[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},4639,1484,"ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments","‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!","తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కరువైందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అధికారాలు, బాధ్యతలతో స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"KunamneniSambasivam","RevanthReddy","CPIKunamneni","TelanganaPolitics","CongressGovtTelangana","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T08:52:33+00:00","2026-08-31T08:55:33+00:00",157,"\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. \u003C\u002Fspan>హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. \u003Cspan>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కరువైందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అధికారాలు, బాధ్యతలతో స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. క్యాబినెట్ సహచరులకు తగిన స్వేచ్ఛ నివ్వకపోతే భవిష్యత్తులో కొత్త సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కూనంనేని స్పందించారు. రాజకీయ క్షేత్రంలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై విమర్శలు చేయడం సహజమేనని, అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. నాయకులు విమర్శలు చేసేటప్పుడు వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి కేవలం ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే మాట్లాడాలని ఆయన హితవు పలికారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన భూ సమస్యలపై కూడా కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల దాదాపు కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో (22A) చిక్కుకుపోవడంతో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఈ వివాదాస్పద భూముల సమస్య పరిష్కారంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;లక్షలాది మంది రైతులకు సంబంధించిన ఈ భూ వివాదాల తీవ్రతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు వెంటనే విముక్తి కల్పించి, సమగ్రమైన పరిష్కారం చూపడంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా చర్యలు తీసుకోవాలని కూనంనేని స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-31 142139.jpg",[],{"title":35,"description":36},"‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు’: కూనంనేని","తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. .",[38,45,50,57,63,71,76,82,89,94],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":28},"another-nirbhaya-style-incident-in-delhi-minor-gang-raped-in-a-moving-bus","Crime : ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07be7ad9-7633-4b6a-af0f-22b936961e13.jpg","Kumar","2026-08-31T08:55:17+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":43,"read_time":25,"published_at":49,"public_read_count":28},"union-minister-performs-special-prayers-at-alampur","TG : ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8341cab0-111d-4ec2-a219-a62dc0f04776.jpg","2026-08-31T09:16:44+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":15,"read_time":25,"published_at":55,"public_read_count":56},"national-crush-bids-farewell-to-the-army-retires-from-service-after-12-years","ఆర్మీకి 'నేషనల్ క్రష్' గుడ్ బై.. 12ఏళ్లకే విధుల నుంచి విరమణ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F237f4461-ea59-4e57-bf0d-0d37c740193e.jpg","2026-08-31T09:21:49+00:00",310,{"slug":58,"title":59,"category":53,"image":60,"author":15,"read_time":61,"published_at":62,"public_read_count":28},"unexpected-results-in-ten-years-india-will-be-free-of-that-disease-by-2030","పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a89910e-e3e6-4a4b-95f1-6640bda9e6cf.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T10:01:49+00:00",{"slug":64,"title":65,"category":16,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":70},"minister-konda-surekhas-name-and-photo-missing-on-flexis","Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6701c3a5-0df0-4ab3-9ceb-e19165b059bd.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-08-31T10:24:26+00:00",55,{"slug":72,"title":73,"category":16,"image":74,"author":43,"read_time":25,"published_at":75,"public_read_count":28},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","2026-08-31T08:36:48+00:00",{"slug":77,"title":78,"category":41,"image":79,"author":15,"read_time":25,"published_at":80,"public_read_count":81},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","2026-08-31T08:29:14+00:00",106,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":87,"read_time":25,"published_at":88,"public_read_count":28},"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","2026-08-31T08:19:46+00:00",{"slug":90,"title":91,"category":16,"image":92,"author":43,"read_time":61,"published_at":93,"public_read_count":81},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","2026-08-31T08:19:45+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":68,"published_at":99,"public_read_count":81},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","2026-08-31T07:52:04+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]