[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-health-are-your-gums-bleeding-this-is-the-reason":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":108},5615,1961,"health-are-your-gums-bleeding-this-is-the-reason","Health: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .","చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య.. అయితే బ్రష్ గట్టిగా చేశాంలే అని దీనిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, తరచూ ఇలా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిందే అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fddb61b4e-3d1c-4dd9-8aac-cb2ad144d524.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fddb61b4e-3d1c-4dd9-8aac-cb2ad144d524.jpg","Venu","health","routine",[19,20,21,22,23,24],"Health","Gums","bleeding","reason","Salt","clove oil","4 నిమిషాల పఠనం","2026-09-10T02:04:18+00:00","2026-09-10T02:05:14+00:00",55,"\u003Cp>చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య.. అయితే బ్రష్ గట్టిగా చేశాంలే అని దీనిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, తరచూ ఇలా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిందే అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఈ సమస్యకు ప్రధాన కారణాలు:\u003C\u002Fp>\u003Cp>సరైన ఓరల్ హైజీన్ పాటించకపోవడం వల్ల పళ్లపై 'ప్లేక్' (పాచి) పేరుకుపోతుంది. దీనివల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం మొదలవుతాయి. దీనిని ఆరంభంలోనే నివారించకపోతే, అది 'పెరియోడాంటైటిస్' అనే తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. ఇది పళ్ల పునాదిని బలహీనపరిచి, అవి ఊడిపోయేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>అంతేకాకుండా, విటమిన్-సి, విటమిన్-కె లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, సరిగ్గా అమరని కట్టుడు పళ్లు కూడా కారణం కావచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా), హీమోఫీలియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఇంట్లోనే పాటించదగిన చిట్కాలు:\u003C\u002Fp>\u003Cp>గోరువెచ్చని ఉప్పు నీళ్లు:- కప్పు గోరువెచ్చని నీళ్లలో స్పూన్ ఉప్పు కలిపి రోజుకు 2-3 సార్లు నోటిని పుక్కిలిస్తే వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.\u003C\u002Fp>\u003Cp>లవంగ నూనె:- లవంగ నూనెలోని 'యూజనాల్' నొప్పిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె కలిపి చిగుళ్లకు రాసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.\u003C\u002Fp>\u003Cp>పసుపు, ఆవనూనె:- పసుపులోని 'కుర్క్యుమిన్' ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఆవనూనె, చిటికెడు ఉప్పు కలిపి చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి.\u003C\u002Fp>\u003Cp>టీట్రీ లేదా పెప్పర్‌మింట్ ఆయిల్:- కొబ్బరి నూనెతో కలిపి వాడితే నోటి దుర్వాసన తగ్గి, క్రిములు నశిస్తాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.. మరోవైపు నోటి దుర్వాసన, చిగుళ్ల రంగు మారడం, పళ్లు కదలడం లేదా రెండు రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే సొంత వైద్యం పక్కన పెట్టి వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించడం శ్రేయస్కరం అని పేర్కొంటున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!.. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Gemini_Generated_Image_9ci6yy9ci6yy9ci6 (1).png",[],{"title":35,"description":36},"చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .","చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య.. అయితే బ్రష్ గట్టిగా చేశాంలే అని దీనిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, తరచూ ఇలా జరుగుతుంటే మాత్",[38,44,52,59,67,74,82,90,95,101],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":25,"published_at":43,"public_read_count":28},"kerala-news-former-kerala-cm-makes-sensational-comments-on-the-ed","Kerala: ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd48d6ce3-2cc6-4f90-ac05-2a7934cbba09.jpg","2026-09-10T02:26:57+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":25,"published_at":50,"public_read_count":51},"trumps-generosity-gifts-worth-42-lakh-for-the-staff","ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43600a89-807c-46b9-a83a-fa655fca5f64.jpg","Mamatha puppala","2026-09-10T03:40:45+00:00",106,{"slug":53,"title":54,"category":41,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":28},"bjp-mission-up","యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c96e512-13e2-4549-a500-33ffa13e1c56.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-10T03:41:56+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":25,"published_at":65,"public_read_count":66},"nhrc-directs-dgp-to-take-action-against-cm-revanth-and-pcc-chief","BRS : సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff65c37e2-eb41-4089-963d-1aea8c16dfce.jpg","Kumar","2026-09-10T04:14:53+00:00",3,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":49,"read_time":25,"published_at":72,"public_read_count":73},"ishan-kishans-rampage-all-time-record-set-by-smashing-350-runs-in-a-single-match","ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5e961470-ae7c-48f9-924a-2dc5de97b5bd.jpg","2026-09-10T04:26:57+00:00",2,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":79,"published_at":80,"public_read_count":81},"spirituality-who-built-the-tirumala-srivari-temple-an-interesting-historical-fact","Spirituality: తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44d8349b-fefb-4bf5-9801-8bfc6cfe7c93.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T01:51:05+00:00",208,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":15,"read_time":87,"published_at":88,"public_read_count":89},"technology-will-ai-become-a-threat-to-human-lives-in-the-next-ten-years","Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dd18253-ffe4-47fd-9cef-6276741e6366.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T01:42:07+00:00",259,{"slug":91,"title":92,"category":77,"image":93,"author":15,"read_time":79,"published_at":94,"public_read_count":28},"spirituality-food-is-a-manifestation-of-the-divine-are-you-aware-of-these-dining-guidelines-prescribed-by-our-elders","Spirituality: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన పెద్దలు చెప్పిన ఈ భోజన నియమాలు తెలుసా?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77533e1a-0624-4ab5-88a1-a35ed9087c9b.jpg","2026-09-10T01:27:01+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":56,"read_time":57,"published_at":100,"public_read_count":81},"gold-vs-copper","బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F629079b9-deab-4662-a29c-2f2abca1eb07.jpg","2026-09-09T17:57:54+00:00",{"slug":102,"title":103,"category":41,"image":104,"author":56,"read_time":105,"published_at":106,"public_read_count":107},"ai-powerd-aadhar","ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff41994e7-41e8-4fb1-9c94-08a864553cb0.jpg","9 నిమిషాల పఠనం","2026-09-09T17:32:14+00:00",157,[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]