[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-illegal-venture-in-60-acre-demolished-in-janwada":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":99},5501,1905,"illegal-venture-in-60-acre-demolished-in-janwada","జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే","ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగారు. కొరడా ఝళిపించారు. అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో అక్రమ వెంచర్ పై అధికారులు జేసీబీలతో వచ్చి మరీ చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. కాస్త ఆలస్యమైనా వారి చర్యను స్వాగతించాల్సిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Janwada Venture Demolish","Janwada Layout Demolish","Janwada","HMDA","Gandipet","Swechaa News","6 నిమిషాల పఠనం","2026-09-08T15:31:28+00:00","2026-09-08T15:32:50+00:00",55,"\u003Cp>Janwada Venture Demolish: ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగారు. కొరడా ఝళిపించారు. అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో అక్రమ వెంచర్ పై అధికారులు జేసీబీలతో వచ్చి మరీ చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>కాస్త ఆలస్యమైనా వారి చర్యను స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. జీవోలకు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిన ఒక్క వెంచర్‌పైనే ఈ చర్యలా..? లేక జన్వాడలో ఉన్న అన్ని అక్రమ వెంచర్లపైనా ఇదే తరహా ఉక్కుపాదం మోపుతారా..? అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.\u003C\u002Fp>\u003Cp>చర్యల సంగతి పక్కన పెడితే.. అసలు అక్రమ వెంచర్ ఏర్పడే వరకు సంబంధిత అధికారులు, వ్యవస్థ ఏం చేస్తోంది..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. డీపీఓ, ఎంపీవో, ఎంపీడీవో, ఎమ్మార్వో, ఆర్‌ఐ, పంచాయతీ కార్యదర్శి.. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్లు.. వీరంతా ఏం చేస్తున్నట్లు? వీరందరి పాత్రపైనా సమగ్ర విచారణ జరగాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అనుమతులు, పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం ఇవన్నీ ఎలా జరిగాయో తేలాల్సిందే. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోలేదా..?  లేక ఎవరి అండదండలతో ఇవన్నీ జరిగాయి? అన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మరో పెద్ద ప్రశ్న..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>జంట జలాశయాలకు ముప్పు కలిగించే భారీ నిర్మాణాల సంగతేమిటి..? ఇంటి నెంబర్ తీసుకుని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న కొన్ని కన్వెన్షన్ సెంటర్ల సంగతేమిటి..? వీటికి సమాధానం దొరకాల్సి ఉంది. ఇక, ఒక్కో ఈవెంట్‌కు రూ.20 నుంచి రూ.40 లక్షలు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మూడు నెలలకు కేవలం రూ.600 హౌస్ ట్యాక్స్ మాత్రమే ఉంది. మరి, ఇది అధికారులకు కనిపించడం లేదా..? లేక కనిపించినా కనిపించనట్టే వదిలేస్తున్నారా..? అన్నది అంతుచిక్కని మిస్టరీ.\u003C\u002Fp>\u003Cp>ఏది ఏమైనా జన్వాడలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న అధికారులను అభినందించాల్సిందే. అదే సమయంలో ఈ అక్రమాలకు అనుమతులు ఇచ్చిన, పర్యవేక్షణలో విఫలమైన లేదా చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులపైనా విచారణ జరిపి, చర్యలు ఉండాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అధికారులు.. ఒకటో రెండో నిర్మాణాలను కూల్చి చేతులు దులుపుకోవడం కాదు. అక్రమాలన్నింటినీ గుర్తించి, అవసరమైన చోట నేలమట్టం చేసి, జంట జలాశయాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు సెలెక్టివ్‌గా కాకుండా చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని బలంగా కోరుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>60 ఎకరాల లేఔట్ కూల్చివేత\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో భారీ అక్రమ వెంచర్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. గండిపేట జలాశయ పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను ఉల్లంఘిస్తూ సుమారు 60 ఎకరాల్లో నిర్మిస్తున్న లేఅవుట్‌ను హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు సంయుక్తంగా కూల్చేశారు. \u003C\u002Fp>\u003Cp>వెంచర్‌లో క్లబ్‌హౌస్ కోసం నిర్మిస్తున్న పిల్లర్లను, కాంక్రీట్ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అక్రమంగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బాక్స్ డ్రెయిన్లను కూడా ధ్వంసం చేశారు. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, సీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమాలను నిర్ధారించుకున్నాక తహసీల్దార్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు.\u003C\u002Fp>\u003Cp>అక్రమ కట్టడాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామన్న అధికారులు.. 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా ఎవరు నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Janwada Venture Demolish.jpg",[],{"title":35,"description":36},"జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక","ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగారు. కొరడా ఝళిపించారు. అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండ",[38,46,53,59,64,71,76,82,87,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":28},"karimnagar-a-fraudster-who-posed-as-a-professor-and-committed-scams-under-the-guise-of-offering-jobs-has-been-caught-by-the-police","Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c705d53-01aa-47f1-945b-56bb1288b1c4.webp","Venu","4 నిమిషాల పఠనం","2026-09-08T15:40:05+00:00",{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology","DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-08T16:03:19+00:00",4,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":44,"published_at":58,"public_read_count":28},"narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested","TG : నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","Mahesh","2026-09-08T16:08:35+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":57,"read_time":50,"published_at":63,"public_read_count":52},"flight-ticket-prices-festival-season-300-percent-hike-swechaanews","Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb823f37-2ce9-40bc-9252-b08ef3c8077d.jpg","2026-09-08T16:20:07+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":57,"read_time":50,"published_at":69,"public_read_count":70},"youtuber-rama-nandu-police-interrogation-three-hours-no-clarity","YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7d40077-f035-41b3-9304-07cc20407d7d.jpg","2026-09-08T16:30:49+00:00",106,{"slug":72,"title":73,"category":16,"image":74,"author":57,"read_time":44,"published_at":75,"public_read_count":28},"bhatti-vikramarka-farm-house-conspiracy-assembly-incident-brs-mlcs-suspension","Bhatti Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa1bad8b7-9bec-45a9-b3de-66e55917b8f1.jpg","2026-09-08T15:22:43+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":43,"read_time":80,"published_at":81,"public_read_count":70},"jagtial-another-heiress-enters-telangana-politics","Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6a56e3f-8c8f-4892-b533-05ab2114a212.webp","8 నిమిషాల పఠనం","2026-09-08T15:12:48+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":57,"read_time":50,"published_at":86,"public_read_count":70},"telangana-assembly-gate-brs-mlcs-police-clash-video-released","TG : అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97fe46ba-af7f-4dbb-8162-43343032d140.jpg","2026-09-08T14:42:38+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":57,"read_time":50,"published_at":91,"public_read_count":92},"brs-mlcs-tata-madhu-navin-kumar-reddy-remand-rejected","TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు ఊరట..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02faa3e9-ac22-4c87-9e32-c00b6c25dc56.jpg","2026-09-08T13:46:06+00:00",157,{"slug":94,"title":95,"category":16,"image":96,"author":15,"read_time":97,"published_at":98,"public_read_count":28},"ex-minister-ktr-warns-cm-revanth-reddy","కేసీఆర్ ఎందుకు చనిపోవాలి? కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6176d6d9-3087-498f-9a6d-8ac974374b17.jpg","7 నిమిషాల పఠనం","2026-09-08T13:39:03+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]