[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":99},4233,1286,"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","రాష్ట్రంలో 22 ఏ నిషేధితా జాబితా అంశంపై  మాజీ  మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా మరోసారి  స్పందించారు. కమీషన్ల కోసమే పట్టా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు.  రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో పెడతారా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"22A","prohibited lands","farmers","harishrao","brs","revantth reddy","5 నిమిషాల పఠనం","2026-08-27T06:42:56+00:00",106,"\u003Cp>రాష్ట్రంలో 22 ఏ నిషేధితా జాబితా అంశంపై  మాజీ  మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా మరోసారి  స్పందించారు. కమీషన్ల కోసమే పట్టా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు.  రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో పెడతారా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>కమీషన్ల కోసం రైతుల భూములను కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల వ్యవసాయ భూములతో పాటు, ఇతర మూడు లేఅవుట్లలోని భూములు, బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.22Aలో చేర్చడం వల్ల వారికి రైతుబంధు, రైతుబీమా లేదని, బ్యాంకు రుణాలు లేవని, యూరియా కూడా అందడం లేదన్నారు.\u003C\u002Fp>\u003Cp>మంత్రి పొంగులేటి  శ్రీనివాస రెడ్డిని రైతులు స్వయంగా కలిసి మొరపెట్టుకున్నా పరిష్కారం దొరకలేదన్నారు. కలెక్టర్, ఎమ్మార్వో సహా ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యమన్నారు. ఈ భూములు రైతులవేనని స్పష్టంగా పేర్కొంటూ ఆర్డీఓ ఇబ్రహీంపట్నం నోట్ రిపోర్ట్ ఇచ్చారని, అధికారుల వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ రైతుల భూములను 22A నుంచి ఎందుకు తొలగించడం లేదు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>‘ఇంత వివక్ష ఎందుకు?  కమిషన్ల కోసమేనా ఈ దందా? 30% కమీషన్ కోసం కోటి ఎకరాల భూములపై కన్నేశారా? వేల కోట్ల రూపాయల కోసం రైతుల భూములను బందీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా? ఒక్క ఎకరా కూడా కొత్తగా 22Aలో చేర్చలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. మరి రామదాస్‌పల్లి రైతుల భూములు 22Aలోకి ఎలా వచ్చాయి? రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవనోపాధిని దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>98 శాతం దరఖాస్తులు క్లియర్ చేశామని గొప్పలు చెప్పుకొంటున్న పొంగులేటి మాటలంతా వట్టి బూటకమన్నారు.అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం భూములను 22A నుంచి తొలగించడం లేదన్నారు.  ‘రేవంత్ రెడ్డి.. మీ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల చుట్టూ తిరగడానికేనా? ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కదులుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే దానిపై సమాచారం సేకరించే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు కనిపించడం లేదు?\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2092846300362662287?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2092846300362662287?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ప్రజల సమస్యలపై కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర నివేదిక తెప్పించండి. ఈ రైతుల భూముల సమస్యపై వెంటనే నివేదిక తీసుకుని, రైతుల భూములు 22A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించి రైతులకు న్యాయం చేయాలి’ అని కోరారు. మాటలతో కాలయాపన ఆపి.. వెంటనే రైతుల భూములను 22A నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేదంటే  రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బృందం రామదాస్‌పల్లికి వచ్చి, రైతులకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేస్తుందని హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"harish rao 22a.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FBRSHarish\u002Fstatus\u002F2092846300362662287?s=20",{"title":35,"description":36},"BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్","రాష్ట్రంలో 22 ఏ నిషేధితా జాబితా అంశంపై  మాజీ  మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా మరోసారి  స్పందించారు. కమీషన్ల కోసమే పట్టా భూములను నిషేధిత జాబితాలో",[38,47,54,62,68,74,80,85,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","11 నిమిషాలు క్రితం",3,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":43,"read_time":44,"published_at":52,"public_read_count":53},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","25 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":44,"published_at":60,"public_read_count":61},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","Anshu","33 నిమిషాలు క్రితం",55,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":44,"published_at":67,"public_read_count":27},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","37 నిమిషాలు క్రితం",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":44,"published_at":73,"public_read_count":27},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","55 నిమిషాలు క్రితం",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":44,"published_at":79,"public_read_count":27},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","1 గంట క్రితం",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":43,"read_time":25,"published_at":79,"public_read_count":61},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg",{"slug":86,"title":87,"category":50,"image":88,"author":43,"read_time":44,"published_at":79,"public_read_count":89},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg",157,{"slug":91,"title":92,"category":93,"image":94,"author":15,"read_time":44,"published_at":79,"public_read_count":61},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp",{"slug":96,"title":97,"category":41,"image":98,"author":15,"read_time":44,"published_at":79,"public_read_count":27},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]