[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-movie-intervals-technical-problem-to-multi-crore-business-story":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},5996,2146,"movie-intervals-technical-problem-to-multi-crore-business-story","Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!","Movie Intervals: వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగే క్షణంలో ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. హీరో ఇచ్చిన పవర్‌ఫుల్ వార్నింగ్ లేదా ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసి, సెకండ్ హాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయడానికే డైరెక్టర్ ఈ బ్రేక్‌ను ప్లాన్ చేశారని చాలా నమ్ముతారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23],"Movie Intervals","Cinema Intervals","Film History","Indian Cinema","swechaa news","5 నిమిషాల పఠనం","2026-09-13T10:29:56+00:00","2026-09-13T10:30:59+00:00",106,"\u003Cp>Movie Intervals : వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగే క్షణంలో ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. హీరో ఇచ్చిన పవర్‌ఫుల్ వార్నింగ్ లేదా ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసి, సెకండ్ హాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయడానికే డైరెక్టర్ ఈ బ్రేక్‌ను ప్లాన్ చేశారని చాలా నమ్ముతారు. నిజానికి ఈ సినిమా ‘ఇంటర్వెల్ బ్యాంగ్’ అనేది డైరెక్టర్ల ఆలోచనల నుంచో, కథలోని సస్పెన్స్ కోసమో పుట్టనేలేదని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి తెర వెనుక నడిచిన సాంకేతిక అవస్థలను కప్పిపుచ్చుకోవడానికి మొదలైన ఒక విధిలేని సర్దుబాటే ఈ ‘ఇంటర్వెల్’.\u003C\u002Fp>\u003Cp>ఒకప్పుడు ఇప్పటిలాగా శాటిలైట్ ఫీడ్‌లు, డిజిటల్ ప్రొజెక్షన్లు, క్యూబ్ టెక్నాలజీలు లేవు. భారీ ఫిలిం రీళ్లను ప్రొజెక్టర్లలో తిప్పుతూ సినిమాను నడిపించేవారు. కొన్ని టెంట్ హాల్స్‌లో ఒకే ప్రొజెక్టర్ ఉండటం వల్ల ఒక రీల్ పూర్తయ్యాక రెండోది ఎక్కించడానికి తప్పనిసరిగా సమయం పట్టేది. పెద్ద థియేటర్లలో డ్యూయల్ ప్రొజెక్టర్లు ఉన్నప్పటికీ, అప్పట్లో సినిమాలు దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల సుదీర్ఘ నిడివితో ఉండేవి. అంతసేపు ప్రొజెక్టర్‌ను నిరంతరాయంగా నడపడం, భారీ రీళ్ల మార్పిడిని సమన్వయం చేసుకోవడం థియేటర్ ఆపరేటర్లకు పెద్ద సవాలుగా మారేది. ఆ రీల్ మార్పిడి వ్యవధిలో తెర చీకటిగా మారితే ప్రేక్షకులు అసహనానికి గురవుతారని, దానికి ‘ఇంటర్వెల్’ అనే ముసుగు వేసి 10 నుంచి 15 నిమిషాల విరామం ఇవ్వడం స్టార్ట్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>రోజులు మారాయి. భారీ రీళ్ల స్థానంలోకి డిజిటల్ హార్డ్ డిస్క్‌లు, క్యూబ్ శాటిలైట్ సిస్టమ్స్ వచ్చేశాయి. ఇప్పుడు రీళ్లు మార్చే పనే లేదు.. ఒక్క బటన్ నొక్కితే గంటల తరబడి సినిమా ఆగకుండా ప్లే అవుతోంది. అందుకే హాలీవుడ్ సహా చాలా దేశాలన్నీ ఈ ఇంటర్వెల్ సంప్రదాయానికి ఎప్పుడో స్వస్తి పలికాయి. అక్కడ సినిమా మొదలైతే ఎండ్ కార్డ్ పడేవరకు నాన్‌స్టాప్‌గా చూడాల్సిందే.\u003C\u002Fp>\u003Cp>కానీ భారతీయ చిత్రసీమలో మాత్రం ఆ సాంకేతిక అవసరం తీరిపోయినా.. ఈ ఇంటర్వెల్ బ్రేక్ అనేది ఒక సెంటిమెంట్‌గా, విడదీయరాని వ్యాపార సూత్రంగా మారిపోయింది. సమోసాలు, కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ అమ్మకాలతో థియేటర్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురిపించే అతిపెద్ద మార్కెట్ వ్యూహంగా ఇది అవతరించింది. దానికితోడు మన డైరెక్టర్లు కథలు రాసుకునేటప్పుడే సరిగ్గా 90వ నిమిషం వద్ద ఒక 'మైండ్ బ్లోయింగ్ బ్యాంగ్' ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకప్పుడు ప్రొజెక్టర్ తిప్పలు దాచడానికి పెట్టిన ఈ తాత్కాలిక బ్రేక్.. ఇప్పుడు ఏకంగా భారతీయ సినిమా స్క్రీన్‌ప్లేను, కోట్ల వ్యాపారాన్ని శాసించే స్థాయికి ఎదగడం నిజంగా వెండితెర విచిత్రం.