[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-health-did-you-know-that-people-with-these-conditions-should-not-eat-papaya-at-all":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":101},729,"health-did-you-know-that-people-with-these-conditions-should-not-eat-papaya-at-all","Health: ఈ సమస్యలున్నవారు బొప్పాయి అస్సలు తినకూడదని తెలుసా..?","బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే అందరికీ బొప్పాయి ఒకేలా ఉపయోగపడదు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4b9f3795-21aa-4d2e-a5f8-c49e5c1673b0.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4b9f3795-21aa-4d2e-a5f8-c49e5c1673b0.png","Venu","health",[17,18,19,20,21],"Health","Papaya","Anticoagulants","Kidney Stones","Health Tips","4 నిమిషాల పఠనం","2026-07-19T02:43:01+00:00",259,"\u003Cp>బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే అందరికీ బొప్పాయి ఒకేలా ఉపయోగపడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి లేదా సగం పండిన బొప్పాయిని తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే లాటెక్స్, పపైన్ అనే పదార్థాలు గర్భాశయ సంకోచాలకు కారణమై, గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లాటెక్స్ అలర్జీ ఉన్నవారిలో బొప్పాయి అలర్జీని కలిగించే ప్రమాదం ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>రక్తం పలుచబరిచే మందులు తీసుకునే వారు కూడా బొప్పాయిని అధికంగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.  ఎందుకంటే ఇది రక్తస్రావం మరింత అయ్యేలా దోహదపడుతుందట. అంతేకాదు, జీర్ణాశయ సమస్యలు లేదా తరచూ విరేచనాలతో బాధపడేవారు బొప్పాయిని పరిమితంగా తీసుకోవడం మంచిదని లేకుంటే ఇందులో ఉన్న ఫైబర్ కొందరిలో సమస్యలను మరింత పెంచవచ్చని చెబుతున్నారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బొప్పాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అయితే, విటమిన్-సి అతిగా శరీరంలోకి చేరితే అది 'ఆక్సలేట్' గా మారి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారి సమస్యను మరింత ఎక్కువ చేస్తుందట.. \u003C\u002Fp>\u003Cp>ఇక డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి మంచిదే అయినప్పటికీ, 'హైపోగ్లైసీమియా సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్‌ను మరింత తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>అయితే ఆరోగ్యవంతులైన వారికి బొప్పాయి ఒక అద్భుతమైన పండు. ఇందులో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తాయి. కాబట్టి బొప్పాయి తినే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైతే వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ముఖ్య గమనిక: సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు నెఫ్రాలజిస్ట్ లేదా రీనల్ డయాటీషియన్‌ను సంప్రదించడం తప్పనిసరి.. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించ గలరు!.. \u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Gemini_Generated_Image_5f02n25f02n25f02.png",[],{"title":31,"description":32},"ఈ సమస్యలున్నవారు బొప్పాయి అస్సలు తినకూడదని తెలుసా..?","బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే అందరికీ బొప్పాయి ఒక",[34,41,48,55,61,69,75,81,88,94],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":14,"read_time":22,"published_at":39,"public_read_count":40},"minister-ponguleti-srinivasa-reddy-visited-lord-sri-sitaramachandra-swamy-at-bhadrachalam","Bhadrachalam: భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి.. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి..!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F94ec36c1-f386-4a23-be16-a157f9c75cce.jpg","2026-07-19T03:06:33+00:00",55,{"slug":42,"title":43,"category":44,"image":45,"author":14,"read_time":22,"published_at":46,"public_read_count":47},"puri-jagannath-rath-yatra-turns-into-a-controversy","Puri Jagannath Rath Yatra: వివాదంగా మారిన పూరి జగన్నాథ రథయాత్ర!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffebe8ced-7e9b-48da-9fb2-f2a63e810429.webp","2026-07-19T03:29:41+00:00",208,{"slug":49,"title":50,"category":44,"image":51,"author":52,"read_time":22,"published_at":53,"public_read_count":54},"amarnath-yatra-heavy-rains-in-jammu-kashmir-amarnath-yatra-halted","Amarnath yatra: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff4773d59-9fff-49a2-abe6-65ef5afde5c5.webp","Mamatha puppala","2026-07-19T03:34:01+00:00",310,{"slug":56,"title":57,"category":37,"image":58,"author":14,"read_time":22,"published_at":59,"public_read_count":60},"pcc-chief-jobs-only-for-your-family-what-have-the-unemployed-youth-gained-ktr","PCC Chief: మీ కుటుంబానికే కొలువులు.. నిరుద్యోగ యువతకు ఒరిగింది ఏమిటి కేటీఆర్?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7181ac5c-a15a-4811-a3ee-f042aab3bbca.jpg","2026-07-19T04:02:36+00:00",106,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":52,"read_time":66,"published_at":67,"public_read_count":68},"online-prostitution-scam-honey-trap-via-online-ads-11-arrested-in-bengaluru","Online Prostitution Scam: ఆన్‌లైన్‌ ప్రకటనలతో హనీట్రాప్.. బెంగళూరులో 11 మంది అరెస్ట్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4cce1e88-8e4c-4728-a878-38d622d3201e.jpg","3 నిమిషాల పఠనం","2026-07-19T04:03:30+00:00",361,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":14,"read_time":22,"published_at":74,"public_read_count":40},"spirituality-do-you-know-the-meaning-of-self-surrender","Spirituality: ఆత్మనివేదనంలోని అర్ధం తెలుసా ?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff3176876-ffab-4379-9e10-f6dd57b4935e.png","2026-07-19T02:32:09+00:00",{"slug":76,"title":77,"category":15,"image":78,"author":14,"read_time":79,"published_at":80,"public_read_count":40},"health-this-is-the-best-food-to-consume-for-healthy-kidneys","Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన బెస్ట్ ఫుడ్ ఇదే!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1278907d-c772-410a-90ed-552a5b1616d0.png","5 నిమిషాల పఠనం","2026-07-19T02:12:11+00:00",{"slug":82,"title":83,"category":72,"image":84,"author":14,"read_time":85,"published_at":86,"public_read_count":87},"spirituality-what-is-death-an-unknown-mysteryan-unbelievable-truth","Spirituality: మరణం అంటే ఏమిటి..? తెలియని రహస్యం.. నమ్మలేని నిజం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd406c018-1562-463a-a274-377b24d510db.png","6 నిమిషాల పఠనం","2026-07-19T02:05:28+00:00",157,{"slug":89,"title":90,"category":44,"image":91,"author":92,"read_time":79,"published_at":93,"public_read_count":60},"deactivated-instagram-when-entered-class-11-neet-20-ranker-vaishnavi-das","ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసింది.. నీట్‌లో 20వ ర్యాంకు సాధించింది","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F693cfdb2-1ff2-4094-8921-e8b94abae88b.jpg","NK","2026-07-18T17:53:16+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":99,"read_time":22,"published_at":100,"public_read_count":47},"varanasi-hooting-update","Varanasi: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం జరుగుతుందంటే?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F57bfe2ac-0df4-4b3d-a9ed-404fa37d6ae5.jpg","Anshu","2026-07-18T17:34:54+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]