[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kangana-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":26,"published_at":27,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":34,"read_next":37,"sponsored_content":107},1477,"kangana-comments","కాక్రోచ్ పార్టీపై ఆ కామెంట్స్ ఏంటి కంగ‌న‌..? సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్న జెన్ జీ","కంగ‌న ఒక‌సారి త‌న సినిమాల‌ను గుర్తు చేసుకోవాల‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో ఆమె వేసుకున్న డ్రెస్‌ల‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడొచ్చి మాకు గొప్ప‌లు చెబితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. సీజేపీ కార్య‌క‌ర్త‌లు, జెన్ జీ నుంచి విప‌రీత‌మైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు కంగ‌న‌.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F19793a48-0906-4ff1-8706-57261ec1dc5c.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F19793a48-0906-4ff1-8706-57261ec1dc5c.png","Kashi","national",[17,18,19,20,21,22,23,24,25],"BJP MP Kangana Ranaut","Cockroach Party","Gen Z","Kangana Controversy","Social Media Backlash","BJP News","CJP Protest","Jantar Mantar","Viral News","6 నిమిషాల పఠనం","2026-07-29T04:27:01+00:00",157,"\u003Cp>కాక్రోచో పార్టీపై కంగ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు\u003C\u002Fp>\u003Cp>వాళ్ల‌ను ఎవ‌రు కంటున్నారో.. అంటూ కామెంట్స్\u003C\u002Fp>\u003Cp>జెన్ జీ కాదు.. జ‌న‌రేషన్ గ‌ట్ట‌ర్ అంటూ విమ‌ర్శ‌లు\u003C\u002Fp>\u003Cp>కంగ‌న‌పై జెన్ జీ ఫైర్\u003C\u002Fp>\u003Cp>ఓ సారి గ‌తం చూసుకో అంటూ కౌంట‌ర్లు\u003C\u002Fp>\u003Cp>ఎప్పుడూ ఏవో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో ఉండే బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌న... ఇప్పుడు జెన్ జీని టార్గెట్ చేశారు. కాక్రోచ్ పార్టీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కాక్రోచ్‌ల‌ను చూస్తుంటే క‌క్కొస్తుంద‌న్న‌ట్టు మాట్లాడారు. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మంతో దేశం మొత్తం ఉడికిపోతుందంటే.. ఈమె చేసిన కామెంట్స్ అధికార పార్టీకే ఇబ్బందికరంగా మారాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌లు చేసిన వారు జెన్‌ జీ కాదు.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్ అంటూ విమ‌ర్శించారు. మురికి కాలువ‌ల నుంచి వ‌చ్చిన వారిలా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. నా జీవితంలో ఒకేచోట ఇంత అసహ్యకరమైన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని, జెన్‌ జీ నిరసనల నుంచి వచ్చిన రీల్స్‌ వాంతి వచ్చేలా ఉన్నాయంటూ మాట్లాడారు. అక్కడ చేరినవారికి చదువు సంధ్యల్లేవు. వారు సంస్కారంతో పెరగలేదు. వారిని ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో అని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఉద్య‌మంలో పాల్గొన్న మ‌హిళ‌ల‌నూ టార్గెట్ చేశారు. సీజేపీ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న హిందూ మహిళలు కూడా విదేశీ సంస్కృతి మోజులో పాడైపోయారని దుయ్య‌బ‌ట్టారు. \u003C\u002Fp>\u003Cp>కంగ‌న‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్\u003C\u002Fp>\u003Cp>కంగ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై జెన్ జీ అంతెత్తు లేస్తోంది. ఒక ఎంపీగా ఉండి.. ఇవేం మాట‌ల‌ని మండిప‌డుతోంది. ఈ కామెంట్స్‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ సౌర‌వ్ దాస్ స్పందించారు. ఆమెను బీజేపీయే ప‌ట్టించుకోద‌ని, మ‌నం కూడా లైట్ తీసుకుందామంటూ సెటైర్లు వేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో #KanganaRanaut, #CockroachParty వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. \u003C\u002Fp>\u003Cp>రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు కాస్త హుందాగా మాట్లాడాలంటూ కంగ‌న‌ను కౌంట‌ర్లిస్తున్నారు నెటిజ‌న్లు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను అవ‌మానించ‌డం త‌గ‌ద‌ని సూచిస్తున్నారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, జెన్ జీ చేపట్టిన ఉద్య‌మం దేశం మొత్తాన్ని క‌దిలించింద‌ని, కంగ‌న మాత్రం ఇంకా నిద్ర‌లో ఉన్న‌ట్టున్నార‌ని కామెంట్లు పెడుతున్నారు. కంగన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు కూడా తప్పుబట్టారు. ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరిచే వారిని అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు.\u003C\u002Fp>\u003Cp>కంగ‌న సినిమాల‌పై విమ‌ర్శ‌లు\u003C\u002Fp>\u003Cp>కంగ‌న ఒక‌సారి త‌న సినిమాల‌ను గుర్తు చేసుకోవాల‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో ఆమె వేసుకున్న డ్రెస్‌ల‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడొచ్చి మాకు గొప్ప‌లు చెబితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. సీజేపీ కార్య‌క‌ర్త‌లు, జెన్ జీ నుంచి విప‌రీత‌మైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు కంగ‌న‌.