[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":33,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},5417,1864,"appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water","మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!","తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"MuluguNews","TribalResidentialSchool","Seethakka","TelanganaNews","StudentProtest","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T04:52:23+00:00","2026-09-08T04:54:42+00:00",310,"\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, దుస్తులు ఉతికే నీళ్లనే తాగాల్సి వస్తోందని విద్యార్థినులు కంటతడి పెడుతూ తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తాగునీటి సమస్యపై ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్ తమను విచక్షణారహితంగా కొట్టారని, ప్రశ్నించిన విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. పాఠశాలలో వాష్‌రూములు తీవ్ర అధ్వానంగా తయారయ్యాయని, మరుగుదొడ్ల నుంచి మురికినీరు పొంగిపొర్లుతూ బయటకు వస్తోందని వారు వాపోయారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి చదువుకోవాల్సిన తమతో నీళ్లు మోయిస్తున్నారని, పాఠశాల ప్రిన్సిపాల్ ఎప్పుడూ అందుబాటులో ఉండకపోగా, సిబ్బంది కూడా తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క సొంత జిల్లాలోనే ఆదివాసీ, గిరిజన బాలికల పరిస్థితి ఇంత దారుణంగా తయారవ్వడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కనీస తాగునీరు, మరుగుదొడ్ల వసతులు కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>ఈ ఘటనతో గిరిజన సంక్షేమ గురుకులాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్, బాధ్యులైన అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో మౌలిక వసతులు, పరిశుభ్రమైన తాగునీటి సదుపాయాన్ని పునరుద్ధరించాలని హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-08 at 10.14.13 AM.jpeg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffbe03294-b52a-46d9-80da-7e19d9be6bc9.mp4",[33],{"title":36,"description":37},"మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు..","తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచ",[39,47,53,60,69,74,81,86,93,101],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"telangana-will-the-strategy-adopted-by-the-brs-against-the-congress-work","Telangana: కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff1275c2a-3df6-4760-9dad-3aaed42322f2.webp","Venu","5 నిమిషాల పఠనం","2026-09-08T05:25:03+00:00",106,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":25,"published_at":52,"public_read_count":46},"viral-this-is-what-a-room-costing-30000-in-dubai-looks-like-video-goes-viral-online","VIRAL: దుబాయ్‌లో రూ.30వేలకు దొరికే అద్దెగది ఇంతే మరి.. నెట్టింట వీడియో వైరల్‌!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66a07c78-b85c-47a9-9376-7c16d33e97d1.jpg","2026-09-08T05:32:20+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":25,"published_at":58,"public_read_count":59},"cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao","BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","Kumar","2026-09-08T05:35:37+00:00",208,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":68},"vijay-war-mode","ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-08T05:52:01+00:00",55,{"slug":70,"title":71,"category":16,"image":72,"author":57,"read_time":25,"published_at":73,"public_read_count":46},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","2026-09-08T06:00:05+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":79,"read_time":44,"published_at":80,"public_read_count":68},"sai-pallavi-telugu-movies","Sai Pallavi: \"తండేల్\" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd47846cc-5aa3-41e7-8c97-87d62bf59c58.webp","Anshu","2026-09-08T04:50:50+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":57,"read_time":25,"published_at":85,"public_read_count":46},"brs-mlas-intercepted-adjournment-motion-moved-in-the-assembly","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd39b43c8-6363-4695-99fc-792cfc92a150.jpg","2026-09-08T04:40:29+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":43,"read_time":91,"published_at":92,"public_read_count":46},"paris-gender-discrimination-in-paris-employees-protest-at-the-eiffel-tower","Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d2305fa-9c23-4e14-a9a7-6bc88ac7fbe6.webp","7 నిమిషాల పఠనం","2026-09-08T04:27:43+00:00",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":44,"published_at":99,"public_read_count":100},"is-the-revenue-target-2-lakh-crore","రెవెన్యూ డెన్ లక్ష్యం రూ.2లక్షల కోట్లు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdea4fb52-a012-403c-ab86-33e7b12aa079.jpg","Swechaanews Chairman","2026-09-08T04:24:34+00:00",157,{"slug":102,"title":103,"category":77,"image":104,"author":79,"read_time":25,"published_at":105,"public_read_count":46},"ssrajamouli-varanasi-highlights","SS.Rajamouli: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbf760928-85b8-449f-84c8-8aba42949441.webp","2026-09-08T04:13:17+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]