[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":28,"published_at":29,"updated_at":30,"public_read_count":31,"body":32,"images":33,"video_url":5,"video_urls":36,"instagram_url":5,"x_url":37,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":38,"read_next":40,"sponsored_content":94},4658,1494,"high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోస్టర్ విధానాన్ని సవరించాలని.. జీవో 99 వల్ల రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని.. తక్షణమే దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ కు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుతో భారీగా మాలలు తరలివచ్చారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27],"Mala Mahanadu","Mala Mahanadu Chalo Secretariat","Protest","Cm Revanth Reddy","Telangana","Roster System","Mala Community","Swechaa News","Sudhakar Pilli","6 నిమిషాల పఠనం","2026-08-31T13:29:00+00:00","2026-08-31T13:30:41+00:00",55,"\u003Cp>Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోస్టర్ విధానాన్ని సవరించాలని.. జీవో 99 వల్ల రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని.. తక్షణమే దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ కు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుతో భారీగా మాలలు తరలివచ్చారు. పోలీసుల నిర్భందాలను ఛేదించుకుని వచ్చి మరీ సెక్రటేరియట్ ను ముట్టడించారు.\u003C\u002Fp>\u003Cp>సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన మాలలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి దార సత్యంకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ తోపులాటలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అస్వస్థతకు గురయ్యారు. \u003C\u002Fp>\u003Cp>మాలల చలో సెక్రటేరియట్ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుండి అరెస్టుల పర్వం నడిచింది. అరెస్ట్ చేసిన వారిని హైదరాబాద్ నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలకు తరలించారు పోలీసులు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఆయన బృందాన్ని సికింద్రాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.\u003C\u002Fp>\u003Cp>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార ధోరణితో తన గొయ్యి తానే తీసుకుంటున్నారని పిల్లి సుధాకర్ ధ్వజమెత్తారు. మాలలపై కక్ష సాధింపు ఎందుకు అని నిలదీశారు. రోస్టర్ విధానాన్ని సవరించాలని, మాలలకు 20 రోస్టర్ పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లను కేటాయించాలని, జీవో నెంబర్ 99 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు గుండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. కనీసం ఆడవాళ్ళను మహిళా పోలీసులతో అరెస్ట్ చేయించలేదని, ఇది దుర్మార్గం అని ధ్వజమెత్తారు. మాలలపై జరిగిన పోలీసుల దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు.\u003C\u002Fp>\u003Cp>''రోస్టర్ విధానం ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జీవో 99 రద్దు చేసి గ్రూప్-3 లోని 26 కులాలకు న్యాయం చేయాలి. సీఎం రేవంత్ మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాలలను విద్య ఉద్యోగ అవకాశాలకు దూరం చేస్తున్నారు. ఈరోజు మాలలపై జరిగిన దాడి హేయమైన చర్య. ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. రోస్టర్ విధానంలో 20 పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లు మాలలకు కేటాయించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటేరియట్ కు వచ్చిన మాలలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి గాయపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జిలతో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన తెలపాలని పిలుపునిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ ను సవరించకపోతే ప్రభుత్వంతో మాలలు యుద్ధం చేస్తారు'' అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>''రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయాన్ని అరికట్టాలంటే వెంటనే ప్రస్తుత రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి, అవసరమైన సవరణలు చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 99లో మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపు జరిగిన తీరు తీవ్ర అభ్యంతరకరం. ప్రస్తుతం ఉన్న నిబంధనలు మాల సామాజిక వర్గానికి నష్టం కలిగించేలా ఉన్నాయి. వెంటనే 20 రోస్టర్ పాయింట్లలోపు కనీసం రెండు పాయింట్లను మాలలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిల్లి సుధాకర్.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[34],{"url":13,"name":35},"Mala Mahanadu Chalo Secretariat.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FHyderabad_Mail\u002Fstatus\u002F2094381637253660696",{"title":11,"description":39},"Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోస్టర్ విధానాన్ని సవరించాలని.. జీవో 99 వల్ల రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో",[41,49,54,60,66,72,78,84,89],{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":31},"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-08-31T14:08:36+00:00",{"slug":50,"title":51,"category":16,"image":52,"author":15,"read_time":47,"published_at":53,"public_read_count":31},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","2026-08-31T14:42:49+00:00",{"slug":55,"title":56,"category":44,"image":57,"author":46,"read_time":47,"published_at":58,"public_read_count":59},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",2,{"slug":61,"title":62,"category":44,"image":63,"author":46,"read_time":47,"published_at":64,"public_read_count":65},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",0,{"slug":67,"title":68,"category":44,"image":69,"author":46,"read_time":47,"published_at":70,"public_read_count":71},"tollywood-kaya-kalyan-ram-kala-bhairava","Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","2026-08-31T13:04:43+00:00",106,{"slug":73,"title":74,"category":16,"image":75,"author":15,"read_time":76,"published_at":77,"public_read_count":31},"no-safety-for-women-in-congress-govt-ex-minister-harish-rao-reacts-on-tukkuguda-nurse-incident","Harish Rao: తుక్కుగూడ నర్సు ఘటన కలచివేసింది.. సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు-హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c2d042-e8c6-4894-9d4f-0a4523e7baa3.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T12:47:51+00:00",{"slug":79,"title":80,"category":44,"image":81,"author":46,"read_time":47,"published_at":82,"public_read_count":83},"trisha-krshnan-vishwambhara","Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4c61e328-69b1-47a3-b3e1-eef22e3e6f43.webp","2026-08-31T12:03:01+00:00",463,{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":76,"published_at":88,"public_read_count":31},"krishna-water-dispute-harish-rao-questions-cm-revanth-reddy-silence","Harish Rao: కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా మౌనం, తెలంగాణకు సీఎం రేవంత్ తీరని ద్రోహం- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F87988573-1541-4288-b7d6-8089bc6c2740.jpg","2026-08-31T11:53:38+00:00",{"slug":90,"title":91,"category":16,"image":92,"author":15,"read_time":28,"published_at":93,"public_read_count":31},"minister-konda-surekhas-name-and-photo-missing-on-flexis","Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6701c3a5-0df0-4ab3-9ceb-e19165b059bd.jpg","2026-08-31T10:24:26+00:00",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]