[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-air-india-serious-action":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":29,"published_at":30,"updated_at":31,"public_read_count":32,"body":33,"images":34,"video_url":5,"video_urls":37,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":38,"read_next":41,"sponsored_content":108},5079,1696,"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","ఒక విమానం వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ప్రయాణికులు ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా విమానం వ్యవస్థల్లో అనూహ్య మార్పు.. ఆటోపైలట్ డిస్‌కనెక్ట్.. హెచ్చరికలు.. కొద్దిసేపు విమానం ఎత్తులో తీవ్ర హెచ్చుతగ్గులు. ఆ కొన్ని క్షణాలు విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉత్కంఠను కలిగించాయి. అయితే చివరకు విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","national","routine",[19,20,21,22,23,24,25,26,27,28],"Air India","Air India AI-2379","Pilot Drug Testing","Flight Safety","Pilot Fitness","Aviation Safety","AAIB Report","Phuket Delhi Flight","DGCA","Air India News","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00","2026-09-05T05:03:47+00:00",55,"\u003Cp>ఎయిర్ ఇండియా సంచ‌ల‌న నిర్ణయం.. \u003C\u002Fp>\u003Cp>100% పైలట్లకు స్వచ్ఛంద డ్రగ్ టెస్టింగ్ \u003C\u002Fp>\u003Cp>ఫుకెట్–ఢిల్లీ విమానంలో హైడ్రాలిక్ సమస్యపై సీరియ‌స్\u003C\u002Fp>\u003Cp>AAIB ప్రాథమిక నివేదికలో కీలక అంశాలు\u003C\u002Fp>\u003Cp>పైలట్ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్\u003C\u002Fp>\u003Cp>ఒక విమానం వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ప్రయాణికులు ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా విమానం వ్యవస్థల్లో అనూహ్య మార్పు.. ఆటోపైలట్ డిస్‌కనెక్ట్.. హెచ్చరికలు.. కొద్దిసేపు విమానం ఎత్తులో తీవ్ర హెచ్చుతగ్గులు. ఆ కొన్ని క్షణాలు విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉత్కంఠను కలిగించాయి. అయితే చివరకు విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.\u003C\u002Fp>\u003Cp>ఇది ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా AI-2379 విమానంలో చోటుచేసుకున్న ఘటన. ఈ ఘటనపై తాజాగా AAIB ప్రాథమిక నివేదిక వెలువడింది. ఆ రిపోర్ట్ తర్వాత ఎయిర్ ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తమ పైలట్లందరికీ 100 శాతం స్వచ్ఛంద పరీక్షలు ప్రారంభించింది. సంస్థ చెబుతున్న మాట ఒక్కటే.. భద్రత విషయంలో రాజీ లేనే లేదు.\u003C\u002Fp>\u003Cp>36 వేల అడుగుల ఎత్తులో ఏం జరిగింది?\u003C\u002Fp>\u003Cp>AI-2379 విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మొత్తం 137 మంది ప్రయాణికులతో పాటు సిబ్బందితో విమానం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. \u003C\u002Fp>\u003Cp>మొదట విమానంలోని గ్రీన్ హైడ్రాలిక్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గినట్లు సిస్టమ్ గుర్తించింది. ఆ తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే బ్లూ, ఎల్లో హైడ్రాలిక్ వ్యవస్థల్లోనూ ఒత్తిడి తగ్గినట్లు నమోదైంది. ఫలితంగా ఆటోపైలట్ డిస్‌కనెక్ట్ అయింది. కాక్‌పిట్‌లో హెచ్చరికలు వినిపించాయి. కొద్దిసేపు స్టాల్ వార్నింగ్ కూడా నమోదైంది.\u003C\u002Fp>\u003Cp>విమానం ఎత్తులో గణనీయమైన మార్పు రావడంతో క్యాబిన్‌లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 24 మందికి గాయాలయ్యాయి. క్యాబిన్‌లోని ఓవర్‌హెడ్ బిన్‌లు, ప్యానెల్స్, ఇతర భాగాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే కొద్దిసేపటికే వ్యవస్థలు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. విమానం తన ప్రయాణాన్ని కొనసాగించి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.\u003C\u002Fp>\u003Cp>అసలు కారణం తెలియాల్సి ఉంది...\u003C\u002Fp>\u003Cp>ఈ ఘటనలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మూడు హైడ్రాలిక్ వ్యవస్థల్లో ఒకేసారి ఒత్తిడి ఎందుకు తగ్గిందన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. AAIB ప్రాథమిక నివేదిక ఈ ఘటనలో ఏం జరిగిందో వివరిస్తోంది. కానీ దానికి అసలు సాంకేతిక కారణం ఏమిటో తుది నిర్ణయానికి రాలేదు. విమానంలోని సాంకేతిక డేటా, మెయింటెనెన్స్ రికార్డులు, ఇతర అంశాలను పరిశీలించడం ఇంకా కొనసాగుతోంది. Airbus, ఫ్రాన్స్‌కు చెందిన BEA కూడా దర్యాప్తులో సహకరిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం\u003C\u002Fp>\u003Cp>ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ఒక అదనపు ముందుజాగ్రత్త చర్యను ప్రకటించింది. తమ 100 శాతం పైలట్లకు స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది. ఇప్పటికే పైలట్లకు శిక్షణ, ప్రొఫిషియెన్సీ చెక్స్, మెడికల్ ఎగ్జామినేషన్స్ వంటి పలు నియంత్రణ ప్రక్రియలు ఉంటాయి. వాటికి అదనంగా ఈ చర్య తీసుకోవడం ద్వారా పైలట్ ఫిట్‌నెస్ విషయంలో మరింత కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాలన్న ఉద్దేశాన్ని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, ఏదైనా భద్రతా నిబంధన లేదా రెగ్యులేటరీ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా సంస్థ స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>విమాన భద్రతలో పైలట్ ఫిట్‌నెస్ ఎందుకు కీలకం?