[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-honey-trap-in-the-bollarum-army-arms-theft-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":98},4918,1620,"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో  భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"honeytrap","bollaram","army weapons","theft case","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-03T07:02:18+00:00","2026-09-03T07:02:49+00:00",106,"\u003Cp>సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో  భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పెద్దఎత్తున వెపన్స్, బుల్లెట్స్ మిస్ కావడంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ సైతం రంగంలోకి దిగింది.ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టగా.. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే,  బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో  కొత్త కోణం వెలుగుచూసినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక హనీట్రాప్ ? జరిగి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ సిబ్బందిని హనీట్రాప్‌లోకి దించి కీలక సమాచారం సేకరించారా? అనే కోణంలో విచారణ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర నిఘా బృందం ఆరా తీస్తున్నట్టు  తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సిబ్బంది ఫోన్ కాల్స్, కాంటాక్ట్స్, సోషల్ మీడియా కార్యకలాపాలపై తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు AK-203 రైఫిళ్లు, 7 పిస్తోళ్లు, 1 ఇన్సాస్ వెపన్ చోరీకి గురయ్యాయి. చోరీ చేసిన ఆయుధాలకు సరిపోయే తూటాలను కూడా దుండగులు ఎత్తుకెళ్లడంతో సిబ్బందిపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయుధాల చోరీ పక్కా ప్రణాళికతోనే జరిగిందని పోలీసుల అనుమానిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>క్యాంపు, ఆయుధాల వివరాలు బాగా తెలిసిన వ్యక్తులపై నిఘా ఉంచినట్టు సమాచారం. ఇదే సమయంలో ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యం కావడంతో  ఏదో పెద్దఎత్తున జరగబోతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో బకెట్‌లో డిటోనేటర్లు గుర్తించిన ఆర్మీ అధికారులు వాటిని నిర్వీర్యం చేసినట్టు సమాచారం. అయితే, ఆయుధాల చోరీ.. డిటోనేటర్ల లభ్యానికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. కాగా, 48 గంటలు గడిచినా ఆయుధాల చోరీ కేసులో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో దర్యాప్తులో పోలీసులు వేగం పెంచినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095382296782340459?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095382296782340459?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"army 2 ai.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095382296782340459?s=20",{"title":11,"description":35},"సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో  భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొ",[37,45,51,58,64,70,76,81,86,93],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":24,"published_at":50,"public_read_count":27},"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","2026-09-03T07:41:09+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":24,"published_at":57,"public_read_count":44},"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","Anshu","2026-09-03T08:01:11+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":24,"published_at":62,"public_read_count":63},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","2026-09-03T08:03:20+00:00",157,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":15,"read_time":24,"published_at":69,"public_read_count":63},"crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery","Crime : వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","2026-09-03T08:29:10+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":15,"read_time":24,"published_at":75,"public_read_count":63},"konda-poised-to-resign-will-she-leave-the-party","TG : రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","2026-09-03T06:41:37+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":24,"published_at":80,"public_read_count":27},"another-shock-for-dsp-bhim-reddy-ed-steps-in-after-acb","HYD : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..  ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61a16794-9ea9-48e5-9e11-397a2df05164.jpg","2026-09-03T06:17:53+00:00",{"slug":82,"title":83,"category":54,"image":84,"author":56,"read_time":24,"published_at":85,"public_read_count":44},"venky-atluri-megastar","Venky Atluri: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F931001ec-1807-40a4-8e5f-fa18f377d523.webp","2026-09-03T05:52:49+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":90,"read_time":91,"published_at":92,"public_read_count":27},"hyderabad-ed-raids-ganja-queen-neetubai-residences-secret-tunnel-found-in-the-house","Hyderabad: గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F454acb47-2610-4a2f-867b-fa057e31c09a.png","Venu","5 నిమిషాల పఠనం","2026-09-03T05:50:38+00:00",{"slug":94,"title":95,"category":16,"image":96,"author":15,"read_time":24,"published_at":97,"public_read_count":27},"t-hub-turns-into-a-weekend-market-video-goes-viral","HYD : వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F916ee784-051b-45fc-9bd3-d0705485396f.jpg","2026-09-03T05:42:01+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]