[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},4425,1380,"delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi","Delhi: పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా, కార్గో రవాణాపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","Venu","national","routine",[16,19,20,21,22,23],"Delhi","Big shock","motorists","CNG prices","hiked","4 నిమిషాల పఠనం","2026-08-29T06:47:13+00:00","2026-08-29T06:48:04+00:00",55,"\u003Cp>పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు భారత ప్రజల దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతుండగా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మంటలు మధ్యతరగతి బ్రతుకులకు భారంగా మారాయి.. ఫలితంగా సామాన్యుడి జేబుపైనా అదనపు భారం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు మరోసారి భారీగా పెరిగాయి.\u003C\u002Fp>\u003Cp>ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్.. (ఐజీఎల్) కిలో సీఎన్‌జీపై ఏకంగా 3 రూపాయల 89 పైసలు పెంచింది. ఈ కొత్త ధరలు ఆగస్టు 29 శనివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు 83 రూపాయల 09 పైసలుగా ఉన్న కిలో సీఎన్‌జీ ధర.. ఇప్పుడు 86 రూపాయల 98 పైసలకు చేరింది. ఇక ఢిల్లీలో మాత్రమే కాదు.. నోయిడా, ఘజియాబాద్‌లో సైతం సీఎన్‌జీ ధర కిలో 95 రూపాయల 59 పైసలకు చేరగా.. గురుగ్రామ్‌లో 92 రూపాయల 01 పైసలకు పెరిగింది. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్.. అంటే ఎల్‌ఎన్‌జీ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా, కార్గో రవాణాపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. భారత్‌లో సీఎన్‌జీ కోసం ఉపయోగించే గ్యాస్‌లో కొంత భాగం దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీపై ఆధారపడటం వల్ల.. అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయ ధరలపైనా కూడా పడుతోంది.\u003C\u002Fp>\u003Cp>ఇక ఐజీఎల్ ప్రకారం అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని పూర్తిగా మోపకుండా ఇప్పటివరకు కొంతమేర నియంత్రించామని సంస్థ చెబుతోంది. అయితే ఇన్‌పుట్ గ్యాస్ ధరల పెరుగుదల గణనీయంగా మారడంతో తాజా ధర సవరణ అనివార్యమైందని వివరణ ఇచ్చింది. ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లకు సీఎన్‌జీ ధర పెరగడం అంటే నేరుగా నిర్వహణ ఖర్చులు పెరగడమే. \u003C\u002Fp>\u003Cp>ఇంధనం ఖర్చు పెరుగుతున్నా.. ప్రయాణికుల ఛార్జీలు అదే స్థాయిలో ఉంటే.. చివరకు అదనపు భారం తప్పదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. రవాణా ఖర్చులు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి.. కూరగాయలు, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలపైనా సైతం ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో మొదలైన సంక్షోభం.. అంతర్జాతీయ గ్యాస్ ధరలను పెంచి.. దేశీయ సీఎన్‌జీ ధరలను ప్రభావితం చేస్తోంది. అక్కడి ఉద్రిక్తతల ప్రభావం.. ఇక్కడి సామాన్యుడి జీవితానికి భారంగా మారుతుంది. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"594952-untitled-1.webp",[],{"title":34,"description":35},"పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా, కార్గో రవాణ",[37,45,52,58,64,72,77,82,87,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"immediate-changes-needed-in-the-state-cabinet-legislative-council-chairman-gutta-sukhender-reddy-makes-key-remarks","రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F03f7c625-9717-4a2a-9a60-25e79d1028dc.jpg","Mamatha puppala","10 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":42,"read_time":24,"published_at":50,"public_read_count":51},"good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason","గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","57 నిమిషాలు క్రితం",106,{"slug":53,"title":54,"category":40,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":27},"singer-mangli-overseas-trip-creates-a-sensation-what-are-the-answers-to-these-questions","Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb0494e1e-24b0-4194-81fc-a9165ed4fd02.webp","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":24,"published_at":57,"public_read_count":27},"deepika-padukone-raaka","Deepika Padukone: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","Anshu",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":70,"published_at":57,"public_read_count":71},"vijay-future-pm-of-india","మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","Kashi","11 నిమిషాల పఠనం",565,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":42,"read_time":24,"published_at":57,"public_read_count":51},"trump-needs-mental-treatment-irans-sarcastic-barbs","ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4aa8bb39-1e83-42e6-9026-afc6bcc9b7f8.jpg",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":42,"read_time":24,"published_at":57,"public_read_count":51},"england-batter-joe-root-sets-a-new-record-breaks-pontings-record","ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe74deeda-00fe-4073-9957-e95f7c1b14e8.jpg",{"slug":83,"title":84,"category":61,"image":85,"author":63,"read_time":24,"published_at":86,"public_read_count":27},"king-100-glimps","King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3f418420-329e-4385-83b9-e270c90998c4.jpg","2 గంటలు క్రితం",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":42,"read_time":91,"published_at":86,"public_read_count":51},"did-the-attempt-to-erase-kcrs-imprint-backfire-the-skills-university-has-lost-its-sheen","కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc88c4d88-79b7-47ac-9118-0b530ebbc2e6.jpg","7 నిమిషాల పఠనం",{"slug":93,"title":94,"category":40,"image":95,"author":69,"read_time":96,"published_at":86,"public_read_count":97},"greater-plan-of-all-parties","గ్రేటర్‌లో కాంగ్రెస్ బిగ్ ప్లాన్! బీఆర్ఎస్.. బీజేపీకి చెక్ పెట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3c20f98-80c2-40a7-bed5-6379c6750d8d.jpg","12 నిమిషాల పఠనం",310,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]