[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5534,1922,"a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled","చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!","బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో చోటుచేసుకున్న ఊహించని సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు దారుణంగా స్తంభించిపోయాయి. లండన్ పరిధిలోని గగనతలం తెరిచే ఉన్నప్పటికీ, విమానాల సమన్వయ వ్యవస్థ విఫలం కావడం వల్ల మంగళవారం ఒక్క రోజే వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేయాల్సి వచ్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24],"UKFlightCancellations","LondonHeathrow","AirTrafficControl","NATS","AirIndia","GlobalAviation","4 నిమిషాల పఠనం","2026-09-09T05:42:42+00:00","2026-09-09T05:43:28+00:00",106,"\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో చోటుచేసుకున్న ఊహించని సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు దారుణంగా స్తంభించిపోయాయి. లండన్ పరిధిలోని గగనతలం తెరిచే ఉన్నప్పటికీ, విమానాల సమన్వయ వ్యవస్థ విఫలం కావడం వల్ల మంగళవారం ఒక్క రోజే వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్స్ సంస్థలు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విమానాశ్రయాల్లోనే వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అవస్థలు పడ్డారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) అధికారులు, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సాంకేతిక అంతరాయం వల్ల లండన్‌లోని హీత్రూ, గాట్విక్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బర్మింగ్‌హామ్‌తో సహా 15కు పైగా ప్రధాన విమానాశ్రయాలలో రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. హీత్రూ ఎయిర్‌పోర్టులోనే ఏకంగా 100 విమానాలు రద్దు కాగా, మరో 367 విమాన సర్వీసులు తీవ్ర ఆలస్యంగా నడుస్తున్నాయి. గాట్విక్ విమానాశ్రయంలో కూడా దాదాపు 250 సర్వీసుల షెడ్యూల్ పూర్తిగా తలకిందులైంది. సంస్థల వారీగా చూస్తే బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఈజీజెట్‌తో పాటు కేఎల్‌ఎం, లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వందలాది విమానాలు నిలిచిపోయాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;యూకే గగనతలంలో తలెత్తిన ఈ ఆటంకాల ప్రభావం అంతర్జాతీయ సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థ 'ఎయిర్ ఇండియా' ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, బ్రిటన్ మీదుగా రాకపోకలు సాగించే తమ పలు విమాన సర్వీసులను వేరే మార్గాల్లోకి దారి మళ్లించినట్లు వెల్లడించింది. విమాన ల్యాండింగ్‌లు ఆలస్యం కావడం, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోవడం వల్ల రాబోయే మరికొన్ని సర్వీసుల సమయాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్‌లో ఇలాంటి సాంకేతిక వైఫల్యాలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023, 2024 సంవత్సరాల్లో కూడా ఇలాంటి తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల విమానయాన రంగానికి ఏకంగా 100 మిలియన్ డాలర్ల వరకు భారీ నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, విమాన రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టేలా ఉంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"images (2).jpeg",[],{"title":35,"description":36},"చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కు పైగా విమాన సర్వీసులు..","బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో చోటుచేసుకున్న ఊహించని సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు దారుణంగా స్తంభించిపోయాయి. లండన్ పరిధిలోని గగనతలం..",[38,45,51,57,62,68,75,83,90,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":28},"speakers-sensational-move-suspension-of-brs-mlas","BRS : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F59858a83-ba50-48fb-b786-5f66a5cbd4f7.jpg","Kumar","2026-09-09T06:01:23+00:00",{"slug":46,"title":47,"category":41,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":28},"the-kcr-farmhouse-purification-issue-major-uproar-in-the-telangana-assembly","కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc09b518b-ff4f-472f-9cd6-76bb755d0ae1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T06:07:58+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":43,"read_time":25,"published_at":56,"public_read_count":28},"woman-addicted-to-reels-commits-shocking-act-over-lack-of-internet-access","Viral : రీల్స్  బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f4907b7-68b5-4b04-bfa7-de571405ec01.jpg","2026-09-09T06:19:20+00:00",{"slug":58,"title":59,"category":41,"image":60,"author":43,"read_time":25,"published_at":61,"public_read_count":28},"what-action-has-been-taken-against-the-mla-who-wished-for-kcrs-death-former-minister-talasani","BRS : కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F701722ee-70fa-4de9-95e5-052eaa1d5036.jpg","2026-09-09T06:41:16+00:00",{"slug":63,"title":64,"category":41,"image":65,"author":15,"read_time":25,"published_at":66,"public_read_count":67},"where-is-the-response-to-the-attacks-on-women-mlas-sabitamma-and-sunitamma-lash-out","మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc9713e27-6e0e-4d07-9177-4b84f42e6ca7.jpg","2026-09-09T06:56:42+00:00",2,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":43,"read_time":73,"published_at":74,"public_read_count":28},"agent-sells-couple-for-15-lakh-goes-viral","Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T05:39:40+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":79,"read_time":80,"published_at":81,"public_read_count":82},"middle-east-war-re-start","మళ్లీ యుద్ధ మేఘాలు.. హార్ముజ్‌లో అమెరికా-ఇరాన్ పోరు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ab9fe8d-92d8-4912-b0ef-6b4f130ee562.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-09T05:37:27+00:00",55,{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":25,"published_at":89,"public_read_count":82},"sree-leela-hindi-movies","Sree Leela: ముంబైకి షిఫ్ట్ అవుతున్న డాన్సింగ్ క్వీన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fadc605e4-ae6a-410d-bafa-244d2acdc451.webp","Anshu","2026-09-09T05:25:14+00:00",{"slug":91,"title":92,"category":41,"image":93,"author":43,"read_time":25,"published_at":94,"public_read_count":95},"atrocities-against-women-brs-mlas-to-complain-to-the-governor-today","BRS : మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f77f796-dddb-425c-9d17-9d1d46ad0420.jpg","2026-09-09T04:47:15+00:00",157,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":25,"published_at":101,"public_read_count":28},"that-is-why-i-am-unable-to-return-to-india-from-london-vijay-mallya","లండన్ నుంచి అందుకే భారత్‌కు రాలేకపోతున్నా: విజయ్ మాల్యా","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6df8172-680a-4fe0-984c-8905cac49475.jpg","2026-09-09T04:40:42+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]