[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-nakrekal-tension-amidst-cm-visit-former-mla-placed-under-house-arrest-in-nakrekal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":86},5111,1712,"nakrekal-tension-amidst-cm-visit-former-mla-placed-under-house-arrest-in-nakrekal","Nakrekal: సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..","నకిరేకల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తన నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వడం లేదని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఈ నియోజక వర్గంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc33e1c8a-47e2-4bd8-b2d1-b6f7bfd2f429.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc33e1c8a-47e2-4bd8-b2d1-b6f7bfd2f429.webp","Venu","telangana","routine",[19,20,21,22,23,24],"nalgonda","Nakrekal","former-mla","chirumarthi-lingaiah","house-arrest","revanth reddy","4 నిమిషాల పఠనం","2026-09-05T09:42:49+00:00","2026-09-05T09:43:44+00:00",55,"\u003Cp>సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నకిరేకల్‌లో.. పొలిటికల్ హీట్ పెరిగినంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు.. \u003C\u002Fp>\u003Cp>ఇసుక, మట్టి మాఫియాతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులను మాత్రమే ప్రారంభిస్తున్నారని, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా... నియోజకవర్గంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. నకిరేకల్‌లో రోడ్లు, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని మండిపడ్డారు.. \u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని... అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కృష్ణా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించకుండా... ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే... రైతులతో కలిసి సాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>ఇక గతంలోనూ నకిరేకల్‌లో సాగునీరు, రోడ్లు, అభివృద్ధి పనులు, రైతుల సమస్యలు ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఇప్పుడు సీఎం పర్యటన సమయంలోనే ఈ అంశాలను మరోసారి తెరపైకి తీసుకురావడంతో.. నకిరేకల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తన నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వడం లేదని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఈ నియోజక వర్గంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు.\u003C\u002Fp>\u003Cp>ఈ పరిణామాల నేపథ్యంలో నకిరేకల్‌లో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష నేతలకు మధ్య రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. సీఎం పర్యటనతో అభివృద్ధిపై చర్చ జరగాల్సిన సమయంలో... హౌస్ అరెస్ట్, ఆరోపణలు, కృష్ణా జలాల డిమాండ్‌తో ఒక్క సారిగా రాజకీయం హిటేక్కింది. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"596787-25.webp",[],{"title":35,"description":36},"సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే","నకిరేకల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తన నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వడం లేదని చిరుమర్తి లింగయ్య మండిపడ్డ",[38,45,52,60,67,73,79],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":28},"tpcc-chief-mahesh-kumar-goud-key-comments-on-cabinet-expansion","తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff72c5fd4-9c0f-4154-bd36-4e23fba7a109.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-05T10:10:44+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":25,"published_at":50,"public_read_count":51},"who-are-the-candidates-for-mlc-posts-under-governor-quota-in-telangana-tags","TG: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14b4e6e-049a-4fbb-b297-a5106e8eb589.jpg","Mahesh","2026-09-05T10:58:56+00:00",2,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"give-me-two-years-then-you-yourselves-grade-my-performance-cm-revanth","TG : రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b8c9d39-05ff-44c1-bdce-6717047a68b9.jpg","Kumar","8 నిమిషాల పఠనం","2026-09-05T09:21:25+00:00",259,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":49,"read_time":64,"published_at":65,"public_read_count":66},"bjp-candidates-shock-graduate-mlc-ramchander-rao-contest","Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7caf419f-882f-4d67-89d8-e33c48365f8a.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T09:10:17+00:00",106,{"slug":68,"title":69,"category":16,"image":70,"author":56,"read_time":25,"published_at":71,"public_read_count":72},"beware-if-cases-are-filed-against-polytechnic-students-harish-rao","BRS : పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7689e20e-8a7b-4abb-8ec4-013188faf6b2.jpg","2026-09-05T09:02:58+00:00",157,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":56,"read_time":25,"published_at":78,"public_read_count":72},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","2026-09-05T08:38:50+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":84,"read_time":25,"published_at":85,"public_read_count":66},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","Anshu","2026-09-05T08:36:44+00:00",[87,92,95,97,99,101],{"title":88,"sponsor":89,"image":90,"url":91},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":93,"sponsor":94,"image":90,"url":91},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":96,"sponsor":94,"image":90,"url":91},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":98,"sponsor":94,"image":90,"url":91},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":100,"sponsor":94,"image":90,"url":91},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":102,"sponsor":94,"image":90,"url":91},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]