[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-minister-tummala-nageswara-rao-focus-on-state-level-seed-act-draft":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":102},4457,1395,"minister-tummala-nageswara-rao-focus-on-state-level-seed-act-draft","Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం","తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa34e3eec-13b3-452c-8545-09e696cefdb9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa34e3eec-13b3-452c-8545-09e696cefdb9.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Tummala Nageswara Rao","Telangana","Telangana Seed Draft","Seed Act Draft","Farmers","Swechaa News","Draft Seed Bill 2025","10 నిమిషాల పఠనం","2026-08-29T12:22:46+00:00","2026-08-29T12:23:45+00:00",55,"\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* కేంద్రం చట్టం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* రాష్ట్రంలో కొత్త విత్తన చట్టంపై ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* డ్రాఫ్ట్ విత్తన చట్టం-2025పై మంత్రి తుమ్మల సమీక్ష\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల ఆధారంగా ఇప్పటికే సమగ్ర చట్టం రూపకల్పన\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* కేంద్ర ప్రభుత్వానికి డ్రాఫ్ట్ బిల్లు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టం అమలులో తీవ్ర జాప్యం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* నకిలీ, నాసిరకం విత్తనాలతో నష్టపోయే రైతులకు పరిహారం అందేలా వచ్చే పంట కాలం నుండి చట్టబద్ధమైన వ్యవస్థ\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>* విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయం, నాణ్యమైన విత్తనాల సరఫరాకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>Tummala Nageswara Rao: తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన చట్టం-2025పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, విక్రయాలు, ధరల నియంత్రణతో పాటు విత్తన ఉత్పత్తి రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీ రైతులు, విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు, డీలర్లు, పంపిణీదారులు, వ్యవసాయ అధికారులు తదితర వర్గాలతో సంప్రదింపులు నిర్వహించి, విత్తన రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసిందన్నారు. \u003C\u002Fp>\u003Cp>రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సూచనల మేరకు విత్తన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2025 పేరుతో ముసాయిదా బిల్లును రూపొందించిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ, కొన్ని అంశాలను సమ్మతించడంతో పాటు, మరికొన్ని అంశాలపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>నెలలు గడిచినా కేంద్రం నుంచి ముందడుగు లేదు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తన అభిప్రాయాలను, సూచనలను పంపి నెలలు గడిచినా విత్తన చట్టం విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విత్తన చట్టాన్ని త్వరగా తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందని తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం విషయంలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక పంటకాలం గడిచిపోయిందని, రైతుల ప్రయోజనాల కోసం ఇకపై మరింత జాప్యం చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా చర్యలు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>వచ్చే పంట కాలానికైనా విత్తన చట్టం అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనలు, రైతుల ప్రయోజనాలు, విత్తన రంగంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విత్తన చట్టం రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ దేశంలోనే ప్రముఖ విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన నేపథ్యంలో విత్తన రంగానికి సమగ్ర చట్టపరమైన వ్యవస్థ ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ముందుకు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి చట్టం తీసుకొచ్చినట్లయితే దానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చర్యలు చేపడతామని, ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి లభించని పక్షంలో కూడా రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విత్తన బిల్లును రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ్యుల ఆమోదంతో రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>విత్తన రైతులకు చట్టపరమైన రక్షణ\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>విత్తన ఉత్పత్తి రైతులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. రైతు-విత్తన కంపెనీ మధ్య నేరుగా పారదర్శక ఒప్పంద వ్యవస్థ ఉండేలా చూడాలని, మధ్యవర్తుల పాత్రను నియంత్రించాలని సూచించారు. విత్తన ఉత్పత్తికి రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంట బీమా, నాణ్యత లేని విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>నకిలీ విత్తనాలపై కఠిన