[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-amith-shah-tour-cancel":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":106},1190,"amith-shah-tour-cancel","అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణాలివేనా..?","ఎక్క‌డ మీటింగ్ పెట్టినా, నిర‌స‌నకారులు వ‌స్తే.. అన‌వ‌స‌రంగా ఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంద‌ని బీజేపీ భావిస్తోంది. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే దాకా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా ప‌ర్య‌ట‌న కూడా ర‌ద్దయిన‌ట్టు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8736e126-3172-4f56-96d4-46e22e8e6fe1.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8736e126-3172-4f56-96d4-46e22e8e6fe1.png","Kashi","telangana",[17,18,19,20,21,22],"Amit Shah","Karimnagar Visit","BJP Telangana","Karimnagar News","Parliament Session","Dharmendra Pradhan","6 నిమిషాల పఠనం","2026-07-25T07:22:00+00:00",157,"\u003Cp>కేంద్ర‌మంత్రి అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు\u003C\u002Fp>\u003Cp>ఆదివారం క‌రీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉన్న కేంద్ర‌హోంమంత్రి\u003C\u002Fp>\u003Cp>ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు జెన్ జీ ఉద్య‌మ‌మే కార‌ణ‌మా..?\u003C\u002Fp>\u003Cp>కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దయింది. ఈ మేర‌కు రాష్ట్ర పార్టీకి స‌మాచారం అందిన‌ట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉంది. పేరుకు ప్రైవేట్ కార్య‌క్ర‌మ‌మే అయినా... పార్టీ శ్రేణులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశాయి. ఆ కార్య‌క్ర‌మం ముగిశాక పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో అమిత్‌షా స‌మావేశ‌మ‌వుతార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దిశా నిర్దేశం చేస్తార‌ని బీజేపీ నాయ‌కులు భావించారు. ఇందుకోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌రీంన‌గ‌ర్ వ‌స్తార‌ని, కొద్ది రోజుల త‌ర్వాత త‌దుప‌రి తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని బీజేపీ హైక‌మాండ్ రాష్ట్ర పార్టీకి స‌మాచారమిచ్చిన‌ట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>జెన్‌జీ ఉద్య‌మ‌మే కార‌ణ‌మా..?\u003C\u002Fp>\u003Cp>ప్ర‌స్తుతం ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఓ పెద్ద ఉద్య‌మ‌మే చేస్తోంది. నీట్ పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నిర‌స‌న‌గా కేంద్ర విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. 4-5 రోజులుగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, ర్యాలీలు కొన‌సాగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఉద్య‌మం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ప‌లువురు బీజేపీ జాతీయ నాయ‌కులు, కేంద్ర మంత్రులు త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌ను వాయిదా వేసుకుంటున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. ఇదే వాస్త‌వ‌మ‌ని నాయ‌కులు చెబుతున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఎక్క‌డ మీటింగ్ పెట్టినా, నిర‌స‌నకారులు వ‌స్తే.. అన‌వ‌స‌రంగా ఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంద‌ని బీజేపీ భావిస్తోంది. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే దాకా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా ప‌ర్య‌ట‌న కూడా ర‌ద్దయిన‌ట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>ఆగ‌స్టు 13 దాకా పార్ల‌మెంటు వ‌ర్ష‌కాల స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. అప్ప‌టిదాకా సీజేపీ ఆందోళ‌న‌లు కూడా త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పార్ల‌మెంటులో కాంగ్రెస్ స‌హా విప‌క్షాల‌న్నీ కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్ర‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని హైక‌మాండ్ నిర్ణ‌యించింద‌ని స‌మాచారం. పార్ల‌మెంటు స‌మావేశం లేని రోజుల్లో కూడా అంద‌రూ ఢిల్లీలోనే ఉండాల‌ని పార్టీ కోరింద‌ట‌. ఏ క్ష‌ణంలో పిలుపొచ్చినా కేంద్ర‌మంత్రుల‌తంతా స‌మావేశం అయ్యేలా అల‌ర్ట్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే అమిత్‌షా త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో పార్టీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గుర‌య్యాయి. చాలా రోజుల త‌ర్వాత ఓ సీనియ‌ర్ నేత కరీంన‌గ‌ర్ వ‌స్తుండ‌డంతో.. బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా