[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bjp-mission-up":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":34,"published_at":35,"updated_at":36,"public_read_count":37,"body":38,"images":39,"video_url":5,"video_urls":42,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":43,"read_next":46,"sponsored_content":116},5620,1964,"bjp-mission-up","యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!","ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. బీజేపీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బలహీనంగా కనిపించిన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఆధిక్యం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ వ్యూహంలో 115 అసెంబ్లీ సీట్లు కీలక టార్గెట్‌గా మారాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c96e512-13e2-4549-a500-33ffa13e1c56.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c96e512-13e2-4549-a500-33ffa13e1c56.jpg","Kashi","national","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32,33],"BJP","Uttar Pradesh Elections 2027","UP Elections","BJP Master Plan","Yogi Adityanath","Narendra Modi","Amit Shah","Uttar Pradesh Politics","BJP Strategy","115 Seats","UP Assembly Elections","BJP News","Indian Politics","Political Strategy","Yogi BJP Strategy","7 నిమిషాల పఠనం","2026-09-10T03:41:56+00:00","2026-09-10T03:42:22+00:00",55,"\u003Cp>యూపీ మ‌ళ్లీ బీజేపీదేనా..?\u003C\u002Fp>\u003Cp>పెద్ద రాష్ట్రంలో అతిపెద్ద వ్యూహం\u003C\u002Fp>\u003Cp>ఆ.. 115 సీట్లే టార్గెట్‌గా గేమ్ స్టార్ట్\u003C\u002Fp>\u003Cp>ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. బీజేపీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బలహీనంగా కనిపించిన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఆధిక్యం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ మొత్తం వ్యూహంలో 115 అసెంబ్లీ సీట్లు కీలక టార్గెట్‌గా మారాయి.\u003C\u002Fp>\u003Cp>115 సీట్లపై ఎందుకంత ఫోకస్?\u003C\u002Fp>\u003Cp>ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2022 ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి గణనీయంగా మారింది. యూపీలో బీజేపీ 80 లోక్‌సభ స్థానాలకు గాను 33 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్‌ 6 సీట్లు గెలుచుకున్నాయి. ఇదే బీజేపీకి ఇప్పుడు పెద్ద అలర్ట్‌గా మారింది.\u003C\u002Fp>\u003Cp>2024 లోక్‌సభ ఎన్నికల అసెంబ్లీ సెగ్మెంట్‌ లెక్కలను పరిశీలిస్తే.. బీజేపీ ప్రత్యేకంగా గుర్తించిన 115 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి 67 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. బీజేపీ 47 స్థానాల్లో, దాని మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో ముందంజలో నిలిచాయి. అంటే.. ఈ 115 సీట్లలో ప్రతిపక్షం చూపించిన బలాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరగరాయడమే బీజేపీ ముందున్న ప్రధాన సవాల్.\u003C\u002Fp>\u003Cp>ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యూహం!\u003C\u002Fp>\u003Cp>బీజేపీ అధిష్టానం యూపీని ఒకే కోణంలో చూడటం లేదు. ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఈ వ్యూహానికి మరింత వేగం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక్కడ జాట్‌ సహా కీలక సామాజిక వర్గాలను తమవైపు నిలబెట్టుకోవడం, మిత్రపక్షాల బలాబలాలను అంచనా వేయడం, బూత్ స్థాయి సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు అవధ్, కాన్పూర్‌ వంటి ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత బలహీనతలను గుర్తించి.. ఎక్కడ నాయకత్వ సమస్య ఉంది? ఎక్కడ కార్యకర్తల నెట్‌వర్క్ బలహీనంగా ఉంది? ఎక్కడ సామాజిక సమీకరణాలు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు సాగుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అభివృద్ధి పనులతో ఓటర్లకు చేరువ!\u003C\u002Fp>\u003Cp>115 నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మే 2026 నుంచి ఇప్పటికే 44 జిల్లాలకు పైగా పర్యటించిన యోగి.. ఈ 115 నియోజకవర్గాలకు సంబంధించిన రూ.38 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్‌, నీరు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>అంటే బీజేపీ వ్యూహం కేవలం పార్టీ సమావేశాలకే పరిమితం కావడం లేదు. ప్రభుత్వ పనులు.. సామాజిక సమీకరణాలు.. పార్టీ సంస్థాగత బలం.. ప్రజా సంబంధాలు—ఈ నాలుగు అంశాలను కలిపి ముందుకు వెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>కేంద్ర నాయకత్వం రంగంలోకి!\u003C\u002Fp>\u003Cp>ఇక ఈ మొత్తం ఆపరేషన్‌లో కేంద్ర నాయకత్వం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, యూపీ ఇన్‌చార్జి వినోద్‌ తావ్డేలు రాష్ట్రంలో వరుస పర్యటనలు, సమీక్షలు చేపడుతున్నారు. పార్టీ ఎంపీలతో నితిన్‌ నబీన్ ఇప్పటికే సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులు, కుల సమీకరణాలు, కార్యకర్తల ఉత్సాహం వంటి అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నట్లు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>వినోద్‌ తావ్డే కూడా యూపీలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. కులం, కమ్యూనిటీ, కమ్యూనికేషన్‌, కాంటాక్ట్‌ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే వ్యూహం తెరపైకి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>2027కి ముందే ఎన్నికల మోడ్!\u003C\u002Fp>\u003Cp>2027 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపగల 115 సీట్లను బీజేపీ ఇప్పటి నుంచే టార్గెట్‌గా మార్చుకుంది. 