నియంత్రణ\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>నకిలీ, నాసిరకం, అనధికార విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కఠినమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. విత్తన ఉత్పత్తి ప్రాంతాలను క్రాప్ బుకింగ్, సీడ్ ట్రేసబులిటీ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. మండల స్థాయిలో సీడ్ బ్యాంకులు, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులను ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ, దేశీయ విత్తన రకాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>పంట నష్టపోయిన రైతులకు సత్వర పరిహారం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>నకిలీ, నాసిరకం లేదా నాణ్యత లేని విత్తనాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సత్వరం పరిహారం అందేలా ప్రత్యేక చట్టబద్ధమైన వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రైతుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సమర్థవంతమైన గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(194, 65, 12);\">\u003Cstrong>రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయం చేయడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, పంట నష్టానికి పరిహారం కల్పించడం, విత్తన ధరలు, మార్కెట్‌ను నియంత్రించడం, విత్తన రంగంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించడం సమగ్ర విత్తన చట్టం ప్రధాన లక్ష్యాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో జాప్యానికి తావు లేకుండా, రాష్ట్ర విత్తన రంగానికి బలమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Tummala Nageswara Rao.jpg",[],{"title":36,"description":37},"Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. స","తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార",[39,47,54,61,67,73,79,85,91,96],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg","Venu","4 నిమిషాల పఠనం","2026-08-29T12:37:09+00:00",106,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":52,"published_at":53,"public_read_count":29},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg","3 నిమిషాల పఠనం","2026-08-29T12:58:51+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":44,"published_at":60,"public_read_count":29},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","Anshu","2026-08-29T13:05:43+00:00",{"slug":62,"title":63,"category":57,"image":64,"author":59,"read_time":44,"published_at":65,"public_read_count":66},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg","2026-08-29T13:38:30+00:00",157,{"slug":68,"title":69,"category":16,"image":70,"author":43,"read_time":71,"published_at":72,"public_read_count":66},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","5 నిమిషాల పఠనం","2026-08-29T13:40:13+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":43,"read_time":77,"published_at":78,"public_read_count":29},"telangana-cm-revanth-reddy-wrote-a-letter-to-chief-election-commissioner-gyanesh-kumar","Telangana: సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1208a84f-6efa-4fed-b0dd-39b445e968a5.jpg","7 నిమిషాల పఠనం","2026-08-29T11:56:11+00:00",{"slug":80,"title":81,"category":57,"image":82,"author":59,"read_time":44,"published_at":83,"public_read_count":84},"the-paradise-yeshanagula-song","The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea599800-c7ba-4212-b346-d29ce6b63763.webp","2026-08-29T11:55:38+00:00",463,{"slug":86,"title":87,"category":16,"image":88,"author":15,"read_time":89,"published_at":90,"public_read_count":29},"key-discussion-in-telangana-assembly-ethics-committee-on-mla-padi-kaushik-reddy-issue","Ethics Committee: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff3c336e3-d479-40e8-b3d8-db2881d1cc94.jpg","6 నిమిషాల పఠనం","2026-08-29T11:10:44+00:00",{"slug":92,"title":93,"category":16,"image":94,"author":15,"read_time":44,"published_at":95,"public_read_count":29},"mla-danam-nagender-gets-angry-on-officials-in-indiramma-illu-lucky-draw","Danam Nagender: ఎమ్మెల్యే అంటే భయం లేదా? నేను లేకుండా లాటరీ ఎలా తీస్తారు? అధికారులపై దానం ఫైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F87943d8e-87a6-4985-9b0a-a713749a6955.jpg","2026-08-29T10:04:43+00:00",{"slug":97,"title":98,"category":50,"image":99,"author":100,"read_time":44,"published_at":101,"public_read_count":66},"new-scheme-implemented-in-the-state-no-need-to-walk-for-k","రాష్ట్రంలో కొత్త పథకం అమలు.. వైద్యం కోసం కిలోమీటర్లు నడవాల్సిన పనిలేదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8006b1ba-3464-4727-9670-e2db623c041c.jpg","Mamatha puppala","2026-08-29T09:57:53+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]