[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":89},5878,2087,"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నేటితో సెషన్‌కు చివరి రోజు కావడంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ తరపున మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ కీలకవ్యాఖ్యలు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"mla rajasingh","goshamahal","cm revanth reddy","assembly","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T10:11:11+00:00","2026-09-12T10:12:13+00:00",106,"\u003Cp>రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నేటితో సెషన్‌కు చివరి రోజు కావడంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ తరపున మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు చేసిన సూచనలు, ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ  పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>శాసససభలో ఇవాళ  'కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు'పై జరిగిన చర్చలో భాగంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి, స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్.. హైదరాబాద్‌ను  గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామమన్నారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం రూ.వేలాది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నదని, కానీ ఆ నిధులు క్షేత్రస్థాయిలో ఎలా వినియోగించుకోవాలనే దానిపై స్థానిక ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం, నిర్ణయాధికారం కల్పించాలన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారాలంటే ముందు గల్లీలు బాగుపడాలన్నారు. నగరంలో మంచినీరు, డ్రైనేజీ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మంచి నీరు వదిలిన మొదటి 30 నిమిషాలు మురికి నీరు వస్తుందని, ఈ డ్రైనేజీ-వాటర్ పైప్‌లైన్ల వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. కొన్ని బస్తీల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున 3, 4 గంటల టైంలో మంచి నీళ్లు వదులుతున్నారని.. దీంతో  నీళ్లు పట్టుకునేందుకు  ప్రజలు నిద్ర మానుకోవాల్సి వస్తుందన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>నగరంలో హైరైజ్ భవనాలకు అనుమతులు ఇచ్చేముందు అక్కడ తగినంత డ్రైనేజీ, రోడ్లు, నీటి వసతి ఉందో లేదో చెక్ చేయకుండానే అనుమతులు ఎలా  ఇస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌‌కు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే కల ఉండేదని.. నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో  కలిసి కో-ఆర్డినేషన్ భేటీ ఏర్పాటు చేయాలని గతంలో తాను ఇచ్చిన సలహాను మాజీ సీఎం పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా సీఎం రేవంత్..  సిటీ అభివృద్ధి కోసం హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"rajasingh.jpg",[],{"title":34,"description":35},"TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి :","రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నేటితో సెషన్‌కు చివరి రోజు కావడంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ తరపున మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే",[37,46,54,60,66,72,77,83],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T10:43:24+00:00",157,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-12T11:12:12+00:00",0,{"slug":55,"title":56,"category":16,"image":57,"author":15,"read_time":24,"published_at":58,"public_read_count":59},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","TG : గణేశ్ నవరాత్రులు.. నిర్వాహలకు సీఎం రేవంత్ కీలక సూచన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",2,{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":64,"published_at":65,"public_read_count":27},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":24,"published_at":70,"public_read_count":71},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",565,{"slug":73,"title":74,"category":16,"image":75,"author":42,"read_time":43,"published_at":76,"public_read_count":27},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","2026-09-12T09:34:05+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":24,"published_at":81,"public_read_count":82},"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","2026-09-12T09:22:27+00:00",259,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":24,"published_at":87,"public_read_count":88},"farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity","TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","2026-09-12T08:59:38+00:00",208,[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]