[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":95},5876,2086,"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","Bigg Boss : తెలుగు బుల్లితెరపై సంచలనాల రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, ఓట్లు గుద్దుతారు, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌తో యుద్ధాలే చేస్తారు. కానీ, మూడు నెలల హడావుడి ముగిసి, చేతికి ట్రోఫీ రాగానే ఆ విజేతల భవిష్యత్ ఏమవుతోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22],"Bigg Boss Telugu","Bigg Boss Winners","Bigg Boss Telugu Winners","swechaa news","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00","2026-09-12T10:06:50+00:00",106,"\u003Cp>Bigg Boss : తెలుగు బుల్లితెరపై సంచలనాల రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, ఓట్లు గుద్దుతారు, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌తో యుద్ధాలే చేస్తారు. కానీ, మూడు నెలల హడావుడి ముగిసి, చేతికి ట్రోఫీ రాగానే ఆ విజేతల భవిష్యత్ ఏమవుతోంది? ఇప్పటి వరకు పూర్తయిన తొమ్మిది సీజన్ల రికార్డులను నిశితంగా పరిశీలిస్తే ఒక కఠినమైన నిజం స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన వారెవరికీ వెండితెరపై నిలదొక్కుకునే అదృష్టం దక్కలేదు. చిత్రంగా, షోలో టైటిల్ కొట్టకుండా బయటకు వచ్చిన నటుడు శివాజీ సాధించిన రీ ఎంట్రీ, తొమ్మిది సీజన్ల విన్నర్లలో ఒక్కరికి కూడా సాధ్యం కాకపోవడమే ఇప్పుడు అసలైన హాట్ టాపిక్.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ట్రోఫీ వచ్చింది.. మరి వెండితెర అవకాశాలేవి?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేది రెండు కారణాల వల్ల. ఒకటి కోల్పోయిన గుర్తింపును తిరిగి దక్కించుకోవడం, రెండు పరిశ్రమలో అవకాశాల వేట. అయితే, మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ దాకా విన్నర్ల ప్రయాణాన్ని చూస్తే.. ఆ టైటిల్ గెలుపు వారి కెరీర్‌కు ఏమాత్రం అన్నం పెట్టలేకపోయిందన్నది చేదు నిజం.\u003C\u002Fp>\u003Cp>షో నడుస్తున్నంత కాలం సోషల్ మీడియాలో దేవతలుగా పూజలందుకున్న కంటెస్టెంట్లు, రియాలిటీ హౌస్ వీడగానే పూర్తిగా కనుమరుగైపోతున్నారు. ప్రేక్షకులు బిగ్ బాస్‌లో ఇచ్చే ఓట్లు వేరు, థియేటర్లలో టికెట్ కొని చూసే అభిమానం వేరు అనే స్పష్టమైన విభజన ఇక్కడ కనిపిస్తోంది. ట్రోఫీ గెలిచిన విన్నర్స్ కొందరు వెండితెరపై ప్రయత్నాలు చేసి, సినిమాలు విడుదల చేసినా ప్రేక్షకులు వాటిని కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా సినీ రంగంలో నిలబడలేక చాలామంది విన్నర్లు, కీలక కంటెస్టెంట్లు తమ జీవనోపాధి కోసం రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్ల వంటి ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు మళ్లాల్సి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>విన్నర్లు సైలెంట్.. కంటెస్టెంట్ శివాజీ మాత్రం..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఈ మొత్తం తొమ్మిది సీజన్లలో ఒకే ఒక్క మినహాయింపు దక్కింది సీనియర్ నటుడు శివాజీకి మాత్రమే. బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టిన ఆయన, హౌస్‌లో తనదైన వ్యూహాలు, మాటకారితనంతో విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. అయితే ఆయన ఈ సీజన్‌లో ట్రోఫీ గెలవలేదు. కానీ షో ముగిసిన వెంటనే శివాజీకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు, భారీ ప్రాజెక్టులు క్యూ కట్టాయి.\u003C\u002Fp>\u003Cp>తొమ్మిది సీజన్లలో ట్రోఫీ గెలిచిన విజేతలందరినీ ఒకవైపు, ట్రోఫీ దక్కించుకోని శివాజీని మరోవైపు ఉంచితే.. ఆయన అందుకున్న స్టార్డమ్, వచ్చిన ఆఫర్లు మరెవ్వరికీ రాలేదు. అయితే ఈ తేడా ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఇక్కడే అసలైన సూత్రం దాగి ఉంది..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నిజానికి శివాజీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టడానికి ముందే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో దశాబ్దాల అనుభవం, బలమైన పరిచయాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఆయనకు కేవలం ఒక రీ-ఎంట్రీ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే పనిచేసింది.