[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5885,2090,"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6980d9e0-6053-4994-aa49-cd78248e697a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6980d9e0-6053-4994-aa49-cd78248e697a.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"Ganesh navratri","hyderabad","event","cm revanth reddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T11:26:37+00:00","2026-09-12T14:11:25+00:00",259,"\u003Cp>గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. వేడుకల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునరుద్ధరించామన్నారు.\u003C\u002Fp>\u003Cp>నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. నిర్వాహకులు ముందుగా అధికారులకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారాన్ని స్థానిక కమిషనరేట్లకు అందించాలని, దీంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ వేడుకలకు అవకాశం కల్పించినట్టే గణేశ్ నిమజ్జనాలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం చెరువుల చుట్టూ క్రేన్ల ఏర్పాటుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేశ్ నవరాత్రులు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు.\u003C\u002Fp>\u003Cp>కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేసి నవరాత్రుల వేడుకలను పర్యవేక్షించాలన్నారు. నిర్వాహకులతో సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు, మండప నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు. ఉత్సవాల నిర్వహణలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Revanth Reddy (25).jpg",[],{"title":34,"description":35},"గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీ","గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేం",[37,45,51,58,64,69,75,82,87,94],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-12T11:37:06+00:00",157,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":24,"published_at":49,"public_read_count":50},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",463,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":55,"published_at":56,"public_read_count":57},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","3 నిమిషాల పఠనం","2026-09-12T12:03:50+00:00",208,{"slug":59,"title":60,"category":16,"image":61,"author":62,"read_time":24,"published_at":63,"public_read_count":44},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","NK","2026-09-12T12:06:41+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":41,"read_time":42,"published_at":68,"public_read_count":44},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","2026-09-12T12:17:43+00:00",{"slug":70,"title":71,"category":16,"image":72,"author":62,"read_time":55,"published_at":73,"public_read_count":74},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","2026-09-12T11:12:12+00:00",55,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":41,"read_time":80,"published_at":81,"public_read_count":27},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T10:43:24+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":24,"published_at":86,"public_read_count":44},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","2026-09-12T10:11:11+00:00",{"slug":88,"title":89,"category":78,"image":90,"author":41,"read_time":91,"published_at":92,"public_read_count":93},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",106,{"slug":95,"title":96,"category":16,"image":97,"author":15,"read_time":24,"published_at":98,"public_read_count":99},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",2350,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]