2022లో గెలిచిన స్థానాలను కాపాడుకోవడంతో పాటు.. 2024లో ప్రతిపక్షం బలపడిన ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించాలి. సామాజిక సమీకరణాలను మార్చాలి. కార్యకర్తల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.\u003C\u002Fp>\u003Cp>అందుకే యూపీలో బీజేపీ ప్లాన్ ఒక్కటే కాదు.. 115 సీట్లకు 115 వ్యూహాలా? అన్నంత స్థాయిలో ప్రాంతాల వారీగా కసరత్తు మొదలైంది. 2027లో యూపీ పీఠాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలంటే.. ఈ 115 సీట్లే బీజేపీకి అసలు పరీక్షగా మారబోతున్నాయి.\u003C\u002Fp>",[40],{"url":13,"name":41},"mission_up_compressed_1mb.jpg",[],{"title":44,"description":45},"BJP's UP Master Plan: Why 115 Seats Are the Target","BJP targets 115 key UP seats ahead of 2027 polls, focusing on weak constituencies, social equations and stronger grassroots organization.",[47,56,64,70,76,82,88,94,100,108],{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"nhrc-directs-dgp-to-take-action-against-cm-revanth-and-pcc-chief","BRS : సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff65c37e2-eb41-4089-963d-1aea8c16dfce.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-10T04:14:53+00:00",157,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":53,"published_at":62,"public_read_count":63},"ishan-kishans-rampage-all-time-record-set-by-smashing-350-runs-in-a-single-match","ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5e961470-ae7c-48f9-924a-2dc5de97b5bd.jpg","Mamatha puppala","2026-09-10T04:26:57+00:00",106,{"slug":65,"title":66,"category":50,"image":67,"author":52,"read_time":53,"published_at":68,"public_read_count":69},"key-post-for-madhu-yaskhi-telangana-congress-post-goes-viral","Congress : మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71eeaf7d-c65b-4a99-b37e-89b3d5ce2f1a.jpg","2026-09-10T04:31:19+00:00",718,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":61,"read_time":53,"published_at":75,"public_read_count":55},"shocking-suicide-after-poor-network-while-watching-reels","Shocking: రీల్స్ చూస్తుండగా నెట్‌వర్క్ సరిగా లేదని ఆత్మహత్య!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9d583cd0-d061-4d17-b848-b403437cdb16.png","2026-09-10T04:43:32+00:00",{"slug":77,"title":78,"category":73,"image":79,"author":52,"read_time":53,"published_at":80,"public_read_count":81},"a-key-turn-in-the-madras-regiment-arms-theft-case","HYD : మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf87317d-efff-4cee-938a-5b6aab057be6.jpg","2026-09-10T04:48:54+00:00",361,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":61,"read_time":53,"published_at":87,"public_read_count":63},"trumps-generosity-gifts-worth-42-lakh-for-the-staff","ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43600a89-807c-46b9-a83a-fa655fca5f64.jpg","2026-09-10T03:40:45+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":92,"read_time":53,"published_at":93,"public_read_count":37},"kerala-news-former-kerala-cm-makes-sensational-comments-on-the-ed","Kerala: ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd48d6ce3-2cc6-4f90-ac05-2a7934cbba09.jpg","Venu","2026-09-10T02:26:57+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":92,"read_time":53,"published_at":99,"public_read_count":37},"health-are-your-gums-bleeding-this-is-the-reason","Health: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fddb61b4e-3d1c-4dd9-8aac-cb2ad144d524.jpg","2026-09-10T02:04:18+00:00",{"slug":101,"title":102,"category":103,"image":104,"author":92,"read_time":105,"published_at":106,"public_read_count":107},"spirituality-who-built-the-tirumala-srivari-temple-an-interesting-historical-fact","Spirituality: తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44d8349b-fefb-4bf5-9801-8bfc6cfe7c93.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T01:51:05+00:00",208,{"slug":109,"title":110,"category":111,"image":112,"author":92,"read_time":113,"published_at":114,"public_read_count":115},"technology-will-ai-become-a-threat-to-human-lives-in-the-next-ten-years","Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dd18253-ffe4-47fd-9cef-6276741e6366.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T01:42:07+00:00",259,[117,122,125,127,129,131],{"title":118,"sponsor":119,"image":120,"url":121},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":123,"sponsor":124,"image":120,"url":121},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":126,"sponsor":124,"image":120,"url":121},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":128,"sponsor":124,"image":120,"url":121},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":130,"sponsor":124,"image":120,"url":121},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":132,"sponsor":124,"image":120,"url":121},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]