ఉన్నారు. అమిత్‌షా రాక కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"amith shah.png",[],{"title":32,"description":33},"Why Was Amit Shah's Karimnagar Visit Cancelled?","Union Home Minister Amit Shah's scheduled Karimnagar visit has reportedly been cancelled, triggering political speculation. ongoing nationwide protests",[35,44,53,60,68,75,82,87,94,100],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"has-jubilee-hills-international-centre-turned-into-a-club-of-squabbles","కయ్యాల క్లబ్‌గా మారిన  జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4d18f160-5a05-42e8-8879-b08e18ff809c.png","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2026-07-25T07:37:46+00:00",208,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"venuswami-90venuswami-venuswamis-sensational-prediction-a-90-loss-for-the-bjp","Venuswami: వేణుస్వామి సంచలన జోస్యం.. బీజేపీకి 90శాతం నష్టమా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fefa6b3c6-e8cf-4cc7-a9fb-efe8e249e3aa.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-07-25T07:58:03+00:00",259,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":49,"read_time":58,"published_at":59,"public_read_count":43},"putting-an-end-to-rumors-about-rohit-sharmas-retirement-bcci-vice-president-rajeev-shukla-provides-clarity","రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbb11e21f-7b59-43de-8050-b08181f16e92.png","4 నిమిషాల పఠనం","2026-07-25T08:10:59+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":49,"read_time":65,"published_at":66,"public_read_count":67},"big-breaking-union-education-minister-dharmendra-pradhans-sensational-resignation","Big Breaking: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe1503a9c-e512-4c3d-b299-f057e278faec.png","3 నిమిషాల పఠనం","2026-07-25T09:25:44+00:00",514,{"slug":69,"title":70,"category":63,"image":71,"author":72,"read_time":58,"published_at":73,"public_read_count":74},"cjps-abhijeet-dipke-first-reaction-after-dharmendra-pradhans-resignation","Abhijeet Dipke: ఇది విద్యార్థుల విజయం- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన అభిజీత్ దీప్కే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff8f2b470-5d2c-4470-bd54-a3b893206752.jpg","NK","2026-07-25T10:24:55+00:00",310,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":80,"read_time":58,"published_at":81,"public_read_count":25},"rukmini-vasanth","Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc264834d-acc5-45ad-8547-ba8d3cae5d3a.webp","Anshu","2026-07-25T07:05:20+00:00",{"slug":83,"title":84,"category":78,"image":85,"author":80,"read_time":65,"published_at":86,"public_read_count":74},"kollywood-maniratnam","Kollywood: సెట్స్ పైకి మణిరత్నం-సాయి పల్లవి ప్రాజెక్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7bcec4de-7716-48ad-9173-03be11d32bed.jpg","2026-07-25T06:34:11+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":49,"read_time":58,"published_at":92,"public_read_count":93},"indian-army-resignation-of-30000-soldiers-centre-clarifies-on-viral-video","Indian Army: 30 వేల మంది జవాన్ల రాజీనామా? వైరల్ వీడియోపై కేంద్రం స్పష్టత!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd111c2df-1cfb-4cd9-8089-9b19eef4b0c4.png","2026-07-25T06:14:16+00:00",106,{"slug":95,"title":96,"category":97,"image":98,"author":49,"read_time":58,"published_at":99,"public_read_count":25},"medchal-pg-medical-student-commits-suicide-by-jumping-from-the-fifth-floor","Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F07c5eb61-3aad-4a05-82d0-c19f323e0d11.jpg","2026-07-25T05:54:12+00:00",{"slug":101,"title":102,"category":103,"image":104,"author":49,"read_time":58,"published_at":105,"public_read_count":43},"heavy-pilgrim-rush-continues-at-tirumala-24-hours-required-for-srivari-darshan","తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F03fb2ec0-aa2a-456c-ba72-63b930f75c0b.png","2026-07-25T05:42:07+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]