[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-brics-summit-in-delhi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":39,"published_at":40,"updated_at":40,"public_read_count":41,"body":42,"images":43,"video_url":5,"video_urls":46,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":47,"read_next":50,"sponsored_content":85},5515,1912,"brics-summit-in-delhi","భారత్‌లో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రపంచాన్ని శాసించబోతున్నారా?","ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు భారత్‌వైపు ఉంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్‌ ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతేకాదు.. బ్రిక్స్‌ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ సదస్సు జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe2ad62db-4919-4660-b8b9-bc9b9bee93d9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe2ad62db-4919-4660-b8b9-bc9b9bee93d9.jpg","Kashi","international","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32,33,34,35,36,37,38],"BRICS Summit","BRICS Summit 2026","BRICS India","BRICS India 2026","New Delhi BRICS Summit","BRICS Countries","India China Russia","BRICS Nations","Global Power","Global Politics","World Order","India Foreign Policy","China Russia India","BRICS Expansion","Emerging Economies","International Relations","Global Economy","Narendra Modi","New Delhi","BRICS News","7 నిమిషాల పఠనం","2026-09-08T18:53:00+00:00",55,"\u003Cp>ఒకే వేదికపైకి ఇండియా–చైనా–రష్యా \u003C\u002Fp>\u003Cp>ప్ర‌పంచంలో బ్రిక్స్‌ బలం ఎంత?\u003C\u002Fp>\u003Cp>ఢిల్లీ వేదికగా మారుతున్న ప‌రిణామాలు\u003C\u002Fp>\u003Cp>ప్ర‌పంచ‌దేశాల చూపు హ‌స్తిన వైపు...\u003C\u002Fp>\u003Cp>ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు భారత్‌వైపు ఉంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్‌ ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతేకాదు.. బ్రిక్స్‌ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ సదస్సు జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది.\u003C\u002Fp>\u003Cp>11 దేశాలు.. భారీ కూటమి\u003C\u002Fp>\u003Cp>బ్రిక్స్‌ అంటే ఒకప్పుడు బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా అనే నాలుగు దేశాల సమూహం. తర్వాత దక్షిణాఫ్రికా చేరింది. ఇటీవలి విస్తరణతో ఇప్పుడు ఈ కూటమిలో మొత్తం 11 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా ఇందులో ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఈ దేశాలన్నింటినీ కలిపి చూస్తే.. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం వాటా ఉన్న భారీ వేదికగా బ్రిక్స్‌ మారింది. 2024 లెక్కల ప్రకారం PPP ప్రాతిపదికన బ్రిక్స్‌ వాటా సుమారు 36.8 శాతానికి చేరిందని గ‌ణాంకాలు చెబుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఈసారి ప్రత్యేకత ఏంటి?\u003C\u002Fp>\u003Cp>ఈ బ్రిక్స్‌ సదస్సులో ఆర్థిక సహకారంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, టెక్నాలజీ, డిజిటల్‌ రంగం, గ్లోబల్‌ గవర్నెన్స్‌ వంటి అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది. భారత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఇప్పటికే MSMEలు, స్టార్టప్‌లు, ఫోటోవోల్టాయిక్‌ రంగం, లాజిస్టిక్స్‌, గ్లోబల్‌ సప్లై చెయిన్లపై సహకారానికి ప్రాధాన్యం ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cp>అంటే బ్రిక్స్‌ ఇక కేవలం ఒక రాజకీయ వేదిక కాదు. ఆర్థిక వ్యవస్థ నుంచి టెక్నాలజీ వరకు.. ఇంధనం నుంచి భద్రత వరకు.. అనేక రంగాల్లో సహకారానికి వేదికగా మారుతోంది.\u003C\u002Fp>\u003Cp>ఇండియా–చైనా–రష్యా.. ఒకే ఫ్రేమ్‌లో!\u003C\u002Fp>\u003Cp>ఈ సదస్సుకు మరో ప్రత్యేకత ఉంది. ఒకవైపు భారత్‌, మరోవైపు చైనా.. ఇంకోవైపు రష్యా. ఈ మూడు దేశాలకూ ప్రపంచ రాజకీయాల్లో ప్రత్యేకమైన బలం ఉంది. చైనా ప్రపంచంలోని అతిపెద్ద తయారీ, వాణిజ్య శక్తుల్లో ఒకటి. రష్యాకు విస్తారమైన ఇంధన వనరులతో పాటు సైనిక, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భారత్‌ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు భారీ మార్కెట్‌, యువ జనాభా, భౌగోళికంగా కీలకమైన స్థానం కలిగి ఉంది.\u003C\u002Fp>\u003Cp>ఈ మూడు దేశాలు ఒకే వేదికపై మరింత సమన్వయంతో పనిచేస్తే.. ప్రపంచ రాజకీయాల్లో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.\u003C\u002Fp>\u003Cp>ప్రపంచాన్ని శాసించగలరా?