[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-messi-goodbye-to-football":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":31,"published_at":32,"updated_at":33,"public_read_count":34,"body":35,"images":36,"video_url":5,"video_urls":39,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":40,"read_next":43,"sponsored_content":90},4681,1504,"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","మెస్సీ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కాదు. అతను ఫుట్‌బాల్‌లో ఒక అనుభూతి. ఒక జ్ఞాపకం. ఒక తరం గుండెల్లో నిలిచిపోయిన పేరు. అతను అర్జెంటీనా జెర్సీకి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తెరదించాడు. కానీ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్లో మాత్రం మెస్సీకి రిటైర్మెంట్ ఉండదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","Kashi","sports","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30],"Lionel Messi","Messi Retirement","Messi Farewell","Argentina Football","Messi International Career","World Cup","Copa America","Football Legend","Argentina National Team","Messi Fans","Football News","Lionel Messi News","11 నిమిషాల పఠనం","2026-08-31T18:09:49+00:00","2026-08-31T18:10:01+00:00",106,"\u003Cp>కొన్ని గుడ్‌బైలు కేవలం ఒక ఆటగాడి ప్రయాణాన్ని ముగిస్తాయి. కానీ కొన్ని వీడ్కోళ్లు.. ఒక తరాన్ని ఖాళీగా వదిలేస్తాయి. లియోనెల్ మెస్సీ అర్జెంటీనా జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పిన ఈ క్షణం అలాంటిదే. ఇకపై అర్జెంటీనా జెర్సీలో నంబర్‌ 10 కనిపిస్తుంది.. స్టేడియం నిండా అభిమానులు ఉంటారు.. నేషనల్ ఆంథమ్ వినిపిస్తుంది. కానీ ఆ జెర్సీ వేసుకుని, బాల్‌ను ఎడమ కాలికి కట్టేసుకుని, ఒక్క క్షణంలో మొత్తం మ్యాచ్‌నే మార్చేసే మెస్సీ మాత్రం కనిపించడు. ఇది ఊహించుకోవడమే కష్టం.\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే మెస్సీ అంటే కేవలం ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కాదు. ఒక తరం ఫుట్‌బాల్‌ను చూసిన విధానం. ఒక మ్యాచ్‌ మొదలయ్యే ముందు ఎవరు గెలుస్తారో మనకు తెలియకపోవచ్చు. కానీ మెస్సీ ఫీల్డ్‌లో ఉన్నాడంటే ఏ క్షణంలోనైనా ఏదో అద్భుతం జరగొచ్చనే నమ్మకం మాత్రం ఉండేది. అతని కాళ్ల దగ్గర బాల్‌ ఉన్న ప్రతిసారీ ప్రత్యర్థి డిఫెండర్లు కంగారు పడేవారు.. అభిమానులు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూసేవారు. ఆ ఒక్క క్షణమే మెస్సీ అనే మ్యాజిక్‌కు అర్థం.\u003C\u002Fp>\u003Cp>మెస్సీ ఆటను నెంబ‌ర్ల‌లో బంధించడం అసాధ్యం. ఎన్ని గోల్స్ చేశాడు? ఎన్ని ట్రోఫీలు గెలిచాడు? ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు? ఇవన్నీ చెప్పొచ్చు. కానీ అతను ఫీల్డ్‌లో సృష్టించిన అనుభూతిని ఏ లెక్కా చెప్పలేదు. ఇద్దరు, ముగ్గురు డిఫెండర్ల మధ్య నుంచి బాల్‌తో బయటపడిన తీరు.. గోల్‌కీపర్ ముందుకొచ్చినప్పుడు అతన్ని కూడా మాయ చేసిన తీరు.. ఒక పాస్‌తో మొత్తం డిఫెన్స్‌ను చీల్చేసిన క్షణాలు.. ఇవన్నీ చూసిన వాళ్లకు మాత్రమే మెస్సీ గొప్పతనం పూర్తిగా అర్థమవుతుంది.\u003C\u002Fp>\u003Cp>అయితే అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ప్రయాణం మాత్రం అంత సులభంగా సాగలేదు. క్లబ్ ఫుట్‌బాల్‌లో బార్సిలోనా తరఫున ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో కూడా తన దేశం కోసం మెస్సీకి విజయాలు అందలేదు. 2014 ప్రపంచకప్ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమి. 2015 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో పరాజయం. 2016లో మళ్లీ అదే చిలీ చేతిలో ఓటమి. వరుసగా ఫైనళ్లలో ఓడిపోవడం కంటే.. ప్రతి పరాజయానికి మెస్సీనే బాధ్యుడిగా నిలబెట్టడం అతనికి మరింత బాధ కలిగించింది.