\u003C\u002Fp>\u003Cp>విమాన భద్రత గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఇంజిన్, సాంకేతిక వ్యవస్థలు, మెయింటెనెన్స్, వాతావరణం వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. కానీ విమానాన్ని నడిపే సిబ్బంది ఫిట్‌నెస్ కూడా అంతే కీలకం.\u003C\u002Fp>\u003Cp>వేల అడుగుల ఎత్తులో చిన్న సమస్య ఎదురైనా.. కొన్ని సెకన్లలో తీసుకునే నిర్ణయం ఎంతో ముఖ్యంగా మారుతుంది. అందుకే పైలట్ల శారీరక, మానసిక సామర్థ్యాలతో పాటు వారు నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించే స్థితిలో ఉన్నారా లేదా అన్నది కూడా విమాన భద్రతలో కీలక అంశంగా ఉంటుంది.\u003C\u002Fp>\u003Cp>ఇదే కారణంగా పైలట్ టెస్టింగ్‌ను మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. AAIB కూడా తన ప్రాథమిక నివేదికలో పైలట్లలో సైకోయాక్టివ్ పదార్థాల దుర్వినియోగాన్ని నివారించేందుకు నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని DGCAకి సూచించింది.\u003C\u002Fp>\u003Cp>ఎయిర్ ఇండియా సందేశం ఇదే..\u003C\u002Fp>\u003Cp>విమాన ప్రయాణంలో ప్రయాణికులు అన్నింటికంటే కోరుకునేది ఒక్కటే.. అదే సేఫ్టీ. ఒక విమాన సంస్థకు కూడా ప్రయాణికుల నమ్మకమే అతిపెద్ద ఆస్తి. AI-2379 ఘటన తర్వాత ఎయిర్ ఇండియా తీసుకున్న 100 శాతం పైలట్ టెస్టింగ్ నిర్ణయం.. ఆ నమ్మకాన్ని మరింత బలపరిచే ప్రయత్నంగా చూడొచ్చు.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు అసలు సాంకేతిక సమస్యకు కారణం ఏమిటి? మూడు హైడ్రాలిక్ వ్యవస్థల్లో ఒకేసారి ఒత్తిడి ఎందుకు తగ్గింది? భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఎలాంటి మార్పులు చేయాలి? అన్న ప్రశ్నలకు పూర్తి దర్యాప్తు తర్వాతే సమాధానాలు లభించనున్నాయి.\u003C\u002Fp>",[35],{"url":13,"name":36},"journey_safe_1mb.jpg",[],{"title":39,"description":40},"Air India Starts 100% Voluntary Drug Testing for Pilots","Air India begins 100% voluntary drug testing for pilots after the Phuket-Delhi AI-2379 incident, focusing on pilot fitness and flight safety.",[42,51,57,64,69,77,85,92,97,103],{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-05T05:23:34+00:00",106,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":47,"read_time":48,"published_at":56,"public_read_count":50},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":48,"published_at":63,"public_read_count":32},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","Anshu","2026-09-05T05:46:40+00:00",{"slug":65,"title":66,"category":45,"image":67,"author":47,"read_time":48,"published_at":68,"public_read_count":50},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":47,"read_time":74,"published_at":75,"public_read_count":76},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","5 నిమిషాల పఠనం","2026-09-05T06:39:17+00:00",2,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":83,"published_at":84,"public_read_count":32},"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T04:43:09+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":47,"read_time":83,"published_at":90,"public_read_count":91},"alarm-bells-ringing-massive-landslides-in-nepal","Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","2026-09-05T04:37:06+00:00",4,{"slug":93,"title":94,"category":60,"image":95,"author":62,"read_time":74,"published_at":96,"public_read_count":32},"rajinikanth","Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04f2d0c4-cf74-479d-8f1e-aa370c2a614d.webp","2026-09-05T04:35:36+00:00",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":82,"read_time":48,"published_at":102,"public_read_count":50},"accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident","Accident: నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","2026-09-05T04:24:03+00:00",{"slug":104,"title":105,"category":45,"image":106,"author":47,"read_time":48,"published_at":107,"public_read_count":50},"deadline-for-three-month-ration-quota-ends-today","TG : మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","2026-09-05T04:17:31+00:00",[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]