[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-national-crush-bids-farewell-to-the-army-retires-from-service-after-12-years":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":82},4645,1487,"national-crush-bids-farewell-to-the-army-retires-from-service-after-12-years","ఆర్మీకి 'నేషనల్ క్రష్' గుడ్ బై.. 12ఏళ్లకే విధుల నుంచి విరమణ!","రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ఏడీసీగా (ఎయిడ్-డి-క్యాంప్) వ్యవహరిస్తూ, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా విశేష ప్రజాదరణ పొందిన 4 పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి మేజర్ రిషభ్ సింగ్ శాంబ్యాల్ భారత సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దాదాపు 12ఏళ్ల పాటు సైన్యంతో అనుబంధం కలిగి ఉన్న ఆయన, ఇటీవల తన విధుల నుంచి వైదొలిగారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F237f4461-ea59-4e57-bf0d-0d37c740193e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F237f4461-ea59-4e57-bf0d-0d37c740193e.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"MajorRishabhSingh","IndianArmy","NationalCrush","DroupadiMurmu","IndianArmyNews","NationalNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T09:21:49+00:00","2026-08-31T09:22:11+00:00",310,"\u003Cp>\u003Cspan>&nbsp;రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ఏడీసీగా (ఎయిడ్-డి-క్యాంప్) వ్యవహరిస్తూ, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా విశేష ప్రజాదరణ పొందిన 4 పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి మేజర్ రిషభ్ సింగ్ శాంబ్యాల్ భారత సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దాదాపు 12ఏళ్ల పాటు సైన్యంతో అనుబంధం కలిగి ఉన్న ఆయన, ఇటీవల తన విధుల నుంచి వైదొలిగారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సందర్భంగా ఆగస్టు 21న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి, ఆమె చూపిన ఆదరణకు, మార్గదర్శకత్వానికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన డోగ్రా రాజ్‌పుత్ సైనిక కుటుంబంలో జన్మించిన రిషభ్ సింగ్, 2013లో ఎన్‌డీఏ (NDA) పూర్తి చేసుకుని ఆర్మీలో చేరారు. 2021లో క్యాప్టెన్‌గా ఉన్నప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో జట్ రెజిమెంట్ కంటింజెంట్‌కు నాయకత్వం వహించి 'బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని గెలుచుకుని వెలుగులోకి వచ్చారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఆ తర్వాత సైన్యంలో అత్యంత కఠినమైన '4 పారా స్పెషల్ ఫోర్సెస్' (పారా కమాండో)కు ఎంపికై, అత్యంత అరుదైన 'బలిదాన్ బ్యాడ్జ్' సాధించారు. అనంతరం 2023లో భారత రాష్ట్రపతికి ఏడీసీగా నియమితులై ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్రపతి భవన్‌లో విధి నిర్వహణలో భాగంగా వర్షంలో రాష్ట్రపతికి గొడుగు పట్టడం, వేడుకల్లో ఆమెకు సాయపడటం వంటి ఆయన క్రమశిక్షణ, హుందాతనం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;దీంతో ఆయన వీడియోలు వైరల్ అయి, సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా పేరు తెచ్చుకున్నారు. సైన్యం నుంచి తప్పుకోవడంపై ఆయన స్పందిస్తూ.. \"యూనిఫాం వేసుకోవడమే నా చిన్ననాటి కల, కానీ కొన్ని వ్యక్తిగత, కుటుంబ పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది\" అని తెలిపారు. అలాగే పెళ్లి కోసమే రిటైర్మెంట్ తీసుకున్నారనే వార్తలను ఖండిస్తూ, ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని, త్వరలోనే తన తదుపరి ప్రయాణాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-31 145049.jpg",[],{"title":11,"description":36},"రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ఏడీసీగా (ఎయిడ్-డి-క్యాంప్) వ్యవహరిస్తూ, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా విశేష ప్రజాదరణ పొందిన 4 పారా స్పెషల్ ఫోర్స",[38,45,54,60,66,71,76],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"unexpected-results-in-ten-years-india-will-be-free-of-that-disease-by-2030","పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a89910e-e3e6-4a4b-95f1-6640bda9e6cf.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T10:01:49+00:00",157,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"minister-konda-surekhas-name-and-photo-missing-on-flexis","Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6701c3a5-0df0-4ab3-9ceb-e19165b059bd.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-08-31T10:24:26+00:00",55,{"slug":55,"title":56,"category":48,"image":57,"author":58,"read_time":26,"published_at":59,"public_read_count":44},"union-minister-performs-special-prayers-at-alampur","TG : ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8341cab0-111d-4ec2-a219-a62dc0f04776.jpg","Kumar","2026-08-31T09:16:44+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":58,"read_time":26,"published_at":65,"public_read_count":44},"another-nirbhaya-style-incident-in-delhi-minor-gang-raped-in-a-moving-bus","Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07be7ad9-7633-4b6a-af0f-22b936961e13.jpg","2026-08-31T08:55:17+00:00",{"slug":67,"title":68,"category":48,"image":69,"author":15,"read_time":26,"published_at":70,"public_read_count":44},"ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments","‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","2026-08-31T08:52:33+00:00",{"slug":72,"title":73,"category":48,"image":74,"author":58,"read_time":26,"published_at":75,"public_read_count":44},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","2026-08-31T08:36:48+00:00",{"slug":77,"title":78,"category":63,"image":79,"author":15,"read_time":26,"published_at":80,"public_read_count":81},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","2026-08-31T08:29:14+00:00",106,[83,88,91,93,95,97],{"title":84,"sponsor":85,"image":86,"url":87},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":89,"sponsor":90,"image":86,"url":87},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":92,"sponsor":90,"image":86,"url":87},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":94,"sponsor":90,"image":86,"url":87},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":96,"sponsor":90,"image":86,"url":87},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":98,"sponsor":90,"image":86,"url":87},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]