అనుమతించేందుకు నేపాల్ సర్కార్ సానుకూలంగా స్పందించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd127c82a-5cdc-4764-8bb2-d95df3ea6cb7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd127c82a-5cdc-4764-8bb2-d95df3ea6cb7.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25,26],"NepalFloods","NepalDisaster2026","TunnelRescue","NDRF","Jaishankar","ForeignAid","NepalNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-29T03:28:50+00:00","2026-08-29T03:31:16+00:00",106,"\u003Cp>\u003Cspan>భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన దౌత్య ఒత్తిడి కారణంగా తన వైఖరిని సవరించుకుంది. భోటేకోశీ పరివాహక ప్రాంతాల్లో వందలాది మంది విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో, సాంకేతిక, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల బృందాలను మాత్రమే తమ దేశంలోకి అనుమతించేందుకు నేపాల్ సర్కార్ సానుకూలంగా స్పందించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తాజా నివేదికల ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 550కి చేరగా, మరో 1,924 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. ఇందులో 288 మంది భారతీయులతో పాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా పౌరులు ఉన్నారు. ముఖ్యంగా 216 మెగావాట్ల అప్పర్ త్రిశూలి-1 జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద టన్నెళ్లలో సుమారు 576మంది కార్మికులు చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. వరదల ధాటికి రహదారులు ధ్వంసమై, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ సాధారణ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ అత్యవసర పరిస్థితుల్లో టన్నెల్ రెస్క్యూ, ఫోరెన్సిక్ తనిఖీలు, డీఎన్‌ఏ (DNA) పరీక్షల నిర్వహణ కోసం సాంకేతిక సాయం కోరుతున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ వెల్లడించారు. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన రెస్క్యూ నిపుణుల బృందాలకు నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ప్రధానంగా రాసువా, నువాకోట్ జిల్లాల్లోని ప్రాజెక్టు సొరంగాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఈ బృందాలు పనిచేయనున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మరోవైపు, భారత్ వెంటనే స్పందించి సహాయ హస్తాన్ని అందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నేపాల్‌తో సంప్రదింపులు జరిపి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. 10టన్నుల అత్యవసర మానవతా సాయం, వైద్యులు, టన్నెల్ రెస్క్యూ స్పెషలిస్టులతో కూడిన 11మంది సభ్యుల ప్రత్యేక బృందం ఇప్పటికే ఖాట్మండుకు చేరుకుంది. మృతదేహాలను వేగంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణుల సేవలను నేపాల్ వినియోగించుకోనుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Screenshot 2026-08-29 085729.jpg",[],{"title":37,"description":38},"సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!","భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం..",[40,49,56,63,70,76,80,88,96,100],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"sensational-developments-in-the-sumanth-case-several-doubts-raised-about-the-polices-conduct","సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2d99b42d-a3c0-49fe-849d-a9862e95c198.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","4 నిమిషాలు క్రితం",1,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":27,"published_at":55,"public_read_count":48},"nayanthara-toxic-hai","Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faf2ea8cc-7173-4c75-b634-05e8521bd53d.webp","Anshu","20 నిమిషాలు క్రితం",{"slug":57,"title":58,"category":43,"image":59,"author":45,"read_time":60,"published_at":61,"public_read_count":62},"rayadurgam-auctions-is-the-real-estate-surge-an-illusion","RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fdc47161b-5c32-4786-ba5c-f0830d26afce.jpg","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":27,"published_at":61,"public_read_count":69},"suicide-sensation-in-visakhapatnam-four-members-of-the-same-family-die-by-suicide","Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F027e6c68-e564-4d7b-9a67-8cd7d450439b.jpg","Venu",55,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":68,"read_time":46,"published_at":75,"public_read_count":69},"spirituality-is-this-visible-world-real-or-an-illusion","Spirituality: కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F636652ae-6261-4af4-b11b-adfb1ce46324.jpg","2 గంటలు క్రితం",{"slug":77,"title":78,"category":73,"image":79,"author":68,"read_time":46,"published_at":75,"public_read_count":62},"spirituality-what-does-the-philosophy-of-lord-parameshwara-teach-humanity","Spirituality: పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F871de172-32cd-4ce1-8c89-eddff657ed36.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":85,"read_time":60,"published_at":86,"public_read_count":87},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","10 గంటలు క్రితం",310,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":85,"read_time":93,"published_at":94,"public_read_count":95},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం","11 గంటలు క్రితం",361,{"slug":97,"title":98,"category":52,"image":99,"author":54,"read_time":27,"published_at":94,"public_read_count":30},"shiva-nirvana-3-heros","Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg",{"slug":101,"title":102,"category":52,"image":103,"author":54,"read_time":27,"published_at":94,"public_read_count":69},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]