\u003C\u002Fp>\u003Cp>ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియా, చైనా, రష్యా కలిసి ప్రపంచాన్ని శాసిస్తాయా? అంత త్వరగా ఆ నిర్ణయానికి రావడం కష్టం. ఎందుకంటే బ్రిక్స్‌ అనేది నాటో తరహా సైనిక కూటమి కాదు. సభ్య దేశాల మధ్య అన్ని అంశాల్లో ఒకే అభిప్రాయం లేదు. ముఖ్యంగా భారత్‌, చైనా మధ్య సరిహద్దు, వాణిజ్యం, వ్యూహాత్మక పోటీ వంటి అంశాలు ఉన్నాయి. రష్యా–పశ్చిమ దేశాల సంబంధాలు మరో సంక్లిష్టతను తీసుకొస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అందుకే అమెరికాకు వ్యతిరేకంగా ఒకే కూటమిగా బ్రిక్స్‌ను చూడటం కంటే.. ప్రపంచ వ్యవస్థలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనుకునే అభివృద్ధి చెందుతున్న దేశాల వేదికగా చూడటం సరైనది.\u003C\u002Fp>\u003Cp>బ్రిక్స్‌ బలం ఎక్కడుంది?\u003C\u002Fp>\u003Cp>బ్రిక్స్‌ బలం ఒకే దేశంలో లేదు. సభ్య దేశాల సమిష్టి ఆర్థిక శక్తిలో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ వాటా, ఇంధన వనరులు, తయారీ సామర్థ్యం, వ్యవసాయం, సహజ వనరులు, విస్తారమైన మార్కెట్లు.. ఇవన్నీ ఒకే వేదికపైకి రావడం బ్రిక్స్‌ ప్రత్యేకత.\u003C\u002Fp>\u003Cp>ఇక బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. 2024లో సభ్య దేశాల మధ్య వస్తువుల వాణిజ్యం సుమారు 1.17 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు భారత వాణిజ్య శాఖ తెలిపింది.\u003C\u002Fp>\u003Cp>భారత్‌కు అసలు అవకాశం ఇదే\u003C\u002Fp>\u003Cp>ఈ మొత్తం వ్యవహారంలో భారత్‌ పాత్ర అత్యంత కీలకం. చైనా, రష్యాలతో సంబంధాలు కొనసాగిస్తూనే.. అమెరికా, యూరప్‌, ఇతర పాశ్చాత్య దేశాలతోనూ వ్యూహాత్మక సంబంధాలను భారత్‌ కొనసాగిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అందుకే బ్రిక్స్‌ అధ్యక్ష దేశంగా భారత్‌ ముందు ఉన్న అసలు సవాల్ ఎవరినో ఎదుర్కోవడం కాదు.. అందరినీ కలుపుకుంటూ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం.\u003C\u002Fp>\u003Cp>ఇండియా–చైనా–రష్యా కలిసి పనిచేయడం ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చు. కానీ ప్రపంచాన్ని ఒక్కసారిగా శాసించే శక్తిగా మారడం మాత్రం అంత సులభం కాదు. మొత్తానికి బ్రిక్స్‌ బలపడుతోంది.. ప్రపంచ సమీకరణాలు మారుతున్నాయి. ఆ మారుతున్న ప్రపంచంలో భారత్‌ ఎక్కడ నిలబడుతుందన్నదే అసలు ప్రశ్న.\u003C\u002Fp>",[44],{"url":13,"name":45},"brics_delhi_direction_1mb.jpg",[],{"title":48,"description":49},"BRICS Summit in India: Can It Reshape Global Power?","India hosts the BRICS Summit as major emerging powers unite. Can India, China and Russia reshape the global order through BRICS?",[51,59,67,73,79],{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"political-hidrama","తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8fe2282d-7b79-4ff1-aad3-93bed822bbb6.jpg","10 నిమిషాల పఠనం","2026-09-08T18:22:49+00:00",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":58},"youtuber-rama-nandu-police-interrogation-three-hours-no-clarity","YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7d40077-f035-41b3-9304-07cc20407d7d.jpg","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-08T16:30:49+00:00",{"slug":68,"title":69,"category":54,"image":70,"author":64,"read_time":65,"published_at":71,"public_read_count":72},"flight-ticket-prices-festival-season-300-percent-hike-swechaanews","Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb823f37-2ce9-40bc-9252-b08ef3c8077d.jpg","2026-09-08T16:20:07+00:00",4,{"slug":74,"title":75,"category":54,"image":76,"author":64,"read_time":77,"published_at":78,"public_read_count":41},"narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested","TG : నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","4 నిమిషాల పఠనం","2026-09-08T16:08:35+00:00",{"slug":80,"title":81,"category":54,"image":82,"author":83,"read_time":65,"published_at":84,"public_read_count":72},"bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology","DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","NK","2026-09-08T16:03:19+00:00",[86,91,94,96,98,100],{"title":87,"sponsor":88,"image":89,"url":90},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":92,"sponsor":93,"image":89,"url":90},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":95,"sponsor":93,"image":89,"url":90},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":97,"sponsor":93,"image":89,"url":90},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":99,"sponsor":93,"image":89,"url":90},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":101,"sponsor":93,"image":89,"url":90},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]