\u003C\u002Fp>\u003Cp>“క్లబ్‌లో అన్నీ గెలుస్తాడు.. అర్జెంటీనా కోసం ఏం చేశాడు?” అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. మారడోనాతో పోలికలు వచ్చాయి. అర్జెంటీనా అభిమానుల నుంచే విమర్శలు వచ్చాయి. ఒక దశలో ఆ ఒత్తిడిని భరించలేక మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఒక ఆటగాడి కన్నీళ్ల వెనుక ఎంత బాధ ఉంటుందో ఆ రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచం చూసింది.\u003C\u002Fp>\u003Cp>అదే మెస్సీ మళ్లీ తిరిగి వచ్చాడు...\u003C\u002Fp>\u003Cp>అదే అతన్ని గొప్పవాడిగా మార్చిన విషయం. ఓడిపోకపోవడం కాదు.. ఓడిపోయిన తర్వాత మళ్లీ లేచి నిలబడటం. విమర్శలకు సమాధానం మాటలతో ఇవ్వకుండా.. తన ఆటతో ఇవ్వడం. మెస్సీ అదే చేశాడు. అర్జెంటీనా జెర్సీని మళ్లీ ధరించాడు. మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చాడు. మళ్లీ గోల్స్ చేశాడు. మళ్లీ ఫైనళ్లకు తీసుకెళ్లాడు.\u003C\u002Fp>\u003Cp>2021 కోపా అమెరికా విజయం అతని ప్రయాణంలో ఒక కీలక మలుపు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అంతర్జాతీయ ట్రోఫీ చివరకు మెస్సీ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు.. అవి కేవలం ఆనందభాష్పాలు కాదు. ఎన్నో సంవత్సరాల నిరాశకు వచ్చిన విముక్తి. తనను ప్రశ్నించిన వాళ్లందరికీ ఇచ్చిన సమాధానం. అయినా మెస్సీకి ఇంకా ఒక కల మిగిలే ఉంది. అదే ప్ర‌పంచకప్.\u003C\u002Fp>\u003Cp>2022 ఖతార్ ప్రపంచకప్‌కి మెస్సీ అడుగుపెట్టినప్పుడు వయసు 35 సంవత్సరాలు. ఇదే తన చివరి ప్రపంచకప్ కావచ్చన్న విషయం అందరికీ తెలుసు. మొదటి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడిపోయినప్పుడు.. మెస్సీ కథ మరోసారి విషాదంగా ముగుస్తుందేమో అనిపించింది. కానీ అక్కడి నుంచి అర్జెంటీనా అద్భుతంగా పుంజుకుంది.\u003C\u002Fp>\u003Cp>ఒక్కో మ్యాచ్‌ను దాటుకుంటూ ఫైనల్‌కు చేరుకుంది. ఎదురుగా ఫ్రాన్స్. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనళ్లలో ఒకటి. గోల్స్.. పెనాల్టీలు.. చివరకు షూటౌట్. అర్జెంటీనా ప్రపంచకప్ ఛాంపియన్. ఆ క్షణం.. ఫుట్‌బాల్ అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.\u003C\u002Fp>\u003Cp>ప్రపంచకప్ ట్రోఫీని మెస్సీ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు.. నిజానికి ఒక ప్లేయర్ మాత్రమే గెలవలేదు. ఎన్నో ఏళ్లుగా తనను వెంటాడిన విమర్శలపై ఒక ఆట‌గాడు గెలిచాడు. 2014లో చేజారిన కలను 2022లో అందుకున్నాడు. తన దేశం కోసం ఏం చేశావని ప్రశ్నించిన వాళ్లకు.. ప్రపంచకప్‌ను సమాధానంగా చూపించాడు. ఆ ఒక్క సీన్‌తో మెస్సీ కథ పూర్తయిందనిపించింది.\u003C\u002Fp>\u003Cp>కానీ అతను ఇంకా ఆడాడు. 2024 కోపా అమెరికాలో మరో టైటిల్ గెలిచాడు. 2026 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనా తరఫున మైదానంలోకి దిగాడు. 39 ఏళ్ల వయసులో కూడా ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన ముద్రను కొనసాగించాడు. చివరకు స్పెయిన్‌తో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో ఓడిపోయింది. ప్రపంచకప్‌ను మరోసారి అందుకోవాలన్న కల నెరవేరకపోయినా.. అదే మ్యాచ్‌ అర్జెంటీనా జెర్సీలో మెస్సీ చివరి మ్యాచ్‌గా నిలిచింది.\u003C\u002Fp>\u003Cp>207 అంతర్జాతీయ మ్యాచ్‌లు. 125 గోల్స్. ఆరు ప్రపంచకప్‌లు. ఒక ప్రపంచకప్ టైటిల్. రెండు కోపా అమెరికా ట్రోఫీలు. ఇవన్నీ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌ను కొలిచే లెక్క‌లు మాత్రమే. కానీ అతన్ని ప్రేమించిన అభిమానులకు మెస్సీ లెక్క వేరుగా ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>ఎన్ని రాత్రులు అతని మ్యాచ్‌ల కోసం మేల్కొన్నాం? ఎన్ని సార్లు అతను బాల్ తీసుకున్నప్పుడు “ఇప్పుడు ఏదో జరుగుతుంది” అని ఎదురుచూశాం? ఎన్ని గోల్స్‌కి ఆనందంతో అరిచాం? ఎన్ని ఓటముల తర్వాత అతనితో పాటు బాధపడ్డాం? ఆ లెక్కను ఏ రికార్డ్‌ బుక్‌లోనూ రాయలేం. అందుకే మెస్సీ గుడ్‌బైలో ఇంత బాధ ఉంది.