[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":33,"read_next":36,"sponsored_content":101},5582,"cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents","Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం","అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలపై ప్రత్యేక విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఐపీఎస్ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","NK","telangana",[17,18,19,20,21,22,23],"Cm Revanth","Telangana Assembly","Inquiry","Kcr","Brs","Telangana Congress","Swechaa News","6 నిమిషాల పఠనం","2026-09-09T12:30:55+00:00","2026-09-09T13:50:52+00:00",55,"\u003Cp>Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం\u003C\u002Fp>\u003Cp>Cm Revanth: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఐపీఎస్ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిని ఉప్పుపాతర వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు పన్నిన వ్యక్తులతో పాటు అమలు చేసిన వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు.. అనగా.. ఈ నెల 6న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కుట్రకు తెరతీశారని సీఎం రేవంత్ ఆరోపించారు. 7న స్పీకర్ పై మాటల దాడి జరిగిందన్నారు. 8న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో శుద్ధి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు కుట్ర చేసిన అందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మొత్తం ఘటనల వెనుకున్న బాధ్యులను గుర్తించి కోర్టు ముందు నిలబెడతామన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద శుద్ధి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. గతంలో సిద్ధిపేట కమిషనర్ గా పని చేసిన, ప్రస్తుత హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ ను కేసు పర్యవేక్షణ అధికారిగా నియమించి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. అనుకోకుండా జరిగిన ఘటనలను సరిదిద్దుకోవచ్చు.. కానీ కావాలని, కుట్రపూరితంగా, సమాజంలో చీలికలు తెచ్చేలా, దళితులు అనే భేదభావంతో సమాజాన్ని విభజించాలని చూస్తే మంచిది కాదని సీఎం రేవంత్ హితవు పలికారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>డప్పు కొట్టి నిరసన తెలపడం తప్పా\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ జరిగితే బీఆర్ఎస్ దురాగతాలు బయటపడతాయని కేసీఆర్ కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు.. అధికారుల మీద దాడి చేయడమే కాకుండా సభాపతిని దూషించారని మండిపడ్డారు. సభాపతి తల్లిని అవమానించడం దారుణమన్నారు. కేసీఆర్ క్షమాపణ చెబుతారని అందరూ భావించారు.. కానీ ఆయన క్షమాపణ చెప్పకపోవడంతోనే కుట్ర జరిగిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి డప్పు కొట్టి నిరసన తెలిపారని రేవంత్ వివరించారు. ప్రజాస్వామిక పద్ధతిలో దండోరా వేశారు తప్ప బీఆర్ఎస్ సభ్యుల్లా దూషించలేదు, దాడులు చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పా? అని సీఎం రేవంత్ నిలదీశారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>దళితులను అవమానించిన వారిని వదలం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దళిత సోదరులు నడిచిన నేల మలినమైందంటూ బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని.. కేసీఆర్, ఆయన కుటుంబం మనసులో పేరుకుపోయిన దొర అహంకారపూరిత అంటరానితనం ఆలోచనలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అంటరానితనాన్ని, వివక్షను, శుద్ధీకరణ కార్యక్రమాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. బాధ్యతతో వ్యవహరిస్తుందని రేవంత్ అన్నారు. దళిత సామాజికవర్గాలను, జాతులను అవమానించిన ప్రతి వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":12,"name":31},"Revanth Reddy (22).jpg",[],{"title":34,"description":35},"Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచా","Cm Revanth: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలపై ప్రత్యేక విచారణకు",[37,46,53,61,67,74,79,84,91,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","Mahesh","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",106,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"suriya-47-secene","Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-09T13:29:25+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":42,"read_time":58,"published_at":59,"public_read_count":60},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T13:29:36+00:00",157,{"slug":62,"title":63,"category":15,"image":64,"author":42,"read_time":51,"published_at":65,"public_read_count":66},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",2,{"slug":68,"title":69,"category":15,"image":70,"author":14,"read_time":71,"published_at":72,"public_read_count":73},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",0,{"slug":75,"title":76,"category":15,"image":77,"author":42,"read_time":58,"published_at":78,"public_read_count":60},"tg-politics-kcr-farmhouse-row-congress-bonus-step-backfires","TG: ఫామ్‌ హౌస్‌ పాలిటిక్స్‌.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd77460c2-ed02-4533-9416-87add1889e21.jpg","2026-09-09T11:58:34+00:00",{"slug":80,"title":81,"category":40,"image":82,"author":50,"read_time":51,"published_at":83,"public_read_count":27},"sreeleela-mokshagna","Sreeleela: మోక్షజ్ఞకి జంటగా విజ్జి పాప!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1c7173a-cd56-45f0-9331-a35942fa9cd8.jpg","2026-09-09T10:56:38+00:00",{"slug":85,"title":86,"category":15,"image":87,"author":88,"read_time":51,"published_at":89,"public_read_count":90},"even-family-members-wish-for-kcrs-downfall-tpcc-chief","Congress : కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F35e37721-4f88-4820-8351-a3b7c809107b.jpg","Kumar","2026-09-09T10:44:56+00:00",361,{"slug":92,"title":93,"category":15,"image":94,"author":88,"read_time":51,"published_at":95,"public_read_count":45},"kcr-must-die-mla-shankar-clarifies-his-remarks","Congress : ‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F14ed8c52-d6a3-4c6d-9f1d-782af8d799ea.jpg","2026-09-09T10:39:02+00:00",{"slug":97,"title":98,"category":15,"image":99,"author":88,"read_time":51,"published_at":100,"public_read_count":60},"they-are-all-deepfakes-a-smear-campaign-against-us-using-ai-images-ktr","KTR : అవన్నీ డీప్‌ఫేక్.. ఏఐ చిత్రాలతో మాపై దుష్ప్రచారం: కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F622093b1-b416-4b6b-9177-13e96c08f451.jpg","2026-09-09T10:35:20+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]