[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":97},5600,1953,"mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery","ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. రేవంత్ సర్కార్‌కు కీలక విన్నపం","MLC Vijayashanthi: హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో మాట్లాడిన ఆమె.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు. జ్వరం వస్తే టెస్టులు, చికిత్స పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"MLC Vijayashanthi","Telangana","Congress","Hyderabad","Private Hospitals","Swechaa News","Cm Revanth Reddy","5 నిమిషాల పఠనం","2026-09-09T16:19:56+00:00","2026-09-09T17:05:29+00:00",4,"\u003Cp>MLC Vijayashanthi: హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో మాట్లాడిన ఆమె.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు. జ్వరం వస్తే టెస్టులు, చికిత్స పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుల దందాపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి కోరారు.\u003C\u002Fp>\u003Cp>''కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్ తో ప్రజలు బాధ పడుతున్నారు. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో సఫర్ అవుతున్నారు. ప్రజలు తమకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కో, తెలిసిన డాక్టర్ దగ్గరికో వెళ్తారు. వారు జ్వరం తగ్గే మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. అయితే, రెండు మూడు రోజులు మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గడం లేదు. జ్వరం తగ్గకపోయే సరికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>ప్రైవేట్ ఆసుపత్రిలోకి అడుగు పెట్టగానే ప్రజల నుంచి డబ్బు గుంజేందుకు అన్ని టెస్టులు చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కాన్, ఎక్స్ రే.. ఇలా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. జ్వరం వచ్చిన వారిని మరింత భయపెడుతున్నారు. వారి నుంచి 15వేలు, 20వేలు 30వేలు గుంజుతున్నారు. ఇక మందులు రాయడానికి డాక్టర్ ఫీజు రూ.1000 నుంచి రూ.1500. ఇది మామూలు జ్వరానికి. \u003C\u002Fp>\u003Cp>ఇక ఎమర్జెన్సీ కేసు అంటే యాక్సిడెంట్, కిడ్నీ సమస్య, గుండెపోటు.. ఇలాంటి సమస్యలతో ఆసుపత్రికి వెళితే లక్షల్లో వసూలు చేస్తారు. ఈ గుంజుడు కార్యక్రమం ఏంటో అర్థం కావడం లేదు. ఆసుపత్రులు అంటే ప్రజల దగ్గర డబ్బు గుంజడానికే ఉన్నాయా? అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకే రకమైన రేట్లు ఉండాలి, అవీ రీజనబుల్ ఉండాలి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ అమలు కావడం లేదు. \u003C\u002Fp>\u003Cp>సుప్రీంకోర్టు చెప్పినా, స్టేట్ గవర్న్ మెంట్ యాక్ట్ తెచ్చినా.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఆగడం లేదు. వైద్యం వ్యాపారంగా మారిపోయింది. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్స్ లైన్స్ మన దగ్గర కూడా అమలయ్యేలా మన ప్రభుత్వం చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దోపిడీకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు ఫీజు తీసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు కూడా. కానీ దోపిడీ చేయొద్దు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టాలి'' అని విజయశాంతి కోరారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"MLC Vijayashanthi.jpg",[],{"title":36,"description":37},"ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. రేవంత్ సర్కార్","MLC Vijayashanthi: హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో మాట్లాడిన ఆమె.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్",[39,47,54,61,68,73,78,86,92],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"tg-konda-surekha-former-osd-sumanth-granted-anticipatory-bail","TG :  కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd31bacf4-c83a-4414-ab27-186375aac406.jpg","Mahesh","4 నిమిషాల పఠనం","2026-09-09T16:21:32+00:00",106,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":43,"read_time":44,"published_at":52,"public_read_count":53},"petrol-diesel-price-hormuz-tensions-crude-oil-price-shock","Petrol-Diesel Price : హార్ముజ్‌లో మళ్లీ టెన్షన్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f3d55f2-f6b2-4e0d-b2da-bce11915686d.jpg","2026-09-09T16:53:57+00:00",157,{"slug":55,"title":56,"category":50,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":46},"ai-powerd-aadhar","ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff41994e7-41e8-4fb1-9c94-08a864553cb0.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-09T17:32:14+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":58,"read_time":66,"published_at":67,"public_read_count":53},"gold-vs-copper","బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F629079b9-deab-4662-a29c-2f2abca1eb07.jpg","7 నిమిషాల పఠనం","2026-09-09T17:57:54+00:00",{"slug":69,"title":70,"category":50,"image":71,"author":43,"read_time":26,"published_at":72,"public_read_count":53},"pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules","PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","2026-09-09T15:43:35+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":43,"read_time":26,"published_at":77,"public_read_count":46},"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","2026-09-09T15:07:21+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":44,"published_at":84,"public_read_count":85},"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","Anshu","2026-09-09T14:26:38+00:00",412,{"slug":87,"title":88,"category":16,"image":89,"author":15,"read_time":90,"published_at":91,"public_read_count":29},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":43,"read_time":44,"published_at":96,"public_read_count":46},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]