[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":99},4237,1288,"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో వచ్చిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతైన కైలాష్ మానస సరోవర్ యాత్రికుల ఆచూకీపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24],"Sadhguru","TibetFloods","KailashMansarovar","GyirongFlashFloods","IshaFoundation","RescueOperation","4 నిమిషాల పఠనం","2026-08-27T07:17:12+00:00",157,"\u003Cp>నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో వచ్చిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతైన కైలాష్ మానస సరోవర్ యాత్రికుల ఆచూకీపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను కాపాడుకోవడానికి, గాలింపు చర్యల్లో చైనా అధికారులకు తమ వంతు సహకారం అందించడానికి గానూ గ్యిరాంగ్ వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆయన చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఇషా ఫౌండేషన్ నిర్వహించిన కైలాష్ యాత్రలో తమ బృందానికి చెందిన 80మంది ఆచూకీ ప్రస్తుతం తెలియడం లేదని సద్గురు వెల్లడించారు. వీటిలో 77మంది యాత్రికులు గ్యిరాంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద వేచి ఉన్న సమయంలో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడంతో వారితో అన్ని రకాల సంబంధాలు తెగిపోయాయని వాపోయారు. ప్రస్తుతం తాను సాగా ప్రాంతంలో అందుబాటులో ఉన్నానని, చైనా యంత్రాంగం అనుమతినిస్తే తక్షణమే వెళ్లి రెస్క్యూ ప్రక్రియలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>స్థానిక రెస్క్యూ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలకు తమ వల్ల ఎలాంటి ఆటంకం కలగదని, కేవలం బాధితుల కుటుంబాలకు కచ్చితమైన సమాచారం అందించడానికి, గాలింపు పనుల్లో సహాయపడటానికే అనుమతి కోరుతున్నట్లు ఆయన తెలిపారు. చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను ప్రభావిత ప్రాంతానికి వెళ్లనిస్తుందని ఆశిస్తున్నట్లు సద్గురు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>ఈ ఏడాది ఇషా ఫౌండేషన్ తరఫున మొత్తం 21బృందాలుగా కైలాష్ యాత్రకు వెళ్లగా, వారిలో 495మంది యాత్రికులు ఇప్పటికే సురక్షితంగా తిరిగొచ్చారు. ఇంకా 743మంది టిబెట్ భూభాగంలో, 148 మంది నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఉన్న వారిని సురక్షితంగా రప్పించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫౌండేషన్ వర్గాలు తెలిపాయి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-08-27 at 12.38.27 PM.jpeg",[],"https:\u002F\u002Fx.com\u002FSadhguruJV\u002Fstatus\u002F2092827271065387135?s=20",{"title":35,"description":36},"ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన","నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో వచ్చిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతైన ..",[38,45,52,57,64,70,77,83,88,94],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":25,"published_at":43,"public_read_count":44},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","16 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":44},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu","18 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":41,"image":55,"author":15,"read_time":25,"published_at":56,"public_read_count":27},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","33 నిమిషాలు క్రితం",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":15,"read_time":25,"published_at":62,"public_read_count":63},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","48 నిమిషాలు క్రితం",106,{"slug":65,"title":66,"category":48,"image":67,"author":50,"read_time":25,"published_at":68,"public_read_count":69},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","55 నిమిషాలు క్రితం",55,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":25,"published_at":76,"public_read_count":63},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar","59 నిమిషాలు క్రితం",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":75,"read_time":25,"published_at":82,"public_read_count":63},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","1 గంట క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":75,"read_time":25,"published_at":82,"public_read_count":63},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":93,"published_at":82,"public_read_count":69},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","5 నిమిషాల పఠనం",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":75,"read_time":25,"published_at":82,"public_read_count":63},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]