[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-dsc-bhim-reddy-arrested-the-market-value-of-the-illegal-assets-amassed-by-bhim-reddy-is-estimated-to-be-well-over-150-crore-to-300-crore":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":98},183,"dsc-bhim-reddy-arrested-the-market-value-of-the-illegal-assets-amassed-by-bhim-reddy-is-estimated-to-be-well-over-150-crore-to-300-crore","డిఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..","పోలీసుశాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా చేరి, వ్రాత పరీక్షతో ఎస్సైగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0a1e19e0-a4a3-4acc-9898-570d1420b739.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0a1e19e0-a4a3-4acc-9898-570d1420b739.png","Desk 2","telangana",[15,17,18,19,20,21,22],"hyderabad","DSC Bhim Reddy","Arrested","illegal assets","150 crore","300 crore","4 నిమిషాల పఠనం","2026-07-06T15:35:33+00:00",463,"\u003Cp>భీమ్‌రెడ్డి అక్రమంగా కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు.. హైదరాబాద్‌ గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లోని నివాసం, ఆయన సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి మొత్తం 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. అప్పటి నుండి అజ్ఞాతంలో ఉన్న ఆయనను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం అధికారికంగా అరెస్ట్ చేసినట్టు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన ప్రాంతాల్లో ఏసీబీ బృందాల సోదాల అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. కాగా డీఎస్పీ భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాంనగర్, ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ విల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల ఎకరాల వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు భీమ్‌రెడ్డి తన దగ్గర పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్‌ల పేరిట కూడా కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వీటితో పాటు నిందితుడి ఇళ్ల నుంచి రూ.43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో నిందితుడిని రిమాండ్‌కు తరలించి, మరింత సమాచారం కోసం ఏసీబీ అధికారులు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>పోలీసుశాఖలోని ఒక డీఎస్పీ స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులోనూ భీమ్‌రెడ్డి పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. కాగా బినామీల పేరిట బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, కర్ణాటకలో మరో 44 ఎకరాల భూములు భీమ్‌రెడ్డి కొనడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. \u003C\u002Fp>\u003Cp>వేరే వారికి భీమ్‌రెడ్డి బినామీగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన కేసుల్లో ఒకటిగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Screenshot 2026-07-06 203002.png",[],{"title":32,"description":33},"డీఎస్సీ భీమ్ రెడ్డి అరెస్ట్.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే షాక్","పోలీసుశాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా చేరి, వ్రాత పరీక్షతో ఎస్సైగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వ్యవహారం గత కొన్ని రోజులుగా",[35,43,52,57,63,69,75,82,87,93],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":14,"read_time":40,"published_at":41,"public_read_count":42},"militant-atrocity-in-manipur-two-soldiers-killed-in-ied-attack","మణిపూర్ సరిహద్దుల్లో విషాదం!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb1d17bd0-6c03-4b04-9cef-1f15ea34f4b7.jpg","2 నిమిషాల పఠనం","2026-07-06T16:09:08+00:00",259,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"nag-100","Nag 100: లేడీ విలన్ గా టబు? మరి ఆ సీన్స్ లేనట్టేనా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9e4cd7c3-c625-4730-b48b-c932c7208932.jpg","Desk 7","3 నిమిషాల పఠనం","2026-07-06T16:11:37+00:00",412,{"slug":53,"title":54,"category":46,"image":55,"author":48,"read_time":49,"published_at":56,"public_read_count":25},"akhil","Akhil: లెనిన్ కోసం డ్రాగన్..క్రేజీ అప్‌డేట్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F906761c5-5d95-464c-821b-e41ab6dcbbd3.jpg","2026-07-06T16:34:01+00:00",{"slug":58,"title":59,"category":15,"image":60,"author":61,"read_time":23,"published_at":62,"public_read_count":51},"tg-14-day-remand-for-dsp-bhimreddy","TG: డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F35b0f80f-8d1d-4812-8962-9fbf437eb666.jpg","Desk 3","2026-07-07T03:27:31+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":61,"read_time":49,"published_at":68,"public_read_count":42},"heavy-rush-of-devotees-at-tirumala-12-hours-for-sarva-darshan","తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 12గంటలు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1c8feee8-8a47-4beb-9a40-1fd31dd5f80a.webp","2026-07-07T03:38:33+00:00",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":14,"read_time":23,"published_at":74,"public_read_count":51},"a-new-look-for-telangana-tourism","వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా తెలంగాణ.. పర్యాటక విప్లవానికి రేవంత్ సర్కార్ శ్రీకారం!..","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe55ad719-c403-449a-9ae4-6c0d09a28a30.jpg","2026-07-06T15:34:52+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":14,"read_time":49,"published_at":80,"public_read_count":81},"another-honor-for-india-on-the-global-stage-indonesia-accords-a-grand-welcome-to-modi","ప్రపంచ వేదికపై భారత్‌కు మరో గౌరవం.. మోదీకి ఇండోనేషియా ఘన స్వాగతం!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2f131352-4ff4-4cb7-94ab-062f895f9023.png","2026-07-06T14:12:10+00:00",208,{"slug":83,"title":84,"category":38,"image":85,"author":14,"read_time":49,"published_at":86,"public_read_count":42},"cheryal-mro-caught-by-acb-while-accepting-a-bribe","ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1ebdb534-8615-4831-bdb8-e402cfea56a3.jpg","2026-07-06T13:31:04+00:00",{"slug":88,"title":89,"category":46,"image":90,"author":48,"read_time":23,"published_at":91,"public_read_count":92},"kajal-aggarwal","Kajal Aggarwal: మండోదరిగా కనిపిస్తే సరిపోతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7a537850-a5e5-4e87-b855-9f52f893214d.webp","2026-07-06T12:12:29+00:00",310,{"slug":94,"title":95,"category":78,"image":96,"author":14,"read_time":49,"published_at":97,"public_read_count":81},"iran-makes-key-remarks-about-india-which-stood-by-it-during-difficult-times","కష్ట కాలంలో అండగా నిలిచిన భారత్‌పై ఇరాన్ కీలక వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbdbd059a-159d-49c8-b66d-e3eee40f1f18.jpg","2026-07-06T11:48:05+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]