\u003C\u002Fp>\u003Cp>కంగనకు ఇదే మొదటిసారి కాదు\u003C\u002Fp>\u003Cp>కంగన రనౌత్ గతంలో కూడా అనేక రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియా పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మ‌రోవైపు కంగ‌న వివాదంపై బీజేపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. అది ఆమె వ్య‌క్తిగ‌త‌మ‌న్న‌ట్టు కొంద‌రు నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. \u003C\u002Fp>",[31],{"url":12,"name":32},"kangana.png",[],{"title":35,"description":36},"Kangana Ranaut Cockroach Party Comments Spark Gen Z Outrage","BJP MP Kangana Ranaut's remarks on the Cockroach Party and Gen Z have triggered massive backlash on social media, with hashtags trending and criticism mounting.",[38,46,52,61,68,74,80,86,93,101],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":28},"weather-department-issues-warning-for-the-state-heavy-rains-in-telangana-today-and-tomorrow","Weather Update: రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbbaad7c6-b257-4094-a259-437c356c63d1.webp","Venu","4 నిమిషాల పఠనం","2026-07-29T04:29:32+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":43,"read_time":44,"published_at":51,"public_read_count":28},"telangana-stir-over-gadwal-students-suicide-note-allegations-against-female-lecturer","Gadwal: విద్యార్థి సూసైడ్ నోట్ కలకలం.. మహిళా లెక్చరర్‌పై ఆరోపణలు!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7e06af80-7632-4ace-8779-453fd3094196.jpg","2026-07-29T04:58:46+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"major-fraud-in-the-thalliki-vandanam-scheme-funds-vanish-from-28-accounts","Ap : తల్లికి వందనం స్కీమ్‌లో ఘరానా మోసం.. 28 ఖాతాల్లో డబ్బులు మాయం","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6cdaad85-a2b9-472f-8467-8c3588646fd7.webp","Kumar","3 నిమిషాల పఠనం","2026-07-29T05:00:41+00:00",106,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":58,"published_at":67,"public_read_count":60},"sharwanand","Sharwanand: భోగి తర్వాత సంపత్ నందితో మరో సినిమా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F00513374-99c7-4846-ac10-1e77f79b0fac.jpg","Anshu","2026-07-29T05:09:49+00:00",{"slug":69,"title":70,"category":41,"image":71,"author":57,"read_time":58,"published_at":72,"public_read_count":73},"jubilee-hills-cis-predatory-scheme-swindled-2-crore-by-gaining-trust-under-the-pretext-of-marriage","HYD : జూబ్లీహిల్స్ సీఐ కీచకపర్వం.. పెళ్లిపేరుతో నమ్మించి రూ.2 కోట్లు కాజేసి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F497606ac-2d9c-4a0f-94f3-b15736b2bc0b.jpg","2026-07-29T05:16:51+00:00",55,{"slug":75,"title":76,"category":41,"image":77,"author":43,"read_time":78,"published_at":79,"public_read_count":60},"telangana-anti-corruption-bureau-how-to-hide-ill-gotten-wealth-to-avoid-detection-by-the-anti-corruption-bureau","Anti-Corruption Bureau: దోచుకున్నది దొరక్కుండా దాచేదెలా?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F62a0b375-7fe7-4760-b4d5-8607114f42b1.jpg","5 నిమిషాల పఠనం","2026-07-29T04:14:26+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":43,"read_time":44,"published_at":85,"public_read_count":28},"health-not-losing-weight-despite-dieting-youll-be-surprised-to-know-the-reason","Health: డైటింగ్ చేసిన బరువు తగ్గడం లేదా? కారణం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F177c4e45-9c7d-4c4d-a4ab-c275789add90.png","2026-07-29T03:24:14+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":43,"read_time":44,"published_at":91,"public_read_count":92},"spiritual-do-you-know-why-the-soul-is-born-on-earth-with-a-body","Spiritual: శరీరంతో జీవుడు భూమిపై ఎందుకు పుట్టాడో తెలుసా?..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fdc7002c6-0695-401b-9455-8a43608da535.png","2026-07-29T03:14:33+00:00",259,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":43,"read_time":98,"published_at":99,"public_read_count":100},"political-news-peddi-sudarshan-reddy-who-put-pressure-on-peddi-sudarshan-reddy","Peddi Sudarshan Reddy: పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffe2799da-a210-45ec-90f2-2cdadd819f8d.jpg","10 నిమిషాల పఠనం","2026-07-29T03:06:04+00:00",1534,{"slug":102,"title":103,"category":83,"image":104,"author":43,"read_time":44,"published_at":105,"public_read_count":106},"health-simple-solutions-for-a-stuffy-nosetry-these-home-remedies-for-relief","Health: ముక్కు దిబ్బడకు సులభమైన పరిష్కారాలు.. ఇంట్లో ఇలా చేస్తే రిలీఫ్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F87c44010-068a-4510-9f85-4467e2320973.png","2026-07-29T02:47:26+00:00",208,[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]