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-12 at 4.10.57 PM.jpeg",[],{"title":34,"description":35},"Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర","Movie Intervals: వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగే క్షణంలో ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. హీరో ఇచ్చిన పవర్‌ఫుల్ వార్నింగ్ లే",[37,46,52,59,65,71,78,85,91,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"odisha","Odisha: ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe22e632c-1c95-4fc3-9190-c0a6ad65e551.jpg","Venu","4 నిమిషాల పఠనం","2026-09-13T11:22:27+00:00",55,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":43,"published_at":51,"public_read_count":45},"aishwarya-lekshmi-spirit","Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb400fbbe-28e5-4ece-9a62-12172f0dfd71.webp","Anshu","2026-09-13T11:35:51+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":58},"pm-modi-brics-countries-should-set-global-rules-comments","PM Modi: బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fefd4fd8e-bbc4-4f7e-bf9d-0a882fbfe8be.jpg","2026-09-13T11:55:17+00:00",2,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":50,"read_time":43,"published_at":63,"public_read_count":64},"ntr-dragon-prashanth-neel","NTR-Dragon: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe74cf6d7-21dc-452b-a6c5-f4724d8567ef.jpg","2026-09-13T11:57:18+00:00",4,{"slug":66,"title":67,"category":40,"image":68,"author":42,"read_time":43,"published_at":69,"public_read_count":70},"madhya-pradesh-i-am-resigning-from-the-cm-post-abhijeet-dipke-sensational-post","Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca75c0f5-0630-4143-a8db-5ccf5bd04dfa.jpg","2026-09-13T11:59:32+00:00",1,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":76,"read_time":43,"published_at":77,"public_read_count":27},"singareni-coal-heavy-rains-coal-production-halted-in-singareni-mines","SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca6300da-9673-4a33-a0b6-e135fd75f1a7.jpg","Mamatha puppala","2026-09-13T09:40:57+00:00",{"slug":79,"title":80,"category":74,"image":81,"author":82,"read_time":43,"published_at":83,"public_read_count":84},"i-was-the-first-to-support-revanth-but-konda-surekha","Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","Kumar","2026-09-13T09:39:20+00:00",463,{"slug":86,"title":87,"category":74,"image":88,"author":15,"read_time":89,"published_at":90,"public_read_count":45},"medak-bjp-internal-rift-raghunandan-rao-anjireddy-tussle","Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fee79dd83-b27e-4a4a-944d-0954544218e5.jpg","6 నిమిషాల పఠనం","2026-09-13T09:32:47+00:00",{"slug":92,"title":93,"category":74,"image":94,"author":76,"read_time":43,"published_at":95,"public_read_count":96},"komatis-always-have-at-least-an-egg-sized-piece-of-gold-cm-revanth-reddy","కోమట్ల వద్ద కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc7fac5ce-0889-4973-99b9-cdf95ad31362.png","2026-09-13T09:24:12+00:00",412,{"slug":98,"title":99,"category":74,"image":100,"author":76,"read_time":43,"published_at":101,"public_read_count":102},"ghmc-workers-held-captive-at-lb-stadium-distressed-over-lack-of-food-and-water","ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4142622b-0a90-4129-9742-ac8619fdfb98.png","2026-09-13T08:48:55+00:00",310,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]