\u003C\u002Fp>\u003Cp>కెమెరా ముందు ఆయన నటనకు ఇప్పటికే అభిమానులు ఉండగా, రియాలిటీ షోలో తన పెద్దమనిషి స్వభావానికి వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఆయనను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సహాయపడింది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>బుడగ లాంటి క్రేజ్.. \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మిగిలిన విజేతల విషయంలో బిగ్ బాస్ తెచ్చిన ఫేమ్ కేవలం నీటిబుడగలా ఎందుకు మారిపోయింది? షో ముగిసిన వెంటనే వచ్చే తాత్కాలిక క్రేజ్‌ను ఎలా మార్కెట్ చేసుకోవాలో చాలామందికి సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. కొందరు తమ వ్యక్తిగత వివాదాలు, తొందరపాటు నిర్ణయాలతో క్రేజ్ తగ్గించుకోగా, మరికొందరు తమకు నటన రాకపోయినా ప్రధాన పాత్రలే కావాలనే భ్రమల్లో ఉండి చేతులు కాల్చుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>బిగ్ బాస్ షో ఇచ్చేది కేవలం మూడు నెలల వెలుగు మాత్రమే అని, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడాలంటే స్వశక్తి, ప్రతిభ, సరైన వ్యూహం ఉండాలే తప్ప.. ‘విన్నర్’ అనే లేబుల్ ఒక్క రోజు కూడా పనికిరాదనే చేదు నిజాన్ని తొమ్మిది సీజన్ల ఫలితాలు నిరూపిస్తున్నాయి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Bigg-Boss.jpg",[],{"title":33,"description":34},"Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొ","Bigg Boss: తెలుగు బుల్లితెరపై సంచలనాల రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, ఓట్లు గుద్దుతారు,",[36,44,51,59,65,71,76,82,88],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-12T10:11:11+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":48,"published_at":49,"public_read_count":50},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T10:43:24+00:00",157,{"slug":52,"title":53,"category":39,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-12T11:12:12+00:00",0,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":41,"read_time":42,"published_at":63,"public_read_count":64},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","TG : గణేశ్ నవరాత్రులు.. నిర్వాహలకు సీఎం రేవంత్ కీలక సూచన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",2,{"slug":66,"title":67,"category":39,"image":68,"author":41,"read_time":42,"published_at":69,"public_read_count":70},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",616,{"slug":72,"title":73,"category":39,"image":74,"author":15,"read_time":48,"published_at":75,"public_read_count":26},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","2026-09-12T09:34:05+00:00",{"slug":77,"title":78,"category":39,"image":79,"author":41,"read_time":42,"published_at":80,"public_read_count":81},"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","2026-09-12T09:22:27+00:00",259,{"slug":83,"title":84,"category":39,"image":85,"author":41,"read_time":42,"published_at":86,"public_read_count":87},"farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity","TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","2026-09-12T08:59:38+00:00",208,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":93,"read_time":42,"published_at":94,"public_read_count":26},"18th-brics-summit-chinese-president-jinping-visits-india-after-seven-years","18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ca8244d-27f9-4631-8efc-ab1624420eb6.png","Mamatha puppala","2026-09-12T08:51:04+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]