\u003C\u002Fp>\u003Cp>రేపు అర్జెంటీనా మ్యాచ్‌ ఉంటుంది. నంబర్‌ 10 జెర్సీ ఉంటుంది. కొత్త ప్లేయర్లు ఉంటారు. కొత్త ఆశలు ఉంటాయి. కానీ బాల్‌ మెస్సీ ఎడమ కాలిని వెతకదు. ఫ్రీకిక్‌ దగ్గర అతని అడుగులు కనిపించవు. ప్రత్యర్థి డిఫెన్స్‌ మధ్య నుంచి దూసుకెళ్లే ఆ మెస్మ‌రైజింగ్ క‌నిపించ‌దు. మ్యాచ్ ఎంత కఠినంగా ఉన్నా.. మెస్సీ ఉన్నాడు కదా.. ఏదో చేస్తాడు అనే ఆ నమ్మకం ఉండదు. అదే అసలు లోటు.\u003C\u002Fp>\u003Cp>ఎవరైనా నంబర్‌ 10 జెర్సీ వేసుకోవచ్చు. ఎవరైనా గోల్స్ చేయవచ్చు. ఎవరైనా రికార్డులు బద్దలు కొట్టవచ్చు. కానీ మెస్సీ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే అతని స్థానంలో ఒక ప్లేయర్ మాత్రమే లేడు.. ఒక యుగం ఉంది.\u003C\u002Fp>\u003Cp>మెస్సీని చూసిన తరం అదృష్టవంతమైన తరం. ఎందుకంటే పీలే, మారడోనా లాంటి దిగ్గజాల కథలు విన్న తరాలు ఉన్నాయి. కానీ మెస్సీని మాత్రం మన కళ్ల ముందే చూశాం. అతని గోల్స్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించాం. అతని ఓటములను చూశాం. అతని కన్నీళ్లను చూశాం. చివరకు అతని చేతుల్లో ప్రపంచకప్‌ను కూడా చూశాం.\u003C\u002Fp>\u003Cp>మెస్సీ ఎంత గొప్ప ప్లేయర్? అని.. రేపు ఎవరైనా అడిగితే..  అతని గోల్స్ సంఖ్య చెప్పడం సరిపోదు. అతని ట్రోఫీలను లెక్కించడం సరిపోదు. కానీ ఒక్క మాట గ‌ర్వంగా చెప్పాలి. మెస్సీ ఆడిన కాలంలో ఫుట్‌బాల్‌ను చూసినవాళ్లం మేము. ఇదే మ‌న స‌మాధానం కావాలి. అంతే.\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే మెస్సీ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కాదు. అతను ఫుట్‌బాల్‌లో ఒక అనుభూతి. ఒక జ్ఞాపకం. ఒక తరం గుండెల్లో నిలిచిపోయిన పేరు. అతను అర్జెంటీనా జెర్సీకి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తెరదించాడు. కానీ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్లో మాత్రం మెస్సీకి రిటైర్మెంట్ ఉండదు. ఫీల్డ్‌లో అతని అడుగులు ఆగిపోయాయి. కానీ అతను సృష్టించిన మ్యాజిక్ మాత్రం ఎప్పటికీ ఆగదు.\u003C\u002Fp>",[37],{"url":13,"name":38},"messi.PNG",[],{"title":41,"description":42},"Messi Says Goodbye to International Football Era","Lionel Messi bids farewell to international football, closing an unforgettable Argentina chapter filled with World Cup glory, emotions and iconic moments.",[44,52,59,65,74,79,85],{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00",4,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":34},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":48,"read_time":31,"published_at":64,"public_read_count":51},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","2026-08-31T17:57:19+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":73},"tamannaah-bhatia-item-songs","Tamannaah Bhatia: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-08-31T17:38:05+00:00",55,{"slug":75,"title":76,"category":68,"image":77,"author":70,"read_time":71,"published_at":78,"public_read_count":73},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","2026-08-31T16:40:22+00:00",{"slug":80,"title":81,"category":62,"image":82,"author":48,"read_time":83,"published_at":84,"public_read_count":34},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:57:47+00:00",{"slug":86,"title":87,"category":62,"image":88,"author":48,"read_time":83,"published_at":89,"public_read_count":51},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","2026-08-